— కె. సహదేవ్
హిందూ మతంలో అంటరానితనం, కుల వివక్ష పెచ్చుమీరిపోయాయని, సామాజిక న్యాయం, సమానత్వం లభించవు కనుక క్రైస్తవ మతంలోకి మారమని మిషనరీలు వందలాది సంవత్సరాలుగా ఈ దేశంలో ప్రచారం చేస్తూ వచ్చారు. కానీ నిజంగానే క్రైస్తవంలో సమానత్వం, సామాజిక న్యాయం లభిస్తోందా? ఈ దేశంలో చర్చి చరిత్ర చూస్తే అలాంటిదేమీ లేదని స్పష్టమవుతుంది.
..తమిళనాడు రాష్ట్ర దళిత క్రైస్తవుల విముక్తి ఉద్యమ నాయకుడు మరియా జాన్ చేసిన ఈ వ్యాఖ్యలు గమనిస్తే భారతదేశంలో చర్చి నిమ్నవర్గాలపై సాగిస్తున్న కులవివక్ష తీవ్రత అర్ధమవుతుంది.2020 డిసెంబర్ 3న పుదుచ్చేరిలోని పాండిచ్చేరి – కడలూరు ఆర్చిడయోస్ కేంద్ర కార్యాలయం వద్ద దళితులుగా పేర్కొనే షెడ్యూల్డ్ కులాలకు చెంది మతంమారిన క్రైస్తవులు భారీ నిరసన చేపట్టారు. కారణం? హిందుత్వం నుండి క్రైస్తవంలోకి మారిన తమకు సామాజికన్యాయం అందకపోవడం. పాస్టర్లు, బిషప్పుల నియామకంలో తమకు అగ్రకుల క్రైస్తవ సమాజం నుండి ఎదురవుతున్న వివక్ష. ఎంతోకాలంగా జరుగుతున్న ఈ సామాజిక అన్యాయాన్ని ఇంతకాలం భరిస్తూ వచ్చిన ఎస్సీ క్రైస్తవ సమాజం ఇక లాభంలేదనుకుని ఈ అణచివేతకు నిరసనగా వేలాది మందితో ప్రదర్శన నిర్వహించింది.భారతదేశంలో చర్చి దృష్టి నిజంగా సామజిక న్యాయం మీదనే ఉందా? లేక కేవలం మతమార్పిడులే ప్రధాన ఎజెండాగా పనిచేస్తోందా? అసలు క్రైస్తవంలోకి మారిన వ్యక్తుల సామజిక అభివృద్ధికి చర్చి కనీసం ప్రయతిస్తోందా? అన్నవి కీలకమైన ప్రశ్నలు.2008లో తమిళనాడులోని ఎరైయూర్ పట్టణంలో ఎస్సీ, ఓబీసీ వర్గాలకు చెందిన క్రైస్తవుల మధ్య జరిగిన గొడవ హింసాత్మక ఘటనలకు దారితీసింది. చర్చిలో అగ్రవర్ణ క్రైస్తవులు చూపిస్తున్న వివక్ష, అంటరానితనంతో విసిగిపోయిన ఎస్సీ క్రైస్తవులు తమకు తాము సొంతంగా చర్చి ఏర్పాటు చేసుకున్నారు. తమ చర్చిని అధికారికంగా గుర్తించాలని ఆర్చిడయాసిస్ ను అభ్యర్ధించారు. దీంతో మొదలైన గొడవ పోలీసుల కాల్పులకు దారితీసింది. కాల్పుల్లో ఇద్దరు చనిపోయారు. ఆ ప్రాంతంలోని అనేక చర్చిలకు ఎస్సీ క్రైస్తవులు తాళాలు వేసి మూసివేశారు.
భారతదేశానికి వచ్చిన తొలితరం క్రైస్తవ మతాధికారులు ఐరోపాకు చెందినవారు. 16వ శతాబ్దం నాటి ఐరోపా సమాజంలో సమతుల్యత అనేది ఉండేది కాదు. ఆనాటికే ఐరోపా సమాజంలోని అనేక వర్గాలు క్రైస్తవం కారణంగా బహిష్కరించబడ్డాయి. ఇందుకు 600-800 సంవత్సరాల క్రితం భారతదేశం నుండి యూరప్‌లోని వివిధ ప్రాంతాలకు వలస వెళ్లిన రోమా జిప్సీల చరిత్రే ఒక ఉదాహరణ. ఇప్పటికీ అక్కడ భారీ హింస, దాడుల ద్వారా వారిపట్ల వివక్ష కొనసాగుతూనే ఉంది. కనీసం 15 లక్షల మంది రోమాలను జర్మన్ నియంత, రోమన్ క్యాథలిక్ అయిన హిట్లర్ నాజీ పాలనలో చంపారు.
యూరపులోని కాగోట్ వర్గ ప్రజలను బహిష్కృతులుగా పరిగణించేవారు. వారిని గ్రామాలలోకి రానివ్వకుండా ఊరి పొలిమేరలోనే ఉంచేవారు. దాదాపు 700 సంవత్సరాలుగా విద్వేషపూరిత వివక్షకు గురయ్యారు. వీరిని కుష్ఠురోగులు అనో, అన్యమతస్థులనో, నరమాంస భక్షకులుగా ముద్రవేసి దూరంగా ఉంచేవారు. వారికి వడ్రంగి, కసాయి లేదా ఉరితీసేవారి వృత్తులను మాత్రమే అనుమతించారు. అనేక సందర్భాల్లో వారిని చర్చిలో ప్రార్థనలకు అనుమతించేవారు కూడా కాదు. ఒకవేళ అనుమతిస్తే అందరితోపాటు కాకుండా చర్చిలోనే ఒక మూల దూరంగా కూర్చునేవిధంగా ఏర్పాటు చేసేవారు. ఒక పెద్ద కర్రకు తినుబండారం కట్టి దాన్ని వారికి అందించేవారు. వారు బాతు లేదా అటువంటి పక్షి పాదాన్ని పోలిన ఎరుపురంగు చిహ్నం మెడలో ధరించాలనే నియమం ఉండేది. చర్చిలోకి ప్రవేశించడానికి అందరితోపాటు కాకుండా వారికి వేరే ద్వారం ఉండేది.
భారతదేశంలో చర్చి క్రూర స్వభావం:
క్రైస్తవేతరులను బహిరంగంగా ఉరితీయడం అధికారిక శిక్షగా, క్రైస్తవులు కాని ప్రజల పట్ల వివక్ష పాటించి, క్రైస్తవేతర స్త్రీలను మంత్రగత్తెల నెపంతో కిరాతకంగా హతమార్చే శిక్షలవంటి హేయమైన దురాచారం నాటి యూరప్ సమాజంతో అధికారికంగా అమలులో ఉండేది. దొరికిన చారిత్రక ఆధారాల ప్రకారం ఓ మహిళను మంత్రగత్తె నెపంతో మరణశిక్ష విధించి చంపిన ఆఖరు ఘటన 1727లో స్కాట్ లాండ్ దేశంలో చోటుచేసుకుంది. అయితే క్రైస్తవేతరులను శిక్షల పేరిట అధికారికంగా చంపటం మాత్రం 1826 వరకూ కొనసాగింది.
తొలితరం యూరొపియన్ క్రైస్తవ మిషనరీలు భారతదేశంలో కాలుమోపే నాటికే అక్కడి సమాజంలో క్రైస్తవేతర విశ్వాసాల పట్ల తీవ్రమైన అసహనం, సామాజిక వివక్ష వంటి లక్షణాలు అంతర్భాగాలుగా ఉండేవి. భారతదేశంలో సమసమాజ స్థాపన లక్ష్యం అని నిత్యం ఊదరగొట్టే మిషనరీలు, తమ క్రైస్తవ సమాజం విషయంలోనే అందుకు విరుద్ధంగా ప్రవర్తించేవారు. తమ ఏకైక లక్ష్యమైన మతమార్పిడికి అనుకూలంగా హిందూ సమాజంలో కుల విభజనలను సృష్టించి, ఆ విభజనను తమకు అనుకూలంగా మలచుకున్నారు. అలాంటి ఒక క్రైస్తవ మిషనరీనే రాబర్ట్ డి నోబిలి.
వంచన, మోసపూరిత మార్గాల ద్వారా హిందువుల మతమార్పిళ్లు:
హిందువులను క్రైస్తవంలోకి మార్చడానికి, భారతదేశంలో క్రైస్తవ మతాన్ని విస్తరించడానికి రాబర్ట్ డి నోబిలి చేసిన ప్రయత్నాలు యూరోపియన్లు సాగించిన అనైతిక పద్ధతులకు ఒక ఉదాహరణ. 1577లో ఇటలీలో జన్మించిన రాబర్డ్ డి నోబిలీ 1605లో ‘సొసైటీ ఆఫ్ జీసస్’ తరఫున క్రైస్తవ మిషనరీగా భారతదేశంలో అడుగుపెట్టి, అనంతరం 1606లో మధురై ప్రాంతానికి చేరాడు. అప్పటికే హిందువులను మతం మార్చచడానికి పాటిస్తున్న పద్ధతులు ప్రభావవంతంగా లేవని గ్రహించి, నూతన మోసపూరిత మార్గాలను కనుగొన్నాడు. ఇందుకోసం కాషాయ వస్త్రాలు ధరించాడు. కేశఖండన చేయించుకుని, శిఖ ధరించాడు. పావుకోళ్ళు (సన్యాసులు ధరించే చెక్కతో చేసిన పాదుకలు) ధరించాడు. తనను తాను ‘తత్వ బోధగర్’ అని పిలుచుకున్నాడు. పవిత్ర యజ్ఞోపవీతం ధరించి తనను రోమన్ బ్రాహ్మణుడిగా ప్రచారం చేసుకున్నాడు. బైబిల్ వేదం అయ్యింది, చర్చి ‘కోయిల్’ (హిందూ దేవాలయానికి తమిళ పదం) అయింది, పాస్టర్ ‘గురువు’ అయ్యాడు. సంస్కృత, తమిళ, తెలుగు భాషలలో ప్రావీణ్యం సంపాదించిన రాబర్ట్ డి నోబిలి, తాను బోధించేది హిందూమతపు మరొక శాఖ అని అమాయక హిందువులను నమ్మించాడు. దీంతో హిందువులు పెద్ద సంఖ్యలో అతడి మోసాల బారినపడ్డారు. పరమేశ్వరుడు ఋషీశ్వరులకు కాకుండా దేవుని ఏకైక కుమారుని దూతకు మాత్రమే బోధించిన మరో వేదశాఖకు తాను ప్రచారకుడినని ప్రజలను నమ్మించాడు. క్రైస్తవ మతాన్ని ‘పరాంగుయ్ కులం’ (పరాంగుయ్ = ఫిరంగి లేదా విదేశీ)గా పరిచయం చేశాడు.
కులాల ఆధారంగా మిషనరీ వ్యవస్థ, చర్చిలు ఏర్పాటు చేయడం, మతమార్పిళ్ల కోసం హిందూ ధార్మిక సాంప్రదాయాలు కాపీ కొట్టడం వంటి విషయాలు ఆనాటి చర్చి వర్గాల దృష్టికి వచ్చింది. ఈ విధానాలపై అతడికి వ్యతిరేకంగా న్యాయ విచారణ (ఇంక్విజిషన్) ఏర్పాటు చేశారు. ఈ వ్యవహారంలో అతడికి అప్పటి గోవా ఆర్చి బిషప్ మెంజెస్ నుండి మద్దతు లభించింది.
– క్రైస్తవ ఉపనయన సమయంలో బైబిల్ వాక్యాలు పఠించాలి.
– పాగన్ల మంత్రాలూ, శ్లోకాలు పఠించకూడదు, కనీసం నేర్చుకునే ప్రయత్నం కూడా చేయకూడదు.
– క్రైస్తవంలోని తండ్రి, కుమారుడు, పవిత్రాత్మలను సూచించే విధంగా యజ్ఞోపవీతం కేవలం 3 దారపు పొరలనే కలిగివుండాలి.
– క్రైస్తవంలోకి మారకముందు అప్పటికే యజ్ఞోపవీతం ధరించినట్లైతే ఆ పాతదాన్ని కాల్చివేసి కొత్తది క్యాథలిక్ మఠాధిపతి నుండి స్వీకరించి, క్రైస్తవ ఉపనయన పద్దతిలో ధరించాలి.
ఇంతకీ రాబర్డ్ డి నోబిలీ చర్యలపై ఏర్పాటైన క్రైస్తవ న్యాయవిచారణ (ఇంక్విజిషన్) కమిటీ నిర్ణయం ఏమిటో మనం తెలుసుకోలేదు కదూ! ఈ క్రింది వాక్యాలతో విచారణ ముగిసిపోయింది.
“మన పవిత్ర క్రైస్తవమతం భారతదేశంలో వ్యాప్తిచెందడానికి వీలుకల్పించే ప్రక్రియలో భాగంగా, మతప్రచారం, మతమార్పిడి కోసం అక్కడి బ్రాహ్మణులు మరియు ఇతరులు ధరించే హిందూ సాంప్రదాయ చిహ్నాలనే ఆధారం చేసుకోవడాన్ని మేము పూర్తిగా సమర్థిస్తాము.”