Home News దేశంలోని యువత ఆర్‌.ఎస్‌.ఎస్ వైపు చూస్తోంది : డా. మన్మోహన్ జీ వైద్య

దేశంలోని యువత ఆర్‌.ఎస్‌.ఎస్ వైపు చూస్తోంది : డా. మన్మోహన్ జీ వైద్య

0
SHARE

దేశంలోని యువ‌త ఆర్‌.ఎస్.ఎస్ వైపు చూస్తోంద‌ని ఆర్‌.ఎస్‌.ఎస్ స‌హ స‌ర్ కార్య‌వాహ శ్రీ మ‌న్మోహ‌న్ జీ వైద్య అన్నారు. మూడు రోజుల పాటు జ‌రిగే రాష్ట్రీయ స్వ‌యంసేవ‌క్ సంఘ్ అఖిల భారతీయ ప్రతినిధి సభలు మార్చి 11న గుజరాత్‌లోని కర్ణావతిలో ప్రారంభమ‌య్యాయి. పరమ పూజనీయ సర్‌ సంఘ్‌చాల‌క్ డాక్టర్ మోహన్ జీ భగవత్, ప‌ర‌మ పూజ‌నీయ సర్ కార్యవాహ దత్తాత్రేయ హొస‌బ‌లే జీ భారత మాత చిత్ర‌ప‌టానికి పూలమాలలు వేసి సమావేశాలను ప్రారంభించారు. ఆ తర్వాత సర్ కార్య‌వాహ జీ వార్షిక నివేదికను సమర్పించారు.

అనంత‌రం ఏర్పాటు చేసిన విలేఖ‌రుల స‌మావేశంలో ఆర్‌.ఎస్‌.ఎస్ సహ సర్ కార్య‌వాహ శ్రీ మన్మోహన్‌జీ వైద్య సమావేశ విశేషాలను వెల్లడించారు. “అఖిల భారతీయ ప్రతినిధి సభ ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటుంది. ఈసారి ఈ సమావేశాలకి దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి 1248 మంది హాజరయ్యారు. సమావేశం ప్రారంభంలో గత సంవత్సరం మరణించిన భారతరత్న శ్రీమతి లతా మంగేష్కర్, CDS జనరల్ బిపిన్ రావత్, బాబాసాహెబ్ పురందరే, శ్రీ రాహుల్ బజాజ్, పండిట్ బిర్జు మహారాజ్, పి. శ్రీనివాస రామానుజాచార్య స్వామి వంటి ప్ర‌ముఖుల‌కు శ్ర‌ద్ధాంజ‌లి ఘ‌టించారు.

గత రెండేళ్లలో కోవిడ్ సంక్షోభం ఉన్నప్పటికీ, 2020తో పోలిస్తే 98.6% సంఘ కార్యకలాపాలు పునఃప్రారంభ‌మ‌య్యాయి. సాప్తాహిక్ మిలన్ ల సంఖ్య కూడా పెరిగింది. రోజువారీ శాఖలలో 61% విద్యార్థి స్వయంసేవకులు, 39% ఉద్యోగి స్వయంసేవకులు ఉన్నారు. ఆర్‌.ఎస్‌.ఎస్ పని దృష్ట్యా దేశంలో 6506 ఖండ‌లు ఉన్నాయి, వాటిలో 84% శాఖలు జ‌రుగుతున్నాయి. 59,000 మండలాల్లో, దాదాపు 41% మండలాలు భౌతిక శాఖల రూపంలో సంఘ కార్యాన్ని కలిగి ఉన్నాయి. 2303 పట్టణ ప్రాంతాలలో 94% శాఖ పనులు జరుగుతున్నాయి. రాబోయే రెండు సంవ‌త్స‌రాల‌ల్లో అన్ని మండలాల్లో సంఘ శాఖ జ‌రిగేలా కృషి జ‌రుగుతుంది. 2017 నుండి 2021 మ‌ధ్య కాలంలో RSS వెబ్‌సైట్‌లోని ‘జాయిన్ RSS’ ద్వారా 20 – 35 సంవత్సరాల మధ్య వయస్సు గల 1 లక్ష నుండి 1.25 లక్షల మంది యువకులు ఆర్‌.ఎస్‌.ఎస్‌లో చేరాలనే తమ కోరికను వ్యక్త ప‌రిచారు.

ఈ సంవత్సరం ఏప్రిల్ 15 నుండి జూలై మధ్య వరకు దేశంలోని 104 ప్రదేశాలలో సంఘ శిక్షా వర్గాలు జ‌రుగుతాయి. వీటిలో సగటు స్వ‌యంసేవ‌కుల సంఖ్య 300 ఉంటుంది. కరోనా ఆప‌త్కాలంలో సంఘ స్వ‌యంసేవ‌కులు సమాజంతో కలిసి అనేక‌ స్వచ్ఛంద సేవా కార్య‌క్ర‌మాల్లో చురుకుగా పాల్గొన్నారు. క‌రోనా ప్రారంభ‌మైన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు 5.50 లక్షల మంది స్వయంసేవకులు వివిధ‌ సేవా కార్య‌క్ర‌మాల్లో నిమ‌గ్న‌మ‌య్యారు. మఠాలు, దేవాలయాలు, గురుద్వారాల నుండి పెద్ద సంఖ్యలో ప్రజలు సేవా కార్యానికి తరలి వచ్చిన ప్రపంచంలోని ఏకైక దేశంగా భారతదేశం నిలిచింది. ఈ ప‌రిణామాలు చైత‌న్య‌వంత‌మైన దేశానికి సంకేతం. సంఘ్‌లో కుటుంబ ప్రబోధన్, గో సంవర్ధన్ (ఆవుల సంరక్షణ), గ్రామీణ వికాస్ (గ్రామీణాభివృద్ధి) పనులు మంచి స్థాయిలో కొనసాగుతున్నాయి.” అని ఆయ‌న పేర్కొన్నారు. విలేకరుల సమావేశంలో అఖిల భారతీయ ప్రచార్ ప్రముఖ్ శ్రీ సునీల్‌జీ అంబేకర్, అఖిల భారతీయ సహ ప్రచార్ ప్రముఖ్ శ్రీ నరేంద్ర కుమార్‌జీ, శ్రీ అలోక్‌కుమార్‌జీ పాల్గొన్నారు.

Source : RSS.org