కరోనా రెండో దశ విజృంభిస్తున్న నేపథ్యంలో అనేక మంది వైరస్ బారిన పడి, ఆస్పత్రుల్లో బెడ్లు అందుబాటులో లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితుల దృష్ట్యా ఆర్.ఎస్.ఎస్ సేవాభారతి-తెలంగాణ ఆధ్వర్యంలో ఒక కోవిడ్ ఐసోలేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌లోని అన్నాజీగూడలో ఉన్న రాష్ట్రీయ విద్యా కేంద్రం (ఆర్.వి.కే) లో ప్రస్తుతం 200 పడకలతో ఈ ఐసోలేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.
కోవిడ్ లక్షణాలు కనిపించకుండా, లేదా కొద్దిపాటి లక్షణాలతో RT-PCR పరీక్ష చేయించుంటే కోవిడ్ పాజిటీవ్ వచ్చిన వారికి ఈ ఐసోలేషన్ కేంద్రంలో ఉండే విధంగా ఏర్పాట్లు చేశారు. ఇక్కడ 24 గంటల పాటు వైద్యులు అందుబాటులో ఉంటూ సలహాలు, సూచనలు అందిస్తారు. ప్రతీ ఉదయం యోగా, వ్యాయామంతో పాటు మానసికంగా ఉల్లాసంగా ఉండే విధంగా ఇక్కడ వసతులను ఏర్పాటు చేశారు. కరోనా పాజిటీవ్ వచ్చి ఐసోలేషన్ కేంద్రం అవసరమున్న వాళ్లు 040-4821 2529 నంబర్ కు కాల్ చేసి ఉచితంగా ఆడ్మిషన్ పొందవచ్చు. ఇలా ఆడ్మిషన్ పొందిన వారికి మాత్రమే ఐసోలేషన్ కేంద్రంలో ప్రవేశం ఉంటుంది.
కోవిడ్ 19, వ్యాక్సినేషన్ కు సంబంధించి వైద్య నిపుణులు అందించిన వివరాల కోసం కింద లింక్ ను క్లిక్ చేయండి
కోవిడ్ పై Samachara Bharati అవగాహన కార్యక్రమంలో Doctors సలహాలు, సూచనలు