సంత్ గాడ్గే బాబా భారత సేవా సొసైటీ ఆధ్వర్యంలో సంత్ గాడ్గే బాబా 146వ జయంతి ఘనంగా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సామాజిక సమరసత వేదిక తెలంగాణ ప్రాంత రాష్ట్ర కన్వీనర్ శ్రీ అప్పాల ప్రసాద్ గారు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. స్వచ్ఛభారత్ పితామహుడు సంత్ గాడ్గే బాబా చరిత్రలో పరిశుభ్రతే దైవమని నిర్వహించిన తొలి సంఘసంస్కర్త అని అన్నారు. చీపురుతో వీధుల్ని, కీర్తనలతో మస్తిష్కాలనీ శుభ్రం చేసిన వాగ్గేయకారుడు సంత్ గాడ్గే బాబా అని తెలిపారు. గుడికి బదులు బడిలో ఆధ్యాత్మికత వేదికినాడని, అంబేద్కర్ ను దేవుడన్న దార్శనికుడని, సామాజిక న్యాయం కోసం పరితపించిన సాంఘిక విప్లవకారుడు, సమస్త ఛాందసాలనూ హేతువుతో ఖండించిన సాధువు అని అన్నారు. ప్రకృతిని కాపాడుకోవాలని చెప్పిన పర్యావరణ వాది, తన యావద్ జీవితాన్ని సమాజానికి అర్పించిన సర్వసంగ పరిత్యాగి సంత్ గాడ్గే బాబా అని ఆయన జీవిత చరిత్ర నేటి రేపటి యువతరానికి స్ఫూర్తి దాయకం అని వివరించారు. అనంతరం ప్రసాద్ జీ చేతుల మీదుగా శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాలలోని పిల్లలకు బుక్స్ ప్యాడ్స్ పెన్నులు అందజేశారు. ఈ కార్యక్రమంలో సంత్ గాడ్గే బాబా భారత సేవా సొసైటీఅధ్యక్షులు పొలాస శ్రీనివాస్, పుప్పాల కిషోర్ కుమార్, పొలాస సాయి కుమార్, నీలంకార్ నర్సింగ్ రావు, సర్దార్ అశోక్, చిన్న గళ్ళ ప్రమోద్ కుమార్, తూప్రాన్ రాఘవేంద్ర, తదితరులు పాల్గొన్నారు.