Home News “గిరిజన సంస్కృతిని కాపాడు కోవాలి”… గిరిజనులూ హిందువులే!

“గిరిజన సంస్కృతిని కాపాడు కోవాలి”… గిరిజనులూ హిందువులే!

0
SHARE

గోపాలరావు ఠాకూర్ స్మారక సమితి ఆధ్వర్యంలో ఈ ఆదివారం (మార్చి 20) హైదరాబాద్ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో డిస్టెన్స్ ఎడ్యుకేషన్ సెంటర్లో “తెలుగు రాష్ట్రాలలో గిరిజనులు – సంస్కృతి సవాళ్లు” అనే అంశంపై సభా కార్య‌క్ర‌మం జరిగింది. ముఖ్య అతిథులుగా ఆదిలాబాద్ ఎంపీ శ్రీ సోయం బాబూరావు, వనవాసి కళ్యాణ ఆశ్రమం జాతీయ మార్గదర్శకులు సోమయాజులు, వానవాసి కళ్యాణ ఆశ్రమం జాతీయ ఉపాధ్యక్షులు డా.HK నాగు, డా.పిరాట్ల శివరామ కృష్ణ, శక్తి పాల్గొన్నారు. “గిరిజన సంస్కృతి ప్రత్యేకతలు, వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత, గిరిజనులను హిందువుల నుండి వేరు చేయడానికి జరుగుతున్న కుట్ర‌లు, వాటి ప‌ట్ల ఎలా అప్రమత్తంగా ఉండాలి?” అనే అంశాలపై వక్తలు వివ‌రంగా మాట్లాడారు.

ఈ సంద‌ర్భంగా సోమయాజులు మాట్లాడుతూ వనవాసి సమాజాన్ని మిగిలిన సమాజం నుండి వేరుచేసి దేశాన్ని బలహీన పరచటానికి, విభజించటానికి అనేక రకాలుగా కుట్రలు జరుగుతున్నాయ‌ని, ఈ కుట్ర‌లు చేసే వ్యక్తులు పట్టణాలలోను, నగరాలలోనే ఎక్కువగా వున్నార‌న్నారు. ఇందులో భాగంగానే ఆదివాసులు హిందువులు కారు అనే ప్రచారం చేస్తున్నార‌ని, ఎవరైతే ఈ విధంగా ప్రచారం చేస్తున్నారో వారికి సరైన అవగాహన కలిగించటం మన బాధ్యత అని తెలిపారు. ప్రస్తుతం దేశములో 700 పైగా గిరిజన తెగలు వున్నాయ‌ని, వీరిలో 20 శాతం మంది వివిధ కారణాల వల్ల నగరాల్లో నివసిస్తున్నార‌ని, 80 శాతం మంది ఇప్పటికీ ఆడవుల్లో, కొండలలో, గుట్టల్లో ఉంటూ అడవులపై ఆధారపడి జీవ‌నం కొన‌సాగిస్తున్నార‌ని, అడవులను భగవంతునిగా భావించే వీరిలో ధార్మిక భావన ఎక్కువగా ఉంటుంద‌ని అన్నారు. వీరు హిందూ సమాజంలో భాగం కాదనీ, వీరికి జనగణనలో వేరే ‘కోడ్’ కేటాయించాలని అడిగే కుట్ర మొదలయ్యింద‌ని తెలిపారు. ఆంగ్లేయుల కాలంలో ఈ విధంగా జనగణన జరిగింద‌ని, కానీ అప్పటి జనగణన అధికారి స్వయంగా తన రిమార్క్స్ లో “ఈ విధముగా గిరిజనులను, హిందువులనుండి వేరు చేయటం తప్పు అని” పేర్కొన్నార‌ని గుర్తు చేశారు.

ఆ తరువాత, మూల నివాసుల గురించి జెనీవా లో జరిగిన అంతర్జాతీయ సమ్మేళనంలో కూడా మన దేశంలోని ప్రజలందరూ మూల నివాసులేనని, ఎవ్వరూ బయటి నుంచి వచ్చిన వారు కాదని స్పష్టంగా ప్రకటించార‌ని తెలిపారు. జనాభా లెక్కలలో గిరిజ‌నులు హిందువులుగా నమోదు చేసుకొంటే రిజర్వేషన్ సౌకర్యం వర్తించదని కొంత మంది తప్పుడు ప్రచారం చేస్తూ వనవాసులను గందరగోళానికి గురిచేస్తున్నార‌ని తెలిపారు. న్యాయస్థానాలు తమ తీర్పులలో వనవాసులు ఎవరైతే మతం మారి తమ ఆచార, సంప్రదాయాలు వదిలివేస్తారో వారికీ రిజర్వేషన్స్ వర్తించవని, అయితే వారి గురించి వ్యక్తిగతంగా న్యాయస్థానాలను సంప్రదించవలసి ఉంటుందని తీర్పులు కూడా వ‌చ్చాయ‌ని స్ప‌ష్టం చేశారు.

ఉదాహరణకు ఛత్తీస్ గఢ్ లోని రాయపూర్ దగ్గరి ప్రాంతాలలో కౌసల్యా మాత గోండ్ రాజా కుమార్తె అనే సంప్రదాయం వున్నది. కానీ కొద్దిమంది వ్యక్తులు వనవాసులను మహిషాసుర, రావణాసుర వంశజులు అని ప్రచారం చేస్తున్నారు… వనవాసులను రాక్షస వంశజులు అని చెప్పుట వలన చాల మంది వనవాసులు బాధప‌డుతున్నార‌ని, అస‌లు రావణుడు బ్రాహ్మణ వంశజుడు గిరిజనుడు ఎలా అవుతాడ‌ని ప్ర‌శ్నించారు.

వనవాసులలో గోత్రాలు వున్నాయని, వారిలో స్వగోత్రికుల వివాహాలు లేవు. షోడశ సంస్కారాలు వున్నాయి. 2012 ఉజ్జయినిలో జరిగిన వనవాసి సమ్మేళనంలో వివిధ ప్రాంతాల వనవాసులు వారివారి సంప్రదాయ పద్దతిలో పూజలు ప్రదర్శించారు. వాటిని పరిశీలించిన మీడియావారు చెప్పినదానిని బట్టి అందరుకూడా తూర్పుదిక్కు వైపు తిరిగి పూజచేసారు, మొట్టమొదట భూమిని పూజించారు, అంటే భూమిని అందరు తల్లిగా భావించారు, పూజలో అందరు నీటిని ఉపయోగించారు, ప్రసాదాలు మాత్రం వేరువేరుగా వున్నాయి. దీనిని బట్టి వనవాసులు అందరు భారతీయ సమాజంలో భాగమే అని అర్ధమ‌వ‌తుంద‌ని అన్నారు.

తీర్ధయాత్రలు, నదులలో స్నానం చేయడ‌మే ఆచారం వనవాసులలో కూడా ఉన్న‌ద‌ని, కుంభమేళాలో కళ్యాణ్ ఆశ్రమం ప్రయ‌త్నంతో 60,000 మంది వనవాసులు ఎంతో భక్తి శ్రద్ధలతో పాల్గొన్నార‌ని తెలిపారు. కొన్ని ప్రసిద్ధ దేవాలయంలో వనవాసి పూజారులు వున్నార‌ని, పూరిలోని బలభద్ర, సుభద్ర విగ్రహాలను మార్చేది సవర జనజాతి వ్యక్తులే, శ్రీకృష్ణుని అష్ట భార్యలలో ఇద్దరు గిరిజనులే అని నరసింహస్వామి చెంచు లక్ష్మి, మహాభారతం లోని మధిరముండా పాండురాజు భార్య మాద్రి మధిర  సోదరుడు అని పేర్కొన్నారు

అనంత‌రం డా.పిరాట్ల శివరామకృష్ణ రాసిన ” తెలుగు రాష్ట్రాలలో గిరిజనుల సంస్కృతి, సంప్రదాయాలు, పురాగాధలు” అనే పుస్తకాన్ని శ్రీ సోయం బాబూరావు, శ్యామ్ ప్రసాద్ వ్రాసిన శ్రీ గురునానక్ దేవ్(ఆంగ్ల) పుస్తకాన్ని విద్యాభారతి జాతీయ అధ్యక్షులు శ్రీ దూసి రామకృష్ణ గారు ఆవిష్కరించారు. అనంత‌ర వరంగల్ మాజీ మేయర్ డా.రాజేశ్వరరావు మాట్లాడుతూ స్వర్గీయ శ్రీ చందుపట్ల జంగారెడ్డి గారు జనసంఘ్, బిజేపికి చేసిన సేవలను వివరించారు. సభాధ్య‌క్షులు శ్రీ కపిలేశ్వర్ మాట్లాడుతూ గోపాల్‌రావు ఠాకూర్ గారి జీవన విశేషాలను, సమితి కార్యకలాపాలను వివరించారు.