నీళ్లు తాగడానికి మసీదులోకి వెళ్లిన 12ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడిన మౌలానా మహమ్మద్ ఇలియాస్ ను పోలీసులు అరెస్టు చేసిన ఘటన ఘజీయాబాద్‌లో జరిగింది. వివరాల్లోకి వెళితే రాజస్థాన్ లోని భరత్పూర్ కు చెందిన మహమ్మద్ ఇలియాస్ ఒక మసీదులో ఇమామ్‌గా వ్యవహరిస్తున్నాడు. ఇటీవల మసీదులోకి నీళ్లు తాగడానికి వెళ్లిన 12 ఏళ్ల బాలిక పై ఇలియాస్ అత్యాచారానికి ఒడిగట్టాడు. పైగా ఈ విషయం ఎవరికైనా చెబితే భయంకరమైన పరిణామాలుంటాయని చిన్నారిని బెదిరించాడు. కానీ ఆ చిన్నారి జరిగిన సంఘటనను తల్లిదండ్రులకు పూర్తిగా వివరించింది. దీంతో చిన్నారి తల్లిదండ్రులకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విషయం తెలుసున్న మహమ్మద్ ఇలియాస్ అక్కడి నుంచి పారిపోయి ఘజియాబాద్‌లోని తన ఇంటికి వెళ్లాడు.
విచారణ చేపట్టిన పోలీసులు సీసీ టివీ ఫుటేజీ నుంచి ఆధారాలు సేకరించి నిందితుడిని పట్టుకోవడానికి గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో ఘాజియాబాద్‌లో తన ఇంట్లో ఉన్న నిందుతుడు మహమ్మద్ ఇలియాస్ ను పోలీసులు అరెస్టు చేశారు. నిందుతుడికి వివాహమైంది. నలుగురు పిల్లలు ఉన్నారు. నిందితుడిపై పొక్సొ చట్టం కింద కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు.
Source : ORGANISER