Home Videos VIDEO: చరిత్రాత్మకం.. రాంజీ గోండు బలిదానం

VIDEO: చరిత్రాత్మకం.. రాంజీ గోండు బలిదానం

0
SHARE

బ్రిటీష్ సైన్యాలను ధీటుగా ఎదుర్కొన్న తొలి గిరిజన పోరాట యోధుడు రాంజీ గోండు. మధ్య భారత దేశంలో గోండ్వానా ప్రాంతంలో భాగమైన ఆదిలాబాద్ జిల్లాలో రోహిల్లా స్వాతంత్ర్య పోరాటం జరిగింది. 1836 నుంచి 1860 మధ్య కాలంలో రాంజీ గోండు నేతృత్వంలో జరిగింది. బ్రిటీష్ పాలకులపై ఆదివాసీలు జరిపిన తొలి చారిత్రక పోరాటంగా నిలచిపోయింది. రోహిల్లా తిరుగుబాటు ప్రధానంగా అసిఫాబాద్ తాలూకా నిర్మల్ కేంద్రంగా జరిగింది. అది ప్రధానంగా గోండులు, కోలాము, కోయ తెగల గిరిజనుల ప్రాంతం. రాంజీ గోండు సారథ్యంలో తిరుగుబాటు ఉధృతంగా మారింది. రోహిల్లా తిరుగుబాటును అణచివేయడానికి నిజాం పాలకుల సాయాన్ని ఆంగ్లేయులు కోరారు. ఆదివాసీల అణచివేతకు ఆంగ్లేయులు జరుపుతున్న కుట్రలో నిజాం పాలకులు భాగస్వామ్యం వహించారు.