Home News ప‌శ్చిమ బెంగాల్‌: ఎన్నిక‌ల త‌ర్వాత హింస.. కేసు విచార‌ణ‌ను సీబీఐకి అప్ప‌గించిన హైకోర్టు

ప‌శ్చిమ బెంగాల్‌: ఎన్నిక‌ల త‌ర్వాత హింస.. కేసు విచార‌ణ‌ను సీబీఐకి అప్ప‌గించిన హైకోర్టు

0
SHARE

ప‌శ్చిమ ఎన్నిక‌ల ఫ‌లితాల అనంత‌రం రాష్ట్రంలో జ‌రిగిన అల్ల‌ర్ల‌కు సంబంధించిన తృణ‌మూల్ కాంగ్రెస్ ప్ర‌భుత్వాన్ని ఎదురుదెబ్బ త‌గిలింది. ఎన్నిక‌ల ఫ‌లితా అనంత‌రం పశ్చిమ బెంగాల్‌లో జరిగిన మహిళలపై హత్య, అత్యాచారా ఘ‌ట‌న‌ల‌కు సంబంధించిన అన్ని కేసులపై దర్యాప్తున‌కు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ)కి అప్ప‌గిస్తూ కలకత్తా హైకోర్టు గురువారం ఆదేశాలు జారీ చేసింది. సీబీఐతోపాటు కోర్టు ఆధ్వ‌ర్యంలోని స్పెష‌ల్ ఇన్వెస్టిగేటింగ్ టీమ్ కూడా ఈ కేసును ప‌ర్య‌వేక్షించ‌నుంది.

ఈ ఏడాది మే 2న తృణ‌మూల్ కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత రాష్ట్రంలో తీవ్ర హింస చెల‌రేగింది. దీనిపై ఎంతో మంది పిటిష‌న‌ర్లు హైకోర్టు గ‌డ‌ప తొక్కారు. దీంతో హైకోర్టు ఆదేశాల మేర‌కు జాతీయ మాన‌వ హ‌క్కుల క‌మిష‌న్ కూడా ఓ క‌మిటీ ఏర్పాటు చేసి దీనిపై విచార‌ణ జ‌రిపింది.

ఈ మేర‌కు గురువారం హైకోర్టులో జ‌రిగిన విచార‌ణ నేప‌థ్యంలో తాత్క‌లిక‌ చీఫ్ జస్టిస్ రాజేష్ బిందాల్ నేతృత్వంలోని జ‌స్టిస్ ఐపి ముఖర్జీ, హరీష్ టాండన్, సౌమెన్ సేన్ సుబ్రత తాలూక్దార్‌లతో కూడిన ధర్మాసనం ఎన్నికల అనంతర హింసాత్మక ఘటనలపై దాఖ‌లైన పిటిష‌న్ల‌పై పై కోర్టు పర్యవేక్షణలో ఉన్న సిబిఐ దర్యాప్తును తీర్పునిచ్చింది. ఈ విచార‌ణ రాష్ట్రం బ‌య‌ట జ‌ర‌గాల‌ని కూడా స్ప‌ష్టం చేసింది. ఇతర ఆరోపణలపై దర్యాప్తు చేయడానికి పశ్చిమ బెంగాల్ కేడర్ నుండి సీనియర్ అధికారులతో ప్రత్యేక ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) ఏర్పాటు చేయబడుతుంది. కోర్టు ఆదేశం లేకుండా ఎలాంటి ప్రతికూల చర్యలు తీసుకోరాదని కలకత్తా హైకోర్టు తెలిపింది.