Home News భైంసాలో మతఘర్షణలకు కుట్ర: ఇద్దరు అరెస్ట్.. నిందితుల్లో మైనర్ బాలుడు  

భైంసాలో మతఘర్షణలకు కుట్ర: ఇద్దరు అరెస్ట్.. నిందితుల్లో మైనర్ బాలుడు  

0
SHARE

నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో ఇరువర్గాల మధ్య మతఘర్షణలకు పన్నిన కుట్రను పోలీసులు భగ్నం చేశారు. ఈ మేరకు నిర్మల్ ఎఎస్పీ కిరణ్ ఖారే మీడియా ప్రకటన విడుదల చేశారు. ఎఎస్పీ చెప్పిన వివరాల ప్ర‌కారం పట్టణంలోని పంజేషా మసీదు గోడపై కొందరు గుర్తుతెలియని వ్యక్తులు 26 మే అర్ధరాత్రి “జై శ్రీరామ్” అని రాసి పరారయ్యారు. దీనిపై మసీదు వర్గాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో, రంగంలోకి దిగిన పోలీస్ దర్యాప్తు బృందం, అక్కడి సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితులను 24 గంటలలో ఛేదించి పట్టుకుంది. తీరా చూస్తే పట్టుకున్న నిందితుల్లో ఒకరి పేరు అబ్దుల్ ముహమ్మద్ అబ్దుల్ కైఫ్  (తండ్రి పేరు ముహమ్మద్ అబ్దుల్ మాజిద్), వయసు 20 సంవత్సరాలు కాగా, మరొక నిందితుడు మైనర్ అయినందున వివరాలు వెల్లడించడం సాధ్యం కాదని ఎఎస్పీ తెలిపారు.

నిందితులిద్దరూ పంజేషా మసీద్ సమీపంలోనే నివాసం ఉంటారని, ఘటన జరిగిన రోజున రాత్రి పదిన్నర ప్రాంతంలో మైనర్ నిందితుడు తన జేబులో స్కెచ్ పెన్నుతో మసీదు గోడ ప్రాంగణానికి చేరుకోగా, అక్కడ ఉన్న సహనిందితుడు చెప్పినట్టే గోడపై జైశ్రీరామ్ అని రాసి పరారయ్యారు.  అక్కడి సీసీటీవీ ఫుటేజీ, నిందితుడి చేతిరాత ద్వారా ఈ పని చేసింది వారే అని ప్రాథమికంగా నిర్ధారణ కాగా, నిందితులు కూడా ఈ చర్యకు పాల్పడింది తామే అని స్వయంగా అంగీకరించినట్టు ఎఎస్పీ కిరణ్ ఖారే ప్రకటనలో తెలియజేసారు.