-ప్రదక్షిణ
స్వతంత్ర భారతంలో జరిగిన ఎన్నో హిందూ నరసంహారాలలో ప్రస్తుతం కర్ణాటకలో జరుగుతున్న ఉదంతం ఒకటి. హిందూ కార్యకర్తలను వెతికి మరీ హత్య చేసిన ఉదంతాలు దేశమంతా జరిగాయి, జరుగుతున్నాయి. కేరళ, బెంగాలు రాష్ట్రాల్లో వందల వేల సంఖ్యలో ఈ హిందూ ఊచకోతలు జరిగాయి. లెక్కలోకి కూడా రానివి మరెన్నో.
దాదాపుగా ప్రతినెలా కనీసం 3-4 హిందువుల మతద్వేషపూరిత హత్యలు జరుగుతున్నాయి. కేవలం వారు హిందువులు అయినందుకు మాత్రమే. క్రిందటి నెల 2022 జనవరి 25న గుజరాత్ రాష్ట్రంలో `కిషన్ భర్వాడ్’ అనే యువకుడిని `భగవాన్ శ్రీ కృష్ణుడు’ సర్వోత్తమ దేవుడు అని చెప్తూ, దానితోపాటే `ప్రవక్త మహమ్మద్’ ప్రతీకాత్మక చిత్రం ఫేస్బుక్ లో పోస్ట్ చేసిన కారణంగా, ఆ యువకుడిని ముస్లిం మతోన్మాదులు `దైవ దూషణ’ పేరుతో దారుణంగా హత్య చేసారు. 2022 ఫిబ్రవరి 10న ఝార్ఖండ్ హజారీబాగ్లో `రూపేష్ పాండే’ (17) అనే యువకుడిని వసంత పంచమి తరువాత, సరస్వతీ విగ్రహ విసర్జన రోజున, ముస్లిం మూకలు దారుణంగా కొట్టి చంపేశారు. ఉత్తరప్రదేశ్లో `కమలేశ్ తివారీ’ని ఎంత దారుణంగా చంపారో ఇంకా స్మృతి పధంలోంచి చెరిగిపోలేదు. గోవుల అక్రమ రవాణాను ఎదుర్కున్న గోరక్షకుల హత్యలు కోకొల్లలు, ఇవేవీ పత్రికలలో రావు. ఆ హిందూ కార్యకర్తల పేర్లు కూడా మనకు తెలియదు. ఇట్లాంటి హిందూ-మతద్వేష హత్యలు ఎన్నో.
ప్రశాంతంగా ఉన్న కోస్తా కర్ణాటకలో ఇటీవలి కాలంలో కేరళ మతోన్మాదుల ప్రాబల్యం బాగా పెరిగి, అతి త్వరలోనే అక్కడ కూడా మత తీవ్రవాదం హెచ్చుమీరుతోంది. 2022 ఫిబ్రవరి11న, ఇదే కర్ణాటక దవంగేరే జిల్లా, మలేబెనుర్ ఊర్లో, వాట్సాప్ లో `హిజాబ్’కి వ్యతిరేకంగా ఎదో పోస్ట్ పెట్టినందుకు, `దిలీప్ మగలిమానే’ అనే యువకుడిని ముస్లిం మూకలు కొట్టి చంపేశారు. వీరంతా హిందూ ధర్మం కోసం, హిందువుల కోసం ప్రాణత్యాగం చేసిన చిన్న వయసు యువకులు.
నిన్న గాక మొన్న 2022 ఫిబ్రవరి 20న 26ఏండ్ల యువకుడు బజరంగ్‌దళ్ కార్యకర్త, `హర్ష’ని కర్ణాటక `శివమొగ్గ’లో, ముస్లిం మూక దారుణంగా పొడిచి పొడిచి చంపి, ఆ వీడియోని కూడా హిందువులందరినీ బెదిరించడానికి వైరల్ చేసింది. కర్ణాటకలోనే పది రోజుల్లో ఇది రెండవ హిందూ-ద్వేష హత్య. ఏమిటి ఇతను చేసిన తప్పు? హిజాబ్/బురఖాకు వ్యతిరేకంగా, శివమొగ్గలో జరిగిన ర్యాలిలో అతను కూడా పాల్గొనడం.
హర్ష హత్యానంతరం ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ పూర్వ విద్యార్ధి యూనియన్ అధ్యక్షురాలు రష్మి సామంత్ ఒక సంచలనాత్మక విషయం బయటపెట్టింది. 2015 డిసెంబర్ 15న, 2016 సంవత్సరంలో `మంగళూరు ముస్లిమ్స్’, `శిమోగ ముస్లిమ్స్’ పేరుతో ఫేస్బుక్ లో హర్షకి బెదిరింపులు వచ్చాయని ఆమె ఆధారాలతో సహా ట్విట్టర్లో బయటపెట్టింది. దీన్నిబట్టి ఎప్పటినుంచో అతనిపై ఫత్వాల రూపంలో ఒక వర్గం వారు పగబట్టి ఉన్నారని తెలుస్తోంది.
దీనికంతటికీ, అసలు నేపథ్యం ఏమిటి? దక్షిణ కోస్తా కర్ణాటకలో ముస్లిం మతోన్మాదం హెచ్చుమీరి, హిందువులకి వ్యతిరేకంగా జిహాద్ సాగిస్తున్నారు. `పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(PFI)’ అనే మతోన్మాద సంస్థ, వాటి యువ క్రియాశీలక విభాగం `కాంపస్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా’ ద్వారా ఈ మొత్తం నాటకం రచించబడింది. దేశంలో, ముఖ్యంగా దక్షిణ ప్రాంతంలో, 20సంవత్సరాల క్రితం లేని ఈ అరబ్ సంస్కృతి `హిజాబ్’ని వీరు దిగుమతి చేసి, పాఠశాలలను/ కళాశాలలను, రణరంగంగా మారుస్తున్నారు. ఈ పరాయి దేశాల దిగుమతి సంస్కృతి కోసం దేశమంతా వీరు జిహద్ కి దిగుతున్నారు. ఈ దేశ సంస్కృతి, ఇక్కడి సమాజం, ఇక్కడి చట్టాలు, రాజకీయాలతో వీరికి ఏ సంబంధం లేదు అని వీరు బహిరంగంగానే వాదిస్తున్నారు, `అల్లాహో అక్బర్’ అని ఢిల్లీ `షాహీన్ బాగ్’ తరహాలో నినాదాలు చేస్తున్నారు. హిజాబ్ పేరుతో ఏకంగా బురఖాలు వేసుకుని, స్కూల్/కాలేజి నియమాలు అతిక్రమించిన ఈ యువతులు, వారికి “చదువు కన్నా హిజాబ్/ బుర్ఖాలే ముఖ్యమని” కెమెరాల ముందు వాదించే స్థాయికి వచ్చింది ఈ జిహాదీ దౌర్జన్యం.
అన్ని రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు తక్షణ చర్యలు తీసుకోకపోతే, అతి త్వరలో ఈ దేశంలో అరాచకం ప్రబలుతుంది. ఈ దేశంలో మతాల మధ్య అంతర్యుద్ధం చెలరేగాలనే, కొందరు పనిగట్టుకుని విదేశీ శక్తుల సహాయంతో, అండదండలతో ఈ జిహాద్ సాగిస్తున్నారు.
ఈ క్రమంలో కొన్ని ప్రశ్నలు:
అ. గత రెండు నెలలుగా సాగుతున్న ఈ గొడవలలో, స్కూల్ యూనిఫారం బదులు, ఈ ముస్లిం విద్యార్థినులు, అరబ్ బుర్ఖాలు తగిలించుకుని స్కూల్ కి వస్తామంటే, ఉడుపి పాఠశాలలు ఎంతోకాలం వారితో, వారి తల్లిదండ్రులతో సంప్రదింపులు జరిపారు, వారికి ఎంతో నచ్చజెప్పారు. అయినా వారు నియమాలు పాటించడానికి ఒప్పుకోలేదు. “చదువు కన్నా హిజాబ్/ బుర్ఖాలే ముఖ్యమని” వారు అంటున్నప్పుడు, స్కూల్ ఎందుకు వారిని సస్పెండ్ చేయలేదు?
ఆ. హిందూ విద్యార్థినీ విద్యార్థులు ఎదురుతిరిగి, వారు కూడా కాషాయ కండువాలు వేసుకుని పాఠశాలలకు వెళ్లకపోతే, అసలు ఈ విషయం బయటకి వచ్చేదా?
ఇ. బురఖా తగిలించుకుని స్కూల్ కి వెళ్ళడం, స్కూల్ నియమాలను ఉల్లంఘించడమే. అయినా వారు ఆ పని చేస్తామని అంటే, అంతకు ముందు ఎన్నో కేసులలో సుప్రీం కోర్ట్ కూడా, విద్యార్థులు నియమాలు పాటించాలని, మతపరమైన దుస్తులు వేసుకోకూడదని స్పష్టంగా చెప్పినా కూడా, ఈ కేసును కర్ణాటక ఉన్నత న్యాయస్థానం ఎందుకు స్వీకరించింది?
ఈ. హిజాబ్/బురఖా వాదుల తరపున కాంగ్రెస్ లాయర్లు, ఖురాన్ లో ఏముందో, ఏమి లేదో తిరగదోడుతుంటే, కోర్టులు ఎందుకు ఇవన్నీ ఓపిగ్గా వింటున్నాయి? లౌకిక దేశంలో, లౌకిక చట్టాల ద్వారా, ప్రభుత్వ ధనంతో నడిచే పాఠశాలల్లో చదువుకోవడం కోసం, మతగ్రంథాల్లో ఏముందో తెలుసుకోవలసిన అవసరం ఏముంది?
ఉ. ప్రాథమిక హక్కులకి రాజ్యాంగం ఎన్నో పరిమితులు విధించిందని, లౌకిక దేశంలో, మత హక్కులకి పరిమితులు ఉంటాయని, ఈ దేశంలో మేధావులకి తెలియదా?
ఊ. ప్రభుత్వాలు, కోర్టుల వైఫల్యాల వల్ల పరిస్థితి విషమించుతోందని, మరెన్ని విషాదాలు చూడాల్సి వస్తుందో అని వారికి అర్ధం కావట్లేదా?
ఊ. చివరగా, ఎంతో కాలంగా, కేరళ, కర్ణాటక, ఉత్తర ప్రదేశ్ తో సహా ఎన్నో రాష్ట్ర ప్రభుత్వాలు, పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(PFI)ని నిషేధించమని, కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేస్తూఉంటే, కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఉపేక్షిస్తోంది?
ఎంతమంది హిందువులు, ఈ మతజిహాద్ కి బలి కావాల్సి వస్తుందో అని హిందూ సమాజం భయభ్రాంతులతో తల్లడిల్లుతోంది. ఈ హిందూ నరమేధం ఎప్పటి దాకా?