Home News తీస్తా సెతల్వాద్ అరెస్టుపై ఐరాస వ్యాఖ్యలపై భారత్ మండిపాటు

తీస్తా సెతల్వాద్ అరెస్టుపై ఐరాస వ్యాఖ్యలపై భారత్ మండిపాటు

0
SHARE

తీస్తా సెతల్వాద్‌తో పాటు మరో ఇద్దరిని అరెస్టు చేయడంపై ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల కమిషన్ అనవసరంగా వ్యాఖ్యానించడంపై భార‌త విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి మండిపడ్డారు. మాన‌వ హ‌క్కుల క‌మిష‌న్ చేసిన ఈ వ్యాఖ్యలు తప్పుదారి పట్టించేవి, ఆమోదయోగ్యం కానివిగా విదేశాంగ శాఖ పేర్కొంది.

2002 గుజరాత్ అల్లర్ల గురించి విచార‌ణ స‌మ‌యంలో అబద్ధాలు చెప్పి సంచలనం సృష్టించారని ఆరోపణల నేప‌థ్యంలో సెతల్వాద్, మాజీ పోలీసు అధికారి సంజీవ్ భట్, గుజరాత్ మాజీ DGP, AAP నాయకుడు RB శ్రీకుమార్‌లను పోలీసులు అరెస్టు చేశారు. జకియా జాఫ్రీ కేసుపై సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిన వెంటనే, హింసను ప్రేరేపించడానికి, కేసును కొన‌సాగించ‌డానికి అబద్ధాలను సృష్టించార‌నే కార‌ణాల‌తో ఈ అరెస్టు జ‌రిగాయి.

అయితే ఈ పరిణామంపై సామాజిక కార్యకర్త, మాజీ పోలీసు అధికారుల అరెస్టుకు వ్యతిరేకంగా UN మానవ హక్కుల కమిషన్ ఒక‌ ట్వీట్ చేసింది. “తీస్తా సెతల్వాద్, ఇద్దరు మాజీ పోలీసు అధికారులను అరెస్టు చేయడం, నిర్బంధించడం ఆందోళనకు గురిచేసిందని, వారిని వెంటనే విడుదల చేయాలి. 2002 గుజరాత్ అల్లర్ల బాధితులకు సంఘీభావంగా ఉన్న వారిని హింసించబడకూడదు.” అని ట్వీట్ చేసింది.

దీనిపై విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, అధికారిక ప్రతినిధి అరిందమ్ బాగ్చి మాట్లాడుతూ “తీస్తా సెతల్వాద్, మరో ఇద్దరు వ్యక్తులపై చట్టపరమైన చర్యలకు సంబంధించి మానవ హక్కుల హైకమీషనర్ (OHCHR) కార్యాలయం చేసిన వ్యాఖ్యలు పూర్తిగా అసమంజసమైనవి, ఇటువంటి వ్యాఖ్యలు చేయడం భారత దేశ స్వతంత్ర న్యాయ వ్యవస్థలో జోక్యం చేసుకోవడమేనని అని ఘాటుగా స్పందించారు. భారతదేశంలోని అధికారులు చట్ట ఉల్లంఘనలపై చ‌ర్య‌లు తీసుకునేట‌పుడు సువ్యవస్థీకృతమైన న్యాయ ప్రక్రియలకు అనుగుణంగా వ్యవహరిస్తార‌ని, అటువంటి చట్టపరమైన చర్యలను క్రియాశీలత కోసం హింసగా పేర్కొనడం తప్పుదారి పట్టించేది, ఆమోదయోగ్యం కాదు, ”అని ఆయన అన్నారు.

ఫోర్జరీకి పాల్ప‌డినందుకు జూన్ 26న IPC లోనిఅనేక సెక్షన్ల కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన తర్వాత గుజరాత్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ తీస్తా సెతల్వాద్‌ను కస్టడీలోకి తీసుకుంది. సామాజిక కార్య‌క‌ర్త ముసుగులో గుజరాత్ అల్లర్ల కేసులో సాక్షులను ప్రభావితం చేస్తూ దొరికిపోయిన సెతల్వాద్‌పై IPC 468 (ఫోర్జరీ చేసినందుకు), 471 (నకిలీ పత్రాల‌ను ఉపయోగించడం), 194 (మరణశిక్ష నేరాన్ని నిర్ధారించే ఉద్దేశ్యంతో త‌ప్పుడు సాక్ష్యాల‌ను సృష్టించ‌డం), తో పాటు మ‌రికొన్ని సెక్ష‌న్ల కింద మ‌రో ఇద్ద‌రిపై కేసులు న‌మోదు చేశారు.

Source : OPINDIA