Home Telugu Articles అస‌లు కోవిడ్ కు కారణం ఎవరు ?

అస‌లు కోవిడ్ కు కారణం ఎవరు ?

0
SHARE

— ఎస్.గురుమూర్తి

18 నెలల క్రితం చైనా వూహాన్ నగరంలో వ్యాపించిన వైరస్ గురించి ఇప్పటికీ ప్రపంచానికి పూర్తి వివరాలు తెలియవు. మొదట్లో అధికారికంగా ఈ వ్యాధికి కోవిడ్19 అని నామకరణం చేసినా ఆ తరువాత మూడు నెలల్లో అనేకసార్లు ఆ పేరు మార్చారు. అసలు కోవిడ్ అనే పేరే చాలా విచిత్రమైనది, తప్పుదోవపట్టించేదిగా ఉంది. మహమ్మారిగా మారిన ఈ వ్యాధి సంవత్సర కాలం దాటినా ప్రపంచాన్ని భయపెడుతూనే ఉంది. ఈ వైరస్ ప్రకృతి సహజంగానే పుట్టిందా? లేక మానవ సృష్టా అన్నది ఇప్పటికీ తేలలేదు. వైరస్ ఎక్కడ పుట్టింది? ఎలా పుట్టింది? అన్నవి కేవలం సంచలనం కోసం, ఆసక్తితో అడిగే ప్రశ్నలు కావు. ఈ వైరస్ కు విరుగుడు కనుక్కోవలసిందే, తిరిగి వ్యాపించకుండా నివారించవలసిందే. ఈ ప్రశ్నలకు సమాధానం కనుక్కోవలసిన ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రత్యేక కమిషన్ సంవత్సర కాలం తరువాత కూడా ఎలాంటి నిర్ధారణకు రాలేకపోయింది. అయినా ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆ వ్యాధికి ఏకంగా ఒక పేరు పెట్టడమేకాక అది ప్రకృతి సహజంగా వ్యాపించినదేనని, వైరస్ పుట్టుపూర్వోత్తరాల గురించి పరిశీలన అవసరంలేదంటూ తేల్చేసింది. అయితే అసలు ఈ  కోవిడ్19 అనే పేరే మోసపూరితమైనదని, తప్పుదోవపట్టించేదని ఇప్పటికీ ప్రపంచం గ్రహించలేకపోతోంది. పేరులో ఏముంది?

కోవిడ్19 ఒక మోసపూరితమైన పేరు

వూహాన్ వైరస్ జంతువుల మార్కెట్ నుంచి పుట్టిందని మొదట చైనా అధికారులు కథనం ప్రచారం చేశారు. మన దేశంలో కూరగాయల మార్కెట్ ఉన్నట్లు చైనాలోని వూహాన్ లో జీవమున్న జంతువులను మాంసం కోసం విక్రయిస్తారు. చైనా కథనం వెంటనే 2002నాటి సార్స్ వైరస్ ను గుర్తుకుతెచ్చింది. అప్పుడు కూడా ఇలాగే ఈ జంతువుల మార్కెట్ లో విక్రయించే గబ్బిలాల నుంచి వైరస్ వ్యాపించింది. అప్పుడు వైరస్ జనోమ్ ను పరీక్షించి అది గబ్బిలాల నుంచి మనుషులకు వ్యాపించిందని తేల్చారు. కానీ కోవిడ్19కు కారణమైన వైరస్ గురించి సంవత్సరం తరువాత కూడా అలాంటి నిర్ధారణకు రాలేకపోయారు. అయినా చైనా, ప్రపంచ ఆరోగ్య సంస్థలు ఈ కొత్త వైరస్ పాత సార్స్ వంటిదేనని ప్రచారం చేశాయి.

మొదట్లో ఈ వైరస్ ను వూహాన్ న్యుమోనియా, వూహాన్ వైరస్ అని పిలిచారు. కానీ వెంటనే రంగంలోకి దిగిన ప్రపంచ ఆరోగ్య సంస్థ జనవరి, ఫిబ్రవరి రెండు నెలల్లోనే మూడుసార్లు వైరస్ పేర్లు మార్చింది. ప్రతిసారీ ఎలాంటి ఆధారాలు లేకపోయినా వైరస్ ను సార్స్ వైరస్ తో, జంతువుల మార్కెట్ తో జోడిస్తూ అది సార్స్ 2 తరహా వైరస్ అంటూ ప్రకటించింది. ఆ తరువాత జంతు సంబంధాన్ని స్థిరపరుస్తూ వైరస్ కు `కరోన వైరస్’ అని పేరు పెట్టింది. `నోవెల్ కరోనవైరస్ 2’ – 2019 –ఎన్ కొవ్ అని నిర్ధారించింది. తరువాత మరోసారి జంతువులకు సంబంధించినదని సూచిస్తూ `శ్వాసకోశ సంబంధిత కరోనవైరస్ 2’ – సార్స్ – కొవ్-2 అంటూ పేరు పెట్టింది. అలా జంతువులే కారణమంటూ వ్యాధికి `Covid19’(co-corona; vi – virus; d – disease) అని నామకరణం చేసింది. కానీ వూహాన్ వైరస్ కు జంతువుల మార్కెట్ కు సంబంధాన్ని నిరూపించలేకపోయిన చైనావారే కొన్ని నెలల్లోనే మాటమార్చారు. ఆ తరువాత సంవత్సరానికి స్వయంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ నిజనిర్ధారణ కమిషన్ కూడా `జంతువుల మార్కెట్ నుంచి వైరస్ పుట్టిందని చెప్పడానికి స్పష్టమైన ఆధారాలు లభించలేదు’ అంటూ ప్రకటించింది. అయినా ఇప్పటికీ మహమ్మారికి కారణం జంతువులే అన్న ప్రచారం  మాత్రం సాగుతోంది.

ఇప్పటివరకు ఎలాంటి ఆధారాలు లేని వైరస్ పుట్టుకను జంతువులతో ఎందుకు జోడిస్తున్నారు? దానికి కారణం ప్రకృతి నుంచి పుట్టిన వైరస్ అయినప్పటికీ అది ఎక్కడ నుండి వ్యాపించిందో ఆ భూభాగం లేదా దేశం పేరును ప్రస్తావించకూడదన్న ప్రపంచ ఆరోగ్య సంస్థ పాటిస్తున్న విధానం. ఆ విధంగా ఒక దేశపు పేరును ప్రస్తావించడం ఆ దేశస్తులను అవమానించడం అవుతుందన్నది ఆ విధానపు సారాంశం. అందువల్ల నెపాన్ని జంతువులపైకి నెట్టేశారు. అయితే ఆరోగ్య సంస్థ విధానం ప్రకృతి నుంచి వచ్చిన వైరస్ కు వర్తిస్తుంది. కానీ వూహాన్ వైరస్ ప్రకృతిసిద్ధమైనదా? మానవ సృష్టా? అన్నది ఇంకా తేలలేదు. అలాంటి పరిస్థితిలో మహమ్మారికి కారణమైన వైరస్ ప్రకృతిసిద్ధమైనదేనని నమ్మించే విధంగా పేరు పెట్టడం, ప్రచారం చేయడం నిజాన్ని దాచిపెట్టడం, ఆ నిజాన్ని వెలికితీయాలనుకునే పరిశోధనను తప్పుదోవపట్టించడమే అవుతుంది. అయితే వైరస్ చుట్టూ ఉన్న  చైనా, అమెరికాల భౌగోళిక రాజకీయాలు క్రమంగా బయటకు వస్తుండడంతో నిజం నిగ్గుతేలే అవకాశం ఉంది.

గబ్బిలాలు వూహాన్ కు ఎగిరివచ్చాయా?

వైరస్ గురించి ఎలాంటి వివరాలూ లేక చీకటిలో కొట్టుకుంటున్న ప్రపంచానికి నికలస్ వేడ్ బయటపెట్టిన విషయాలు ఎంతో ఉపయోగపడతాయి. వేడ్ కేవలం ఒక సాధారణ జర్నలిస్ట్ కాదు. అతను వైజ్ఞానిక శాస్త్రాన్ని గురించి అవగాహన కలిగినవాడు, రచయిత. నేచర్, సైన్స్ అనే వైజ్ఞానిక పత్రికలతోపాటు న్యూయార్క్ టైమ్స్ లో కూడా పనిచేశాడు. అతను ఇటీవల వ్రాసిన వ్యాసం (The Origin of COVID: Did people or nature open Pandora`s box at Wuhan? అనే ఈ వ్యాసం అణు శాస్త్రవేత్తల బులెటిన్ లో మే 5న ప్రచురితమైంది. ఈ బులెటిన్ ను ఆల్బర్ట్ ఐన్ స్టీన్ నేతృత్వం వహించిన మన్ హట్టన్ ప్రాజెక్ట్ శాస్త్రవేత్తలు ప్రారంభించారు) చైనాలో గబ్బిలాల వల్లనే వైరస్ వ్యాపించిందనే ప్రచారాన్ని పటాపంచలు చేసింది.

వేడ్ చాలా సాధారణమైన ప్రశ్న అడిగాడు – `వూహాన్ కు 15వందల కిలోమీటర్ల దూరంలోని యున్నన్ లో ఉన్న గబ్బిలాలు వూహాన్ లో వైరస్ ఎలా వ్యాప్తిచేయగలవు?’ గబ్బిలాలు 50 కి.మీ ల కంటే దూరం ఎగరలేవు. అంతేకాదు యున్నన్ గబ్బిలాలు వుహాన్ లోని జంతువుల మార్కెట్ లోని జంతువులకు మాత్రమే వైరస్ ఎలా అంటించగలవు? 2002లో సార్స్ వైరస్ వ్యాపించినప్పుడు నాలుగునెలల్లో దానికి కారణాలను కనిపెట్టగలిగారు. కానీ ఇప్పుడు సంవత్సరం పైగా గడిచినా ఎలాంటి నిర్ధారణకు రాలేకపోయారని వేడ్ అన్నాడు. చైనా వారు కూడా జంతువుల మార్కెట్ కథనాన్ని వదిలిపెట్టేశారని అతను గుర్తుచేశాడు. అలా యున్నాన్ లోని గబ్బిలాలు మనుషుల్ని ఏమి చేయకపోయినా వాటిపై నిందలు వేశారు. మరి గబ్బిలాల వైరస్ వుహాన్ కు ఎలా చేరింది? అదే వైరస్ కథలోని కీలకమైన అంశం. ఇది అమెరికా మాత్రం చైనా చెలిమి కోసం తాపత్రయపడుతున్న రోజులనాటి మాట.

`గబ్బిలం మహిళ’ వుహాన్ కు 100 గబ్బిలం వైరస్ లు తెచ్చింది

ఈ కొత్త వైరస్ గురించి వేడ్ చెప్పిన వివరాలు వెన్నులో వణుకు పుట్టిస్తాయి. ఈ వైరస్ కథలో షి ఝెంజిలీ కథానాయకురాలు లేదా  ప్రతినాయకురాలు. ఈమె చైనాలో గబ్బిలాలపై పరిశోధన చేస్తున్న వారిలో ప్రముఖురాలు. ఈమెను అక్కడ `గబ్బిలం మహిళ’ (bat lady) అని పిలుస్తారు.  వూహాన్ లోని వైరస్ పరిశోధన కేంద్రంలో పరిశోధనలకు నేతృత్వం వహిస్తున్న షి 2015 నవంబర్ లో యున్నన్ గుహల్లోని గబ్బిలాలకు సంబంధించిన వందలాది రకాల వైరస్ (కరోన వైరస్ లు) సేకరించి వూహాన్ కు చేర్చింది. ఉత్తర కరోలినా విశ్వవిద్యాలయానికి చెందిన రాల్ఫ్ ఎస్. బారిక్ అనే శాస్త్రవేత్తతో కలిసి షి కరోన వైరస్ పరిశోధన చేసింది. మానవులకు వ్యాధి కలిగించే విధంగా గబ్బిలం వైరస్ ల సామర్ధ్యాన్ని పెంచడం ఎలాగన్న విషయంపై ఇద్దరూ పరిశోధన చేశారు. వాళ్ళిద్దరూ కలిసి 2015 నవంబర్ లో కొత్త కరోన వైరస్ ను సృష్టించారు. సార్స్ 1 వైరస్ వెన్నెముకలో స్పైక్ ప్రోటీన్ స్థానంలో గబ్బిలం వైరస్ ను ప్రవేశపెట్టడం ద్వారా వైరస్ ను మానవులకు సోకేవిధంగా తయారుచేశారు. `ఈ కొత్త వైరస్ పొరపాటున బయటకు వస్తే అది ఎలా వ్యాప్తి చెందుతుందో చెప్పలేం’ అంటూ వూహాన్ వైరస్ పరిశోధన కేంద్రపు నిపుణుడు ఒకరు వ్యాఖ్యానించారని వేడ్ తన వ్యాసంలో పేర్కొన్నాడు. మరి అటువంటి భయంకరమైన వైరస్ లను ఎందుకు సృష్టిస్తున్నారు అంటే ఇంతకు ముందు వ్యాపించిన వైరస్ లకు విరుగుడుగా వీటిని తయారుచేస్తున్నామని అంటున్నారు. ఇప్పుడు ముఖ్యంగా సార్స్ 1 తిరిగి వ్యాపించకుండా జాగ్రత్త పడటం కోసమేనని చెపుతున్నారు. ఇలా ముందస్తు నివారణ కోసం చేసే ప్రయత్నాన్నే `గైన్ ఆఫ్ ఫంక్షన్’(GOF) అంటారు. అయితే ఈ ప్రయత్నం చేస్తున్నప్పుడు కొత్తగా సృష్టించే వైరస్ లు పాతవాటికంటే భయంకరమైనవి, ప్రమాదకరమైనవి కాకుండా చూసుకోవాలన్న నిబంధన ఉంది. తాము కరోన వైరస్ పై జరుపుతున్న పరిశోధనలో ఈ ప్రమాదభయం(risk) ఎక్కువగా ఉన్నా అది తప్పదని షి, బారిక్ లు సమర్ధించుకున్నారు.

ఇతర జంతువులు, మానవులకు సోకే విధంగా కరోన వైరస్ లను రూపొందించే పద్దతిని బారక్ తనతో కలిసి పనిచేసిన చైనా శాస్త్రవేత్త షి కి నేర్పాడని వేడ్ తన వ్యాసంలో పేర్కొన్నాడు. బారక్ దగ్గర నేర్చుకున్న విద్యను ఉపయోగించి మనుషులకు కూడా సోకే కరోన వైరస్ ను కనిపెట్టడంలో షి పరిశోధనలు కొనసాగించింది. బారక్, షి లు కలిసి పనిచేశారనడానికి ఆధారం ఏమిటి? వూహాన్ వైరస్ పరిశోధన కేంద్రానికి, అమెరికా పరిశోధకులకు మధ్య సంబంధాన్ని వెల్లడించే పత్రాలను వేడ్ తన వ్యాసంలో ఉటంకించాడు.

అది గబ్బిలం వైరస్ కాదు, గబ్బిలం మహిళ వైరస్

గబ్బిలం మహిళ షి ఏం చేసింది? తన పరిశోధనలో ఎలా విజయం సాధించిందన్న విషయాన్ని వివరించే రెండు ఆధారాలను వేడ్ పేర్కొన్నాడు. అందులో ఒకటి, షి పరిశోధనకు అమెరికా జాతీయ ఆరోగ్య సంస్థలు (NIH) మంజూరు చేసిన నిధులు. (ఫాక్స్ న్యూస్ (12.5.2021) ప్రకారం ఒబామా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు అమెరికా వూహాన్ వైరస్ పరిశోధన కేంద్రానికి నిదులు మంజూరు చేసింది. ఇవి 2005 నుండి 2019 వరకు అందుతూనే ఉన్నాయి) అమెరికా ఆరోగ్య సంస్థలు ఈ నిధులను పీటర్ డాస్ జెక్ అనే కాంట్రాక్టర్ ద్వారా షి కి అందజేశాయి. అప్పుడు తయారుచేసిన పరిశోధన ప్రణాళికా పత్రంలో `మానవులకు సోకే అవకాశం ఉన్న కరోన వైరస్ తయారిపై షి పరిశోధన చేస్తారు’ అని స్పష్టంగా పేర్కొన్నట్లు వేడ్ వెల్లడించాడు. అయితే షి అలాంటి వైరస్ తయారుచేశారా? లేదా అన్నది ధృవీకరించడం కష్టం. ఎందుకంటే చైనా ప్రభుత్వం ఆమె పరిశోధనశాలను మూసివేసింది. అయితే 2019 డిసెంబర్ 9న, అంటే వూహాన్ లో వైరస్ వ్యాపించడానికి సరిగ్గా ముందు, ఒక ఇంటర్వ్యూలో డాస్ జాక్ మాత్రం షి తన పరిశోధనలో విజయవంతమయ్యారని చెప్పాడని వేడ్ పేర్కొన్నాడు. తాము, అంటే వూహాన్ వైరస్ పరిశోధన కేంద్ర పరిశోధకులు, షి, డాస్ జాక్, 6,7 సంవత్సరాల పరిశోధన తరువాత 100 కొత్తరకం సార్స్ కరోన వైరస్ లు తయారుచేశామని డాస్ జాక్ ఆ ఇంటర్వ్యూలో చెప్పాడు. ఆ ఇంటర్వ్యూలోని 28 నిముషాల వద్ద `వాటిలో కొన్ని మానవ కణాలలోకి ఎక్కించగలిగాం. కొన్నిటి వల్ల కలిగే సార్స్ వ్యాధికి మందు లేదు. వాటికి వాక్సిన్ కనుగొనడం కూడా సాధ్యం కాదు. దీనిని బట్టి అర్ధమవుతుంది అవి ఎంత ప్రమాదకరమైనవో…’ అని డాస్ జాక్ అన్నట్లు వేడ్ తన వ్యాసంలో పేర్కొన్నాడు. `అత్యంత ప్రమాదకరమైనవి, వాక్సిన్ లకు కూడా లొంగనివి’ అంటూ డాస్ జాక్ గర్వంగా చెప్పాడు. ఇప్పుడు జరుగుతున్న అపారమైన ప్రాణనష్టం చూస్తే అది ఈ `గబ్బిలం మహిళ’, డాస్ జాక్ ల నిర్వాకమేనని అర్ధమవుతోంది కదా. నిజానికి గబ్బిలాలు ఎలాంటి వైరస్ ను వ్యాపింపచేయలేవు. కాబట్టి వుహాన్ లో మనుషులకు సోకిన వైరస్ గబ్బిలాల నుండి రాలేదు. ఆ గబ్బిలాల వైరస్ లను వూహాన్ కు తెచ్చి కొత్తరకం కరోన వైరస్ ను సృష్టించారు. అదే ఇప్పుడు ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తోంది.

ఇంతకీ ఈ కొత్త వైరస్ ను సృష్టించడానికి `గబ్బిలం మహిళ’ షి ఝెంజిలీకి నిధులు చేరవేసింది ఎవరు? పీటర్ డాస్ జాక్. ఆమె ఏకంగా 100 వైరస్ లను సృష్టించిందని, అవి ఎలాంటి మందు, వాక్సిన్ కు లొంగవని గొప్పగా చెప్పింది ఎవరు? పీటర్ డాస్ జాక్. వైరస్ ప్రయోగశాల నుండి లీక్ కాలేదంటూ శాస్త్రవేత్తలు సంతకాలు పెట్టిన ప్రకటనలు విడుదల చేసినది ఎవరు? పీటర్ డాస్ జాక్. వైరస్ ప్రయోగశాల నుండి లీక్ అయిందా? లేదా? అన్న విషయాన్ని నిర్ధారించడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏర్పాటుచేసిన విచారణ సంఘంలో సభ్యుడు ఎవరు? పీటర్ డాస్ జాక్. వైరస్ ను సృష్టించి షి ఎంత ఘోరానికి పాల్పడిందో, ఆ తప్పిదాన్ని దాచిపెట్టి పీటర్ డాస్ జాక్ కూడా అంటే దారుణానికి ఒడిగట్టాడని చెప్పాలి.

ఇది కథలో సగభాగమే. ఇంకా చాలా ఉంది. వూహాన్ లోని పరిశోధన కేంద్రం కేవలం ఒక పౌర సైన్స్ అకాడమీ మాత్రమే కాదు. అందులో తరువాతి ప్రపంచ యుద్ధానికి జీవాయుధాలతో సిద్ధంగా ఉండాలన్న పీపుల్స్ లిబరేషన్ ఆర్మీకి కూడా వాటా ఉంది. ఇది కేవలం ప్రజారోగ్యానికి సంబంధించిన విషయం కాదు. అది ప్రపంచ రక్షణ విషయం.

న్యూ ఇండియన్ ఎక్స్ ప్రెస్ సౌజన్యంతో….