Home News మ‌త మార్పిడులే ల‌క్ష్యంగా క్రైస్తవ సంస్థల్లో దౌష్ట్యాలు

మ‌త మార్పిడులే ల‌క్ష్యంగా క్రైస్తవ సంస్థల్లో దౌష్ట్యాలు

0
SHARE
క్రైస్తవ మిషనరీ సంస్థలు మైనర్ హిందూ విద్యార్థులపై మత ప్రచారాన్ని లక్ష్యంగా చేసుకుంటున్నాయి. అటువంటి 10 సంఘ‌ట‌న‌లు…

తమిళనాడులోని తంజావూరుకు చెందిన 17 ఏళ్ల లావణ్య ఇటీవల క్రిస్టియన్ మిషనరీ స్కూల్‌లో బలవంతపు మతమార్పిడికి బలైంది. మైనారిటీ విద్యాసంస్థల్లో చదువుతున్న వందలాది మంది చిన్నారులు మైనారిటీ సంస్థల నుంచి ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు.

విద్యనందించే ముసుగులో, ప్రభుత్వ సహాయం పొందే క్రిస్టియన్ మిషనరీ పాఠశాలలు హిందువుల మనోభావాలను ఎలా కించపరుస్తాయో ఈ 10 సంఘటనలు ఎత్తి చూపిస్తాయి. మత ప్రచారకుల బ్రెయిన్‌వాషింగ్‌కు లొంగకపోతే పేద పిల్లలు అనేక రకాలుగా వేధింపులకు గురవుతారు, ఫీజు మినహాయింపు కోసం క్రైస్తవ మతంలోకి మారమని బలవంతం చేస్తున్నారు. క్రైస్తవ మిషనరీ పాఠశాలల్లో విద్యార్థులు భద్రత కరువైన, సురక్షితం కానటువంటి వాతావరణం ఎదుర్కొంటున్నారు.

సంఘటన 1:
మిషనరీ పాఠశాల ‘బలవంతంగా మతమార్పిడికి పూనుకుందని’, విద్యార్థి మరణ వాంగ్మూలంలో చేసిన ఆరోపణ ఆధారంగా తమిళనాడు పోలీసులు ఆమె ఆత్మహత్యపై విచారణ చేపట్టారు.

తమిళనాడు తంజావూరులోని తిరుకట్టుపల్లి సేక్రెడ్‌ హార్ట్‌ హయ్యర్‌ సెకండరీ స్కూల్‌లో 12వ తరగతి చదువుతున్న ఎం లావణ్య అనే విద్యార్థిని ఆత్మహత్య కేసు దర్యాప్తు తమిళనాడు పోలీసులు ప్రారంభించారు.
ఆమె చదువుతున్నటువంటి ప్రభుత్వ ఎయిడెడ్ క్రిస్టియన్‌ మిషనరీ పాఠశాల, తనను క్రైస్తవ మతంలోకి మారాలని ఒత్తిడి తెచ్చినట్లు, ఆమె మరణ వాంగ్మూలంలో చేసిన ఆరోపణ ఆధారంగా ఈ దర్యాప్తు జరుగుతోంది.

తమిళనాడు పోలీసులు ఆమె మరణ వాంగ్మూలాన్ని రిజిస్టర్ చేసుకున్నారని, దాని మీదనే ఈ కేసు దర్యాప్తు ఆధారపడి ఉందని, తంజావూరు పోలీస్ సూపరింటెండెంట్ రవళి ప్రియ గంధపునేని తెలిపారు. లావణ్య క్రైస్తవ మతంలోకి మారాలని పాఠశాల అధికారులు ఒత్తిడి తెచ్చారనే ఆరోపణలతో పాటు అన్ని కోణాల్లోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే దీని కోసం పోలీసులు ముందుగా వీడియో మూలాన్ని కనుగొనవలసి ఉంటుందని ఎస్పీ తెలిపారు.

సంఘటన 2:
ప్రభుత్వ-ఎయిడెడ్, RTE మినహాయింపు పొందిన క్రైస్తవ పాఠశాల ప్రిన్సిపాల్‌పై, విద్యార్థులను లైంగిక వేధింపులకు గురిచేసిన కేసు నమోదు చేయబడింది.

తమిళనాడులోని తిరునెల్వేలిలోని సమారియా యోవన్ హయ్యర్ సెకండరీ స్కూల్ హెడ్మాస్టర్ క్రిస్టోఫర్ జెబకుమార్, 12వ తరగతి విద్యార్థినులను లైంగికంగా వేధించినట్లు ఆరోపణలు వచ్చాయి. సెలవుల్లో ప్రత్యేక తరగతులు నిర్వహిస్తామనే నెపంతో వారి ఫోన్ నంబర్లు సంపాదించి అసభ్యకరమైన సందేశాలు పంపినట్లు సమాచారం. అతని ప్రవర్తనతో షాక్ అయిన ఒక బాధితురాలు తన క్లాస్‌మేట్స్‌తో దాని గురించి మాట్లాడింది, వారు కూడా HM నుండి పోర్న్ కంటెంట్‌లు మరియు అసభ్యకరమైన సందేశాలను అందుకున్నామని వెల్లడించారు.

సంఘటన 3:
అయ్యప్ప దీక్షను పాటించిన విద్యార్థిని శిక్షించినందుకు క్రిస్టియన్ మిషనరీ పాఠశాలపై ఫిర్యాదు.

కేరళలోని శబరిమల ఆలయాన్ని సందర్శించే ముందు అయ్యప్ప స్వామి భక్తులు 41 రోజుల పాటు ఆచరించే అయ్యప్ప దీక్షను ఆచరించిన హిందూ విద్యార్థిని శిక్షించినందుకు తెలంగాణ రాష్ట్రం సంగారెడ్డి జిల్లా సదాశివపేటలోని సెయింట్ మేరీస్ స్కూల్‌పై న్యాయ హక్కుల సంస్థ LRPF ఫిర్యాదు చేసింది.

సంఘటన 4:
తమిళనాడులో 65 ఏళ్ల క్రిస్టియన్ హోమ్ వ్యవస్థాపకుడు మైనర్ బాలికలను లైంగికంగా వేధించాడు

65 సంవత్సరాల వయసు కల జేసుదాస్ రాజా, క్రిస్టియన్ చిల్డ్రన్స్ హోమ్ వ్యవస్థాపకుడు, బాలికలను లైంగికంగా వేధించినందుకు అరెస్టు చేయబడ్డాడు. అతడి వేధింపుల నుంచి తప్పించుకునేందుకు బాలికలు అనాథ శరణాలయం నుంచి పారిపోయారు. ఆరోగ్య సమస్యల కారణంగా అరెస్టు నుండి తప్పించుకోవడానికి ఆ వ్యవస్థాపకుడు ప్రయత్నించాడు. అయితే పోక్సో ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ఆసుపత్రికి వెళ్లి, అతన్ని విచారించి 15 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించారు.

సంఘటన 5:
11 ఏళ్ల బాలికను లైంగికంగా వేధించిన ఆరోపణలపై చెన్నై స్కూల్ ప్రిన్సిపాల్ అరెస్ట్

11 ఏళ్ల బాలికను లైంగికంగా వేధించినందుకు పెరుగుడిలోని మాంట్‌ఫోర్ట్ పాఠశాల ప్రిన్సిపాల్ జి జయపాల్‌ను చెన్నై పోలీసులు అరెస్టు చేశారు. దాదాపు రెండు నెలలుగా పాఠశాలకు వెళ్లేందుకు బాలిక నిరాకరించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. చాలా రోజులు పాఠశాలకు వెళ్లకపోవడంపై తల్లిదండ్రులు ప్రశ్నించడంతో ఏం జరిగిందో బాలిక వెల్లడించింది.

జయపాల్ లైంగిక వేధింపుల కారణంగానే ఆరు నెలల క్రితం తమ కుమార్తె ఆత్మహత్యకు పాల్పడిందని మరో బాలిక తల్లిదండ్రులు ఆరోపించడానికి ఈ నిరసన దారితీసింది. తన హైస్కూల్ పరీక్షల్లో 97 శాతానికి పైగా స్కోర్ చేసిన బాలిక అధిక మార్కులు సాధించి ఆశీర్వాదం పొందేందుకు వెళ్లినప్పుడు ప్రిన్సిపాల్ ఆమెను అనుచితంగా, అసభ్యకరంగా తాకాడు.

సంఘటన 6:
మధ్యప్రదేశ్: క్రిస్టియన్ మిషనరీ నిర్వహిస్తున్న బాలికల హాస్టల్‌లో జరుగుతున్న కన్వర్షన్ రాకెట్‌ను ఎన్‌సిపిసిఆర్ వెలికి తీసింది, విచారణకు ఆదేశించింది

నవంబర్ 9న, మధ్యప్రదేశ్‌లోని రైసెన్‌లోని క్రిస్టియన్ మిషనరీ బాలికల హాస్టల్‌లో జరుగుతున్న మత మార్పిడి రాకెట్‌ను కమిషన్ వెలికితీసిందని, నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ (NCPCR) చైర్‌పర్సన్ ప్రియాంక్ కనూంగో ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ హాస్టల్ మధ్యప్రదేశ్‌లోని రైసెన్ జిల్లా, సుల్తాన్‌పూర్‌లోని ఇంత్‌ఖేడి గ్రామంలో ఉంది. కానూంగో హాస్టల్‌ను తనిఖీ చేయడానికి వెళ్లాడు, అక్కడ గిరిజన హిందూ బాలికలను హాస్టల్‌కు తీసుకువచ్చారని మరియు వారిని క్రైస్తవ మతంలోకి మార్చడానికి క్రైస్తవ మత పుస్తకాలు బోధిస్తున్నారని అతను కనుగొన్నాడు.

సంఘటన 7:
తమిళనాడు లోని క్రిస్టియన్ స్కూల్, స్పోర్ట్స్ కోచ్ పై లైంగిక వేధింపుల ఫిర్యాదులు బయటపడ్డ తరువాత, అతనికి నోటీసు ఇచ్చింది.

చెన్నైలోని ఒక క్రిస్టియన్ పాఠశాల క్రీడా కోచ్ పై లైంగిక ఫిర్యాదుల విషయమై ఆ పాఠశాలకు, తమిళనాడు ప్రభుత్వం మరియు SCPCR నోటీసు జారీ చేశాయి. అథ్లెటిక్ కోచ్ నాగరాజన్ చేతిలో లైంగిక వేధింపుల గురించి విద్యార్థులు ఫిర్యాదు చేయడంతో చెన్నైలోని సెయింట్ జార్జ్ ఆంగ్లో ఇండియన్ పాఠశాలకు, పాఠశాల విద్యా మంత్రిత్వ శాఖ నోటీసు జారీ చేసింది.
సెయింట్ జోసెఫ్ గ్రూపు సంస్థల్లో భాగమైన, ప్రధాన స్పోర్ట్స్ అకాడమీ అని కూడా పిలువబడే సెయింట్ జోసెఫ్ స్పోర్ట్స్ అకాడమీ విద్యార్థులకు కూడా నాగరాజన్ శిక్షణ ఇస్తారు. 19 ఏళ్ల బాలిక తనతో పాటు తన తోటి శిక్షకులను, తాము తక్కువ వయస్సులో ఉన్నప్పుడు లైంగికంగా వేధించినందుకు ఫిర్యాదు చేయడంతో నాగరాజన్ ను అరెస్టు చేశారు. ది హిందూ స్పోర్ట్స్ కరస్పాండెంట్ T.N.రఘు కొంతమంది బాధితుల కన్ఫెషన్‌లను ట్వీట్ చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. బాధితుల్లో ఒకరు అధికారికంగా ఫిర్యాదు చేయడంతో కోచ్‌ను అరెస్టు చేశారు.

సంఘటన 8:
త్రిపుర: క్రైస్తవ మతంలోకి బలవంతంగా మతమార్పిడి చేయడాన్ని వ్యతిరేకించినందుకు హాస్టల్ వార్డెన్ దారుణంగా హింసించడంతో 15 ఏళ్ల విద్యార్థి చనిపోయాడు.

త్రిపురలో కుమార్‌ఘాట్‌లోని పబియాచార వద్ద ఉన్న హోలీ క్రాస్ స్కూల్‌లో 9వ తరగతి విద్యార్థి గత వారం హాస్టల్ వార్డెన్ చేత పదే పదే చిత్రహింసలకు గురికావడంతో జిబిపి ఆసుపత్రిలో మరణించాడు. మృతి చెందిన విద్యార్థిని హ్యాపీ దెబ్బర్మగా గుర్తించారు.
నివేదికల ప్రకారం, 15 ఏళ్ల దెబ్బర్మ మరణంతో ఇప్పుడు త్రిపుర ప్రభుత్వం న్యాయ విచారణను ప్రారంభించవలసి వచ్చింది. హాస్టల్ సూపరింటెండెంట్ అతనిపై దారుణంగా దాడి చేయడంతో విద్యార్థి అంతర్గత గాయంతో మరణించాడు.

సంఘటన 9:
ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు విద్యార్థులను సబ్జెక్టులకు బదులు బైబిల్ చదవమని బలవంతం చేశాడు

ఆంధ్రప్రదేశ్‌లో కడప జిల్లాలోని ఒక ప్రభుత్వ పాఠశాలలో మతపరమైన బోధన మరియు విద్యా నిబంధనలను ఉల్లంఘించే షాకింగ్ కేసు వెలుగులోకి వచ్చింది.
“కడప జిల్లా, రామచంద్రపురం గ్రామంలోని ఓ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు పిల్లలను సబ్జెక్టులకు బదులు బైబిల్ పఠించేలా చేస్తూ, పైగా, ‘బైబిల్ మాత్రమే వారిని యేసుకు ప్రియమైనదిగా చేస్తుంది, సబ్జెక్ట్‌లు కాదు’ అని తన చర్యలను సమర్థించుకున్నాడు” అని తెలుగు భాష భారత్ టుడే న్యూస్ ఛానెల్ నివేదించింది.

సంఘటన 10:
చైన్నైలో పిల్లల దుర్వినియోగం మరియు అక్రమ మార్పిడిలో ప్రమేయమున్న క్రిస్టియన్ చిల్డ్రన్ షెల్టర్ హోమ్స్

డెక్కన్ క్రానికల్‌ కథనం ప్రకారం, వివాహిత జంట జాకబ్ మరియు విమలా జాకబ్ తిరుముల్లైవాయల్‌లోని ఎటర్నల్ వర్డ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అనాథ పిల్లల కోసం ప్రైవేట్ హోమ్‌ను నడుపుతున్నారు. తిరుముల్లైవాయల్‌లోని ప్రభుత్వ పాఠశాలలో లైంగిక వేధింపులు, శిశు సంక్షేమంపై అవగాహన కార్యక్రమం నిర్వహించడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించేందుకు మద్రాసు హైకోర్టు న్యాయమూర్తులు, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యులను ఆహ్వానించారు.
మొత్తం 44 మంది పిల్లలను రక్షించి వివిధ ప్రభుత్వ చిల్డ్రన్స్ హోమ్స్ కు పంపారు. యజమానులే కాకుండా జాకబ్ (64), విమలా జాకబ్ (59)లతో పాటు, పోలీసులు ప్రధాన నిందితులుగా గుర్తించిన బాబు శామ్యూల్ (54), ఇతర నిర్వహణ సిబ్బంది ముత్తు (27), భాస్కర్ (39)లను కూడా అరెస్టు చేశారు.