Home Views అమెరికా యంత్రాంగం నిజాన్ని బయటపెడుతుందా, దాచిపెడుతుందా ?

అమెరికా యంత్రాంగం నిజాన్ని బయటపెడుతుందా, దాచిపెడుతుందా ?

0
SHARE
1215499549

– ఎస్. గురుమూర్తి

శాస్త్రీయ రచయిత నికోలస్ వేడ్ “వైరాలజీ విభాగం” ఎలా తికమక పెట్టిందో మరిన్ని విషయాలను వెలువరిచారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎలా లోబర్చుకోబడిందో ట్రంప్ వ్యతిరేక మీడియా ఎందుకు మౌనం వహించి పాలనా యంత్రగాన్ని చీల్చి దోషులను తప్పించిందో. ఒక బాధ్యతాయుత రచయితగా అత్యంత సున్నితమైన వుహాన్ వైరాలజీ ఇనిస్టిట్యూట్ కు పిఎల్ఏ (చైనీస్ సైన్యం)కు ఉన్న సంబంధాన్ని ప్రస్తావించలేదు. ఇది ఇప్పుడు క్రమంగా బయట పడుతోంది. రెండు మిత్ర దేశాలు కలిసి చేసిన పని వారి సంబంధాలను ఏమి చేసింది. ప్రపంచాన్ని అమెరికా, చైనా ఏమి చేయబోతున్నాయి.

భౌగోళిక వ్యూహాలలో నిన్న మొన్నటి కథ‌లు తప్ప ఎటువంటి ప్రాచీన చరిత్ర లేని అమెరికా, ప్రచ్ఛన్న యుద్దం తరువాత ధనిక దేశమైన చైనా ప్రజాస్వామ్య బద్ధమవుతుందనే తన ఊహకు తగిన మూల్యాన్ని చెల్లించుకుంటోంది. ఒక గొప్ప భారతీయ తాత్వికుడు 1973లో “కమ్యూనిజం అనేది చైనాలో ఒక దశ మాత్రమే ఒక కన్ఫూషియన్ చైనా అనేది ఇందులోంచి పుట్టుకు వస్తుంది అదే పటిష్టంగా నిలబడుతుంది” అని అన్నాడు. ఈ విషయాన్ని ఆధునిక అమెరికా గుర్తించలేక మరిచింది. మార్క్సిస్టు చైనా తనని ఒక వ్యాపార వాద ఆర్థిక వ్యవస్థగా చూపించి అమెరికాను మరిపించి 2001 లో ప్రపంచ ఆర్థిక సంఘంలో చేరింది. సరిగ్గా 18 సం|| తరువాత అదే సంఘంలో చైనా వ్యాపారవాద ఆర్థిక వ్యవస్థ కాదని అమెరికా, ఐరోపా సమాఖ్య గొడు వేళ్లబోసుకున్నాయి. ఆఖరికి ప్రపంచ ఆర్థిక సంఘం కూడా దాని గుర్తింపు రద్దు చేసింది. దీని ద్వారా చైనా ముందుచూపు , అమెరికా ఆలోచనా లేమి తెలుస్తాయి. ట్రంప్ వచ్చేటప్పటికే అమెరికా తన అన్ని వ్యాపార సంబంధాలలో చైనా ముడి సరుకుపై తిరగరాయలేనంతగా ఆధారపడుతోంది. చాలా విషయాల్లో అమెరికా చైనా సంయుక్త భాగస్వామ్య కార్యక్రమాలు చేస్తుండేవి, కానీ చైనా మాత్రం ఎన్నడూ తన ఆలోచనని ఆచారణని బయటపెట్టలేదు. కరోనా వైరస్ పరిశోధనలో కూడా చైనా తన లక్ష్యాన్నే పెట్టుకుని కదిలి అమెరికాను తప్పుదోవ పట్టించింది. విషయాలు బయటపడ్డాక ఇద్దరికీ చెడ్డ పేరు వచ్చినప్పటికీ అమెరికాకు అసమర్థ అనే గుణనామం వచ్చింది.

చైనా అమెరికా ఏమి మాట్లాడుకుని ఉంటాయో వేడ్ ఇలా ఊహించాడు. చైనా “ఈ పరిశోధన అంతా ప్రమాదకారి అయినప్పుడు మీరేందుకు దీనికి ఆర్థిక సాయం కల్పిస్తున్నారు అది కూడా మా దేశంలో ఎందుకు “ అంటే , దానికి అమెరికా “ఇదంతా చూస్తే మీరే దీన్ని బయటికి వదిలినట్టుంది అయినా అందరి మధ్యలో మనం ఇవన్నీ మాట్లాడవద్దు” అని అనుంటుంది. అమెరికాలో ఎన్ఐఏడి డైరెక్టర్ అయిన ఆంథోనీ ఫౌకి ట్రంప్ సమయంలో అసమర్థంగా బైడెన్ వద్ద సమర్థవంతంగా దీన్ని ఎదుర్కోవడం చూస్తే అమెరికా కాంగ్రెస్ కు షీ జెనగిల్ పరిశోధనకు సహాయం అందించినందుకు ఇతన్ని దోషిగా నిలబెట్టేందుకు అవకాశం దొరికింది. ఫలితం, ఈ ఉపద్రవానికి సంబంధించిన నిజాన్ని చైనా దాస్తుంటే దాన్ని అమెరికా సంపూర్ణంగా సమర్థిస్తుంది.

ఇక శాస్త్రవేత్తల వైపు చూస్తే. వుహాన్ లో వైరస్ వ్యాప్తి చెందిన వుహాన్ ఇస్టిట్యూట్ ఆఫ్ వైరాల‌జీ (WiV) ను కారణగా చూపినప్పుడు, కొందరు వైరాలజిస్టులు మరికొందరు కలిసి లానసెంట్ లో ఫిబ్రవరి 9 2020 న “కోవిడ్ 19 ప్రకృతి లో నుండి పుట్టలేదు అనే కుట్ర పూరిత సిద్ధాంతాలను మేము మూకుమ్మడిగా ఖండిస్తున్నాము” అని, “శాస్త్రవేత్తలు కలిసికట్టుగా కరోనా వైరస్ జంతుజాతి నుండే ప్రబలిందని నిష్కర్షకు వచ్చారు”అనీ , తమ చైనీ సహచరులకు దీని మీద పోరాడేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ పరిణామ క్రమం , వాటి వ్యవధి జానాభిప్రాయాన్ని చాలా మేరకు ప్రభావితం చేశాయి.

జనాభిప్రాయాన్ని ప్రభావితం చేసిన మరొక పెద్ద ఘటన సహజ వైద్య జర్నల్ లో 17 మార్చి 2020 న ఒక వైరాలజిస్టుల బృందం రాసిన లేఖ. అందులోని రెండవ పంక్తిలో సార్స్ 2 అనేది “ప్రయోగ శాల లో తయారైనది” కాదు అని ఖరాఖండీ గా తేల్చింది. అలాగే ఇది పరిశోధనాశాల లో తయారైంది అనడం “అసంబద్ధం” అనీ, అనడం ద్వారా తమ విజ్ఞతని బయట పెట్టుకున్నారు. అయినప్పటికీ వాళ్ళని ఎవరూ ప్రశ్నించలేదు ఎందుకని ? విశ్వవిద్యాలయాల్లో “భావ వ్యక్తీకరణ” వలన, “పరిమితి దాటడం” వలన , ఉద్యోగ అవకాశాల్లో ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుందని , ఎవరైనా ఆమోదించబడిన నిర్ణయాలకు వ్యతిరేకంగా తమ అభిప్రాయాన్ని తెలిపితే వాళ్లు తరువాయి విజ్ఞప్తులకు అనుమతులు కష్టతరం అవుతాయి అని వేడ్ అభిప్రాయం. వైరాలజిస్టులు తమకు అనుకూలమైన పత్రికల్లో ప్రభుత్వానికి అనువైన రాతలు రాయడం, సదస్సుల్లో పాల్గొనడం, గౌరవ వేతనం అందుకోవడం ఇవే లక్ష్యంగా పని చేస్తున్నారు అని అంటాడు వేడ్. ఇది శాస్త్ర పరిశోధనా రంగానికి సంబంధించి గమనార్హమైన విషయం.

ప్రపంచ ఆరోగ్య సంస్థ పాత్ర ఒక సారి పరికిస్తే. మొదట ఇది వైరస్ కు పేరు పెట్టడంలో దానిది సహజ పుట్టుక అనే సిద్ధాంతాన్ని అవలంబించింది. దీనిది సహజ పుట్టుకా లేక మానవ నిర్మితమా అనే విషయాన్ని విచారించే కమిషన్ బృందం చైనా అధికారుల కనుసన్నల్లో పని చేసింది. వేడ్ చెప్పేదాని ప్రకారం ఆ బృందంలో ఒకడైన నిస్పాక్షికుడిగా పేరున్న పీటర్ దజాక్ కూడా మొదటి నుండి చివరి వరకు ల్యాబ్ నుండి ఇది బయటికి వెళ్ళడం సాధ్యం కాదు అనే అంటూ వచ్చాడు అని. చైనా వద్ద ఇది సహజంగా పుట్టింది అనడానికి ఎటువంటి ఆధారాలు లేవు. చైనా కేంద్ర అధికారులు రికార్డులను దాచడం , వైరస్ పట్టికలను ముయ్యడం,తప్పుదోవ పట్టించడానికి కొంత వెలువర్చడం ద్వారా ఈ కుట్రను దాచి పెట్టేందుకు తమ శాయశక్తులా ప్రయత్నించారు. దీన్ని ఆపడం , ఎదుర్కోవడం కంటే వాళ్ళ మీద నింద పడకుండా చూసుకోవడానికే ప్రయత్నించారు. ఫిబ్రవరి 2021 లో ప్రపంచ ఆరోగ్య సంస్థ బృంద చైనా పర్యటన వరకు మీడియా ప్రచారం కల్పిస్తూ వచ్చిన సహజ పుట్టుక సిద్ధాంతం ప్రశ్నలకి అతీతంగా ఉండింది.ఆ పర్యటన తరువాత ఆ కమీషను నిజాన్ని బయట పెట్టలేదు , చైనా కీ సహాయపడలేదు ఒక నిరుపయోగ బృంద మనే అప్రదిష్టను మూటగట్టుకుంది.

అమెరికా మీడియా లో ఈ పరిశోధనాశాల నిర్మితం అనే విషయం పై నిశ్శబ్దం , 3.5 మిలియన్లను బలిగొన్న ఈ వైరస్ పై మరింత విచారణ అవసరం అని సూచిస్తోంది అని వేడ్ సరిగ్గా అభిప్రాయ పడ్డాడు. మీడియా లో ఈ నిశ్శబ్దానికి రెండు కారణాలను గుర్తించాడు. మొదటిది వైరాలజిస్టుల అభిప్రాయం కాగా రెండవది ట్రంప్ ఇది వూహన్ ల్యాబ్ నుండి పుట్టింది అన్నారు కాబట్టి అతనికి వ్యతిరేకంగా ఉన్న మీడియా లోని ప్రధాన వర్గం దానికి విశ్వసనీయ సమాచారం అని పక్కకు తోసింది. ల్యాబ్ నుండి వచ్చింది అనే విషయన్ని పూర్తిగా కొట్టిపారేయలేము అనే అమెరికా ఇంటెలిజెన్స్ అభిప్రాయాన్ని కాదని ఇది ఒక కుట్ర అనే వైరాలజిస్టుల వైపే మొగ్గు చూపింది. రాజకీయ భిన్నాభిప్రాయలు మీడియాను కూడా మాట్లాడానివ్వలేదు.

బాధ్యతాయుత రచయిత అయిన వేడ్ కేవలం వూహన్ ల్యాబ్ నుండి లీక్ అయిన ప్రాణాంతక వైరస్ గురించే మాట్లాడాడు. కానీ దీని వెనుక ఉన్న కుట్ర కొసలు చాలా మందికి కనబడుతున్నాయి. బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బొలసొనారో కరొన వైరస్ ఒక జీవ ఆయుధం అని కోవిడ్ 19 జీవ యుద్ధం అని బాహాటంగా చెప్పాడు. భారత్ కంటే బ్రెజిల్ లో మూడు రేట్లు వ్యాధిగ్రస్తులు ఉండగా మరణాలు మనకంటే పది శాతం ఎక్కువ ఉన్నాయి.

“వూహన్ ఇన్స్టిట్యూట్ లో రహస్య కార్యకలాపాల” పేరిట అమెరికా కేంద్ర విభాగం 2021 లో వెలువరచిన ఒక పత్రంలో “wiv చైనా సైన్యం తో కలిసి కొన్ని రహస్య పరిశోధనలు,జంతువుల పై ప్రయోగాలు 2017 నుండి చేస్తోందని” మా దృఢ విశ్వాసం అని పేర్కొంది.

చైనా జీవాయుధాల తయారీలో మునిగి ఉందని, అమెరికా సహ కొన్ని దేశాలు wiv కు అందించిన ఆర్థిక సాయం రహస్యంగా సైనిక కార్యకలాపాలకు వినియోగించారా అని విచారించేందుకు సందిగ్ధంలో ఉన్నాయి.

మూడదవది , బిగిన్ సాదత్ కేంద్రానికి సంబంధించిన ఒక పత్రం లో అమెరికా wivకు సైన్యానికి మధ్య కల సంబంధానికి చెందిన కీలక సమాచారం సంపాదించిందని, ఆ విచారణ జరిపిన అధికారి డేవిడ్ ఆషర్ ఆ ఇన్స్టిట్యూట్ కు రెండు కేంద్రాలు ఉన్నాయని ఆ విషయం భారతీయ అధికారులకు చాలా కాలం క్రితమే తెలుసునని తెలిపాడు. 2017 లో ఆ ఇన్స్టిట్యూట్ సార్స్ వైరస్ లను తమ “రక్షణ కార్యక్రమాల” జాబితాలో నుండి తొలగించామని ప్రకటించినప్పుడే ఈ రెండవ కేంద్రం ప్రారంభించబడిందని ఆషర్ అన్నాడు.

నాలుగవది, యుకె లోని సన్ దిన పత్రిక “ఆస్ట్రేలియన్ మీడియా ప్రకారం చైనా సైన్యం వచ్చే ప్రపంచ యుద్ధం జీవాయుధాల ఆధారంగా జరగనుందని అందుకోసం 2015 కరొనవైరస్ లను తయారు చేసింది వీటి ద్వారా శత్రు దేశాల ఆరోగ్య వ్యవస్థలను నిర్వీర్యం చేయడం దాని లక్ష్యం.అమెరికా కేంద్ర విభాగానికి దీని రూపకల్పన కు సంబంధించిన పత్రాలు లభ్యమయ్యాయి అని కూడా చెప్పింది”అని ప్రచురించింది . కనుక wiv ఖచ్చితంగా నేరపూరిత కార్యక్రమాలలో భాగం పంచుకుంది.

ఇదంతా ప్రపంచాన్ని ఎటు తీసుకెళ్లింది? ఈ వైరస్ కారణంగా ప్రపంచ మానవాళిలో ఆరోగ్యం, శాంతి , ఉపాధి , కుటుంబాలు విచ్ఛిన్నామయ్యాయి , జాతీయ ఆర్థిక వ్యవస్థలు కుదెలయ్యాయి. ఇదిలా ఉండగా దీని సృష్టి కర్త చైనా మాత్రం తన ఆర్థిక ప్రగతి లో ఏమాత్రం వెనక్కి తగ్గక ముందు దూసుకెళ్తోంది. సైనిక బలం మరియు ఈ జీవ వైరస్ ఎగుమతి ద్వారా అన్ని దేశాలను భయభ్రాంతులకు గురి చేసింది.

Read Also : అస‌లు కోవిడ్ కు కారణం ఎవరు ?

ఇక అమెరికా సంగతి చూస్తే అది అంతర్గతంగానూ చైనా తోనూ చీలి పోయి ఉంది. బైడెన్ యొక్క జాతీయ ఇంటెలిజెన్స్ అధిపతి అర్వీల్ హాయిన్స్ ఈ ల్యాబ్ లీక్ అనే విషయాన్ని కొట్టిపారేయలేము అంటే ఆమెను పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు సరికదా బైడెన్ యంత్రాంగం, అమెరికా మీడియా ఈ సహజ పుట్టుక సిద్ధాంతాన్ని తర్కించడంలో స్వయంచాలకత్వాన్ని ప్రదర్శిస్తున్నాయి.

ఫౌకి కూడా ల్యాబ్ నుండి వచ్చింది అనేది కొట్టిపారేయలేము అన్నాడు. ట్రంప్ సమయంలో కేంద్ర విభాగం రూపొందించిన ఒక పత్రాన్ని వాల్ స్ట్రీట్ జర్నల్ ప్రచురించింది. అందులో 2019 నవంబర్ లోwiv కి చెందిన కొద్ది మంది శాస్త్రవేత్తలు కోవిడ్ 19 లక్షణాలను పోలిన లక్షణాలతో ఆసుపత్రి లో చికిత్స పొందరని ఉంది. అంటే కాక ఒక విచారణకు ఆదేశించాలని కోరిందని వాల్ స్ట్రీట్ జర్నల్ ప్రచురించింది. అదే పత్రంలో 2018 లో wiv ను సందర్శించిన అమెరికన్ రాయబారులు అక్కడి శాస్త్రవేత్తలు గబ్బిలాల నుండి కనుక్కొన్న కొత్త రకం కరోనా వైరస్ మనుషుల కు సోక వచ్చని హెచ్చరించారని కానీ ఎవరూ పట్టించుకోలేదని పొలిటికో పత్రిక ప్రచురించింది. మీడియాకు , బైడెన్ యంత్రాంగానికి నిజం చెప్పడానికి , వ్యవహరించడానికి ఒత్తిడి ఉంది. ఇప్పుడు నిజం చెప్తారా ?లేక ఒత్తిడి తలొగ్గి దస్తారా?.

“ఈ ఉపద్రవానికి వూహన్ లోని ల్యాబ్ లో తయారు చేయబడే అత్యంత ప్రమాదకరమైన వైరస్ లకు ఏదో సంబంధం ఉందనేది సామాన్యుడి దృష్టి లోఉంది ఈ విషయం కేవలం ట్రంప్ చెప్పాడు కాబట్టి అది అబద్ధం అనే సైద్ధాంతిక అపోహలను దూరం చేస్తుందని నా నమ్మకం “ అని అంటాడు వేడ్. ఒక ప్రజాస్వామ్యంగా అమెరికా లో ఇంత పెద్ద నిజాన్ని దాచడం అసాధ్యం.

న్యూ ఇండియ‌న్ ఎక్స్ ప్రెస్ సౌజ‌న్యంతో