నిజామాబాద్ నగరంలో వందల ఏళ్ల చరిత్ర గల శంభుని గుడి ఆలయం ఉంది. దీనికి గల సుమారు నాలుగు ఎకరాల స్థలంలో గుడి చుట్టూ అన్యమతస్తుల చెప్పుల దుకాణాలు నిండిపోయి ఆఖరికి గాలిగోపురం ఎదురుగా కూడా దుకాణాలు వెలిసాయి. చివరికి గుడి కానరాకుండా పోయింది. ఇక్కడున్న కోనేరు కూడా మాయమైంది. దేవాలయం కానరాకుండా చుట్టు అన్యమతస్తుల దుకాణాలు ఉండడంతో హిందూ భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. శంభుని గుడి ఆక్రమణలను, దేవుడి స్థలంలో దుకాణాలు పెట్టిన అన్యమతస్థులను వెంటనే ఖాళీ చేయించాలని డిమాండ్ చేస్తూ ఇందూరు హిందూ దేవాలయ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో గురువారం నగరంలోని వెయ్యి మంది యువకులు కంటేశ్వర్ ఆలయం నుండి భారీ ర్యాలీగా బయలుదేరి మున్సిపల్ కమిషనర్ కు వినతి పత్రం సమర్పించారు. శంభుని గుడి వద్ద ఉన్న అన్యమతస్తులు దుకాణాలను వెంటనే తొలగించేలా చర్యలు తీసుకోవాలని కమిషనర్‌కు విజ్ఞప్తి చేశారు. అనంతరం శంభుని గుడి వరకు ర్యాలీగా వెళ్లారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న యువకులు గుడి ఆస్తులను కాపాడాలని హిందూ ధర్మాన్ని రక్షించాలని లేనిపక్షంలో యువత కదిలి ధర్మరక్షణకు ముందుంటుందని తెలిపారు.