రంజాన్ ప్రార్థనల్లో భాగంగా కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా మసీదుల్లో భౌతిక దూరం పాటించాలని సూచించినందుకు పోలీసులపై కొంతమంది ముస్లింలు దాడి చేసిన ఘటన మంగళవారం గుజరాత్‌లోని కపద్వాంజ్‌లో జరిగింది. వివరాల్లోకి వెళితే గుజరాత్‌లోని కపద్వాంజ్‌లోని అలీ మసీదులో ప్రార్థనలకు వచ్చిన ముస్లింలు భౌతిక దూరం పాటించడం లేదని స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ మేరకు పోలీసులు మసీదు ప్రాంతాల్లో తనిఖీ చేసి కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు ప్రభుత్వం సూచించిన నిబంధనల ప్రకారం భౌతిక దూరం పాటించాలని వారికి సూచించారు. దీంతో అగ్రహావేశాలకు గురైన ముస్లిం గుంపు ఒక్కసారిగా వెళ్లి పోలీసు స్టేషన్‌పై, పోలీసులపై దాడి చేశారు. అక్కడున్న రెండు బైక్‌లు, ఒక కారును కూడా ముస్లిం మూక తగలబెట్టింది. జన సమూహాన్ని నియంత్రించడానికి పోలీసులు లాఠిచార్జి, టియర్ గాస్‌ను ప్రయోగించాల్సి వచ్చింది. ప్రపంచ శాంతి, శ్రేయస్సు కోసం రంజాన్ మాసంలో ముస్లింలు ఉపవాసం ఉంటూ ప్రార్థనలు చేస్తున్నట్టు చెప్పుకొగా ఇక్కడ కొంత మంది మాత్రం హింసాత్మక ఘటనలకు పాల్పడటం గమనార్హం.
Source : ORGANISER