Home Telugu Articles మ‌త‌మార్పిళ్ల‌ను అడ్డుకున్న సంత్ ఝూలేలాల్‌

మ‌త‌మార్పిళ్ల‌ను అడ్డుకున్న సంత్ ఝూలేలాల్‌

0
SHARE

సింధీ ప్ర‌జ‌ల ఆరాధ్య దైవం భ‌గ‌వాన్‌ సంత్ ఝూలేలాల్. హిందూ పంచాంగం ప్రకారం ఝూలేలాల్ జయంతిని చైత్రమాసంలో ద్వితీయ తిథిన జరుపుకుంటారు. ఈయనను సింధి ప్ర‌జ‌లు వరుణ దేవుని అవతారంగా భావిస్తారు. భగవాన్ ఝూలేలాల్ జయంతిని సింధి ప్రజలు “చెటి చండ్”‌ గా, దీనినే సింధీ నూతన సంవత్సరంగా జరుపుకుంటారు. ఈ ‘ చెటీ- చండ్ ‘ ఉత్సవం చైత్ర మాసంలో నవ‌రాత్రి మరుసటి రోజున అనగా చైత్ర శుక్ల ద్వితీయ రోజున జరుపుకుంటారు. జలంతోనే సర్వసుఖాలు, మంగళకామ‌న ప్రాస్తినిస్తాయని సింధి ప్రజల విశ్వాసం. అందుకే వీరికి ఈ ఉత్సవం ఎంతో విశేషమైనది.

హిందూ నూతన సంవత్సరపు మొద‌టి నెల చైత్ర‌మాసం దీనినే సింధీ ప్రజలు ‘చెట్’ అని పిలుస్తారు. అందుకే ఈ ఉత్సవాన్ని చెట్- ఈ- చండ్ అని పిలుస్తారు. సింధీ ప్రజల ఇష్ట దైవం అయిన ఝూలే లాల్ జయంతి కూడా. అందుకే సింధీ ప్రజలు ఈ పండుగ‌కు అత్యంత ప్రాధాన్యత ఇస్తారు.

ఝూలేలాల్ గారి జన్మకథ :

సింధ్ ప్రాంతపు చివరి హిందూ రాజైన ‘దాహిర్ ను మొహమ్మద్ బీన్ – ఖాసీం మోసపూరితంగా ఓడించిన తర్వాత ఈ ప్రాంతాన్ని, అల్- హిలాల్ ఖలీఫా తన రాజ్యంలో కలుపుకున్నాడు. ఖలీఫా ప్రతినిధులు ఈ ప్రాంతాన్ని పాలించారు. ఇస్లాం దురాక్రమణ దారులు ఈ ప్రాంతంలో బ‌ల‌వంత‌పు మ‌త మార్పిళ్లు చేస్తూ ఇస్లాం మతాన్ని వ్యాప్తి చేశారు.

దీని తర్వాత రాజవంశం 10వ శతాబ్దంలో సింద్ ప్రాంతం స్వోమ్‌రా రాజ‌వంశం ఆధీనంలోకి వచ్చింది. సింధ్ ప్రాంతంలో ముస్లిం మతమార్పిళ్ళు ప్రారంభ‌మ‌య్యాక మొట్ట‌మొద‌టగా ఇస్లాం మతంలోకి మారింది ఈ స్వోమ్‌రా వంశమే. వీరి సమూల జాతి మతం మార్చుకుంది. వీరి సముదాయం అతివాద ముస్లింలుగా ఉండకుండా బలవంతం మతమార్పిళ్ళు చేయనందున ఆపవాదం కలిగి ఉన్నారు.

సింద్‌ రాజధాని థ‌ట్టా కు ప్రత్యేకమైన గుర్తింపు ఉన్నది. ఆ ప్రాంతపు రాజు మిరఖ్‌ షాహ్, క్రూరుడే కాక అతివాద ఇస్లాం ఆక్ర‌మ‌ణ కారుడు. ఇస్లాం మత వ్యాప్తి అనేక ఆక్రమణలతో పాటుగా ఎంతో న‌రసంహరం గావించాడు. మిర‌ఖ్ షాహ్ చుట్టు ఉన్న సలహాదారులు అతనికి ఇస్లాం మతాన్ని వ్యాప్తి చేస్తే మృత్యువు తర్వాత స్వర్గం ప్రాప్తిస్తుందని నూరి పోసేవారు.

ఈ క్ర‌మంలో మిరఖ్ షాహ్ హిందువుల పంచ- ప్రతినిధులను పిలిచి “ఇస్లాంను స్వీకరించండి లేదా చావ‌డానికి సిద్ధ‌పడండి ” అని హెచ్చరించాడు. దీంతో భయపడిన హిందూ ప్రతినిధులు తమ‌కు ఆలోచించుకొనుటకు కొంత సమయం అడుగగా మిర‌ఖ్ షాహ్ వారికి 40 రోజుల సమయం ఇచ్చాడు. ఎప్పుడైతే మనిషికున్న అన్ని దారులు మూసుకు పోతాయో అప్పుడు దేవుడే దిక్క‌వుతాడ‌న్న‌ది జగమెరిగిన సత్యం. ఇక్కడ కూడా జరిగింది అదే. ఆ శ్రీకృష్ణ భగవంతుని భగవద్గీతను ఉల్లెఖిస్తూ అప్పటి గ్రామ ప్ర‌ఖుడు “ఎప్పుడైతే పాపం హద్దుమీరి. ధర్మం ప్రమాదంలో పడుతుందో అప్పుడు భగవంతుడు అవతరిస్తాడు.” అని చెప్పాడు. తమ‌ ముందర ఉన్న మ‌ర‌ణ‌మా, మ‌తం మార‌డ‌మా అనే సంక‌టాన్ని చూసి సింధ్ హిందువులు న‌దీ(జలం) దేవుడైన వరుణ దేవున్ని స్తుతిస్తూ 40 రోజుల పాటు అన్న పానీయాలు ముట్టకుండా తపస్సు చేస్తూ తమను రక్షించనుని వేడుకున్నారు.

40 వ రోజు స్వర్గం నుండి ఒక ఆకాశవాణి వినిపించింది ” భయపడకండి . ఈ చెడు దృష్టి నుండి నేను ర‌క్షిస్తాను. నేను ఒక నశ్వరుని గా భూమి పై అవతరిస్తాను. నస‌ర్‌ఫూర్ గ్రామానికి చెందిన రతన్ చంద్ ఇంట్లో మాతా దేవ‌కి గర్భంలో జనిస్తాను “‌ అని అభయమిచ్చాడు. ఆనాటి నుండి సింధ్ ప్రజలు 40వ రోజును ‘ధన్యవాద్ దివస్ ‘ గా ఉత్సవం జరుపుకుంటారు. ఈ విషయాన్ని హిందువులు మిర‌ఖ్ షాహ్‌తో చెప్పి త‌మ దేవుడు వ‌చ్చే వ‌ర‌కు వేచి చూడాల్సిందిగా ప్రార్థించారు. దీంతో మిర‌ఖ్ – షాహ్ ఆహంకార పూరితంగా వీరి దేవునితోనే పోరాడవచ్చు అనే ఉత్సాహం కొద్దీ హిందువులను కొన్ని రోజుల పాటు వదిలేసాడు.

3 నెలల త‌ర్వాత ఆసూ (ఆషాఢ మాసం) రెండవ తిథిన దేవకి గర్భం దాల్చానని చెప్పగా హిందువులంద‌రూ వరుణ(జలం) దేవున్ని ప్రార్థిస్తూ కృతజ్ఞతలు తెలుపుకున్నారు. చైత్ర మాసం శుక్ల పక్షంలో ద్వితీయ రోజున ఆకాశం నుండి అకాల వర్షం కురుస్తున్నప్పుడు మాతా దేవ‌కి ఒక మహిమాన్విత శిశువును జ‌న్మ‌నిచ్చింది. భగవాన్ ఝూలేలాల్ జన్మించగానే నోటిని తెరవ‌గా సింధూ నది ప్రవహించే దృశ్యం కనిపించింది. హిందువులందరూ తమ ఆట పాటలతో ఈ శిశువుకు స్వాగతం పలికారు.

ఝూలేలాల్ గారి నామకరణం :
ఝూలేలాల్ గారి పేరు “ఉదయ్ చండ్” అని పెట్టారు. ఉదయ్ చండ్ ని “ఉద‌రే లాల్” అని నసర్ పూర్ గ్రామ ప్రజలు ప్రేమ‌తో “అమ‌ర్ లాల్” (Immortal) అని పిలిచేవారు. ఉదయ్ చంద్ ఏ ఊయల (ఝాలా) లో ఉండేవారో అది తనంతట తానుగా ఊగేది అందుకే అంద‌రు అత‌న్ని ఝూలేలాల్ అని పిలువ‌గా అదే పేరుతో ప్రసిద్ధి చెందాడు.

మీరుబ్ షాహ్ మంత్రి, దేవుడు ఝూలేలాల్‌ :
ఈ మహిమాన్విత బాలుని జననం గురించి తెలిసిన మిరఖ్‌షాహ్ హిందూ పంచ ప్రతినిధులను పిలచి మ‌రలా తన హెచ్చరికకు వారికి వినిపించాడు. కానీ ఈసారి హిందూ ప్రతినిధులు అభయంతో ఉన్నారు. కారణం వారి ఉద్దార‌కుడు భూమి మీదకు వచ్చాడు.
జల దేవత రూపంలో జన్మించింది, ఆ మహిమాన్విత బాలుడే అని తెలియగానే మిరఖ్ షాహ్ అందరి ముందు అతన్ని ప‌రిహాసం చేస్తూ నేను చావ‌డం మీరు ప్రాణాలలో ఉండటం జరగని పని, మీ దేవునితోనే ఇస్లాం మతం స్వీకరింప చేస్తాను అప్పుడు మీరు కూడా మతం మారక తప్పదు అని ఆన్నాడు.

ఈ బాలుని సంగతి ఎంటో చూడమని మిరఖ్ షాహ్ తన మంత్రి అహీరియోను ఆదేశించ‌గా, అహిరియో విషం కలిపిన గులాబి పువ్వును తీసుకుని ఆ బాలుని వద్దకు వెళ్లాడు. ఆ విషం పూసిన గులాబీని బాలునికి ఇవ్వగా అతను దాన్ని స్వీకరించి నోటిలో గాలి ఊదగా అది మాయపోతుంది. తర్వాత అహిరియోకు త‌న ముందు ఒక వృద్దుడు క‌నిపించాడు. మ‌ళ్లీ అదే వృద్ధుడు 16 ఏళ్ల నవ యవ్వనుడిగా మారి పోయాడు.

తర్వాత అహీరియోకు మెరుస్తున్న ఖ‌డ్గం చేత బూని, గుర్రం పై కూర్చున్న‌ట్టుగా ఝూలేలాల్ క‌నిపించాడు. అతని వెనుక కొందరు యోధులు కూడా ఉన్నారు. ఈ దృశ్యం చూసిన అహిరిమో భయంతో పారిపోయాడు. జరిగిన సంఘటనను మంత్రి అహిరియో మిర‌ఖ్‌షాహ్‌ తో చెప్పగా ఇది మోసపూరితంగా చేసిన ఒక మాయగా మిర‌ఖ్‌షాహ్ దాన్ని కొట్టి పారేశాడు. మిర‌ఖ్ షాహ్ కు ఒక కల వచ్చింది. ఒక బాలుడు తన మెడపై కూర్చుని ఉన్నాడు. ఆ బాలుడే ఒక వృద్దునిలా మరలా చేతిలో ఖడ్గం లో ఉన్న ఒక మోధుగి లా మారిపోయాడు. మరుసటి రోజు ఉదయమే మిర‌ఖ్ షాహ్ తన మంత్రి అహిరియోను పిలిచి ఆ బాలున్ని వధించచుని చెప్పగా ఇప్పుడే తొందరపాటు వ‌ద్ద‌ని అహిరియో సలహా ఇచ్చాడు.

భగవాన్ ఝూలేలాల్ గారి చమ‌త్కారం :

ఈ ర‌కంగా పిల్లవాడైన ఉద‌రేలాల్ (ఝూలేలాల్‌) మహిములు కొన‌సాగుతున్నాయి. తమను రక్షించడానికి సాక్షాత్తు ఈశ్వ‌రుడే జన్మించాడని నసర్ పూర్ గ్రామ ప్రజలు ఇక నిశ్చింతగా ఉన్నారు. ఉద‌రేలాల్ బాబా గోరఖ్ నాథ్ నుండి “అలఖ్‌ నిరంజన్” అనే మంత్రోపదేశాన్ని పొందాడు. ఉదరేలాల్ పిన తల్లి అతన్ని ఫలాలు అమ్మ‌డానికి పంపుతుండేది. ఉద‌రేలాల్ బ‌జారుకు వెళ్ళకుండా నేరుగా సింధునది ఒడ్డుకు వెళ్ళి అక్క‌డున్న పిలల్లు, వృద్ధులు, బిక్షాట‌న చేసేవారికి ఆ పండ్లు దానంగా ఇచ్చేవాడు. ఖాళీ పండ్ల బుట్టతో సింధూ నదిలో మున‌గ‌గానే , ఆ బుట్ట ధాన్యంతో నిండి ఉండేది. దాన్ని తన తల్లికి ఇచ్చేనాడు. ప్రతి రోజూ మేలు జాతి ధాన్యాన్ని తేవడం చూసి, ఒక రోజు తల్లి ఉదరేలాల్ తో పాటుగా అత‌ని తండ్రిని కూడా పంపించింది. ఉదరేలాల్ చతుతోరాన్ని చాటుగా చూసిన తండ్రి రతన్ చండ్ అతనికి ప్రణమిల్లడ‌మే గాక సాక్షాత్తు ఈశ్వరుడిగా భావించాడు.

మిరణ్ షాహ్, భగవాన్ ఝూలేలాల్

మ‌రోక వైపు ముస్లిం మౌల‌లీలు హిందువుల మ‌త మార్పిడికై మిరఖ్ షాహ్ పై ఒత్తిడి తెచ్చిరి. కాఫిర్లను మార్పిడి చేయ వలసిందిగా ఆదేశిస్తూ హెచ్చరించిరి. ఈ రకంగా మౌలానాల మాటలు తన ఇస్లాం అహంకారంతో నిండి ఉన్న మరఖ్ షాహ్ ఉదరేలాల్‌ ను స్వయంగా కలవడానికి పూనుకునెను. కలవడానికి ఏర్పాట్లు చేయవలసిందిగా ఆహిరియో ను ఆదేశించారు. ఈ క్రమంలో అహ‌రియో జలదేవతా (ఝూలేలాల్) భక్తుడిగా మారిపోయాడు. రాజు గారి ఆదేశానుసారం అతను సింధూ నది ఒడ్డుకు చేరి జల దేవత (రూలేలాల్) లో తనను రక్షించడానికైనా తనతో రమ్మని వేడుకున్నాడు. అంతలో అహిరియోకు నేరిసిన గడ్డంతో చేప‌ మీద కూర్చున్న ఒక వృద్ధుడు క‌నిపించాడు. ఇతనే జలదేవత ఉద‌రేలాల్ అని గాంచిన ఆహిరియో ఆరాధనలో నమ‌స్క‌రించాడు. మళ్లీ ఆహిరియోకు ఒక చేతిలో ఖడ్గం మరొక చేతిలో ధ్వజంతో గల ఝూలేలాల్ గుర్రం ద‌ర్శ‌నమిచ్చారు.

మిరఖ్ షాహ్ ఝూలేలాల్ ముందుకు రాగానే భగవాన్ ఝూలేలాల్ అతనికి ఈశ్వరుని గురించి వివ‌రించేను. కానీ అతివాద ముస్లిం మౌలానాల మాటలు, అతివాద ముస్లిం భావాలలో నిండి ఉన్న మిర‌ఖ్ షాహ్ ఆ మాట‌ల‌ను లెక్క‌చేయ‌క ఉద‌రేలాల్ ను బంధించ‌మని తన సైనికులను ఆజ్ఞాపించాడు. అతన్ని బంధించడానికి సైనికులు ముందుకెల్లగానే భూమిని చీల్చుకుంటూ పెద్ద, పెద్ద నీటి అలలు వచ్చాయి. నలువైపులా చుట్టు ముట్టిన అగ్ని జ్వాల‌ల రాజమహల్ ద‌హించడం ప్రారంభించాయి. తప్పించుకునే మార్గ‌మే లేదు. ఆ స‌మ‌యంలో భగవాన్ ఝూలేలాల్ మిర‌ఖ్ షాహ్ తో మాట్లాడుతూ “నీ అన్వరుడు – నా ఈశ్వరుడు ఒక్క‌డే అయిన‌ప్పుడు నా వాళ్ల‌ను ఎందుకు వేధిస్తున్నావు. ఇక‌నైనా ఈ ప‌నులు మానుకో ” అని హెచ్చ‌రించారు.

దీంతో భయపడిన ముర‌ఖ్ షాహ్ ఝులేలాల్‌తో విన్న‌విస్తూ ” హే భగవంతుడా ! నేనెంత మూర్ఖంగా ప్రవర్తించానో నాకు ఇప్పుడే అర్థ‌మయింది.” దయ‌చేసి నన్ను, నా వాళ్లును క్ష‌మించి ర‌క్షించ‌వ‌ల‌సిందిగా వేడుకున్నాడు. ఇంతలో అన్నివైపులా నీటి ధారలు కురిసి మంటలు ఆరిపోయాయి. మిరఖ్‌ షాహ్ సవినయంగా నమ‌స్క‌రిస్తూ ఇక నుంచి హిందూ – ముస్లిం లందరి పట్ల సమ దృష్టి కలిగి ఉంటానని మాటిచ్చాడు. ఉదరే లాల్ హిందువులతో తనను ” ప్రకాశం, జ‌లం ” రూపంగా భావించుకుని తన కోసం ఆలయాన్ని నిర్మించి ఆ ఆలయంలో ఒక కొవ్వ‌త్తిని వెలిగించి, పవిత్ర తీర్థం కోసం నీటిని ఉంచ‌మ‌ని బోధించారు.ఉదరే లాల్ తన వరుసకు సోదరుడు అయిన “భాయి పగడ్’ ను మందిరానికి మొట్ట మొదటి పుజారి గా నియమించారు. భాయి పగడ్ కు ఐదు ప్ర‌తీక‌ల‌ను ఇస్తూ మందిర నిర్మాణం, పవిత్రతలను కొన‌సాగించ వ‌ల‌సిందిగా సందేశ‌మిచ్చారు.

భగవాన్ ఝూలేలాల్ గారి త్యాగం :
థిఝ‌ర్ అనే గ్రామం వ‌ద్ద గ‌ల ఒక ప్ర‌దేశాన్ని ఎంచుకున్న భగవాన్ రుూలేలాల్ గారు అక్క‌డే తన దేహాన్ని త్యజించారు. ఈ ఘటనను చూడటానికి పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. అతని ఆత్మ వెళ్లిపోగానే ఆ ప్రదేశంలో సమాధి, దర్గా నిర్మాణానికి మరలా హిందూ – ముస్లింల మధ్య వివాదం నెలకొన్నది. ఇంతలో ఆకాశ‌వాణి వినిపిస్తూ హిందువులు – ముస్లింలు కూడా రాగల ధ‌ర్మ‌స్థ‌లాన్ని నిర్మించమ‌ని ఉపదేశించారు.”

ముగింపు :
తన మ‌హిమాన్విత జన్మ, జీవనంతో భగవాన్ ఝూలేలాల్ సింధ్ ప్రాంతంలోని హిందువుల ప్రాణాలు రక్షించడమే గాక హిందూ ధర్మాన్ని కూడా రక్షించారు. మిర‌ఖ్ షాహ్ లాంటి ఎందరో అతివాద ముస్లింలు వ‌చ్చి మ‌త మార్పిడి అనే రక్త క్రీడ‌ను సాగించినా భగవాన్ ఝూలేలాల్ కారణంగా సింధ్‌లో వారి ఆటలు సాగలేదు. ఈ రోజు కూడా భగవాన్ ఝూలేలాల్ సింధ్ ప్రజల ఐక్య‌త‌కు, శ‌క్తికి, సాంస్కృతిక కార్యక్రమాలకు మూలం. జ‌లం, జ్యోతి (ప్రకాశం) మే తన వాస్త‌విక రూపం అని భగవాన్ ఝూలేలాల్ తన భక్తులు బోదించారు. ఇది లేకుండా ప్రపంచం జీవించి ఉండదు. ఆయన సమదృష్టి లో ప్రజలందరినీ అక్కున చేర్చుకొన్నాడు. మత సద్భావన సందేశం ఇస్తూ “‌ ద‌రియాహి పంత్ ” ను స్థాపించాడు.

సింధ్ తెగ ప్రజలను భగవాన్ శ్రీరాముని వంశ రాజులు అని చెప్తారు. మహాభారత కాలపు రాజు జయద్రతుడు కూడా సింద్ తెగకు చెందిన వాడే. సింధ్ ప్రజలు ” చెటీ చండ్ ” ఉత్సవంతోనే నూతన సంవత్సరాన్ని ప్రారంభిస్తారు. చెటిచండి సందర్భంగా సింది సోదరులు ఎంతో శ్ర‌ద్ద‌తో భ‌గ‌వాన్ ఝూలేలాల్ శోభ‌యాత్ర ను నిర్వ‌హిస్తారు. ఈ రోజు “సూఖోసెసీ” అని ప్ర‌సాదాన్ని పంచుతారు. చెటిచండ్ నాడు ఈ సింధ స్త్రీ – పురుషులు చెరువు లేదా నది ఒడ్డున దీపాన్ని వెలిగించి జల దేవతను పూజిస్తారు.

This article was First Published in 2021