Home News ఉదయ్‌పూర్ ఘాతుకం: నాగరికతల సమరానికి సంకేతం

ఉదయ్‌పూర్ ఘాతుకం: నాగరికతల సమరానికి సంకేతం

0
SHARE

– రతన్ శార్‌దా

ఉదయ్‌పూర్‌లో ఒక పేద దర్జీ కన్హియా లాల్‌ను బాహటంగా కుత్తుక కోసి హతమార్చడమనేది కొత్తగా జరిగిన సంఘటనేమీ కాదు. దిగ్భ్రాంతికరమైన సదరు వీడియో ఘనత వహించిన లౌకికవాదులు, ఉదారవాదులను దిగ్భ్రాంతికి గురి చేయడంతో దీనిని ఒక అరుదైన ఘటనగా చూపించడానికి వారు ప్రయత్నిస్తున్నారు. కేవలం వారం రోజుల క్రితమే అమరావతిలో డాక్టర్ ఉమేష్ కొల్హేను చంపివేశారు. కానీ హంతకులు వారి ‘పవిత్రమైన జిహాద్’ ను బహిరంగపరచడానికి ఒక వీడియోను చేయడానికి ఇష్టపడని కారణంగా ప్రజలు దిగ్భ్రాంతికి గురికాలేదు. ఇప్పుడు చూస్తున్నంతగా అప్పుడు ప్రజల్లో ఆగ్రహం పెల్లుబుకలేదు. తాము చేసిన పోస్టులకు క్షమాపణ చెప్పిన కిషన్ భిర్వాడ్ ఉన్నారు. అలాగే కమలేష్ తివారీ సైతం అదే పని చేశారు. మొఘల్ సామ్రాజ్య పతనానంతరం దైవ దూషణకు సంబంధించిన తొలి హత్యకు 1920లో స్వామి శ్రద్ధానంద గురయ్యారు. అనంతరం రాజ్‌పాల్ మహాషా హత్య చోటు చేసుకుంది. 1920లో ఆరంభమైన మోప్లా అల్లర్లు తరహాలో హంతకులను కోర్టు లోపలా వెలుపల మేధావులు సమర్థించారు. ఈ వ్యాసం తాలూకు ప్రధాన ఉద్దేశ్యం నుంచి పక్క దారి పట్టవచ్చనే కారణంతో మహాత్మా గాంధీని నేను ఇక్కడ ప్రస్తావించడంలేదు. ఇది 100 సంవత్సరాల హింసాత్మక అసహనం ఇప్పటికీ అలాగే ఉంది.

ఏమీ మారలేదు. నేటికి సైతం అలాంటి బుర్రల్లో విషాన్ని నింపుకున్న నేరస్థులు, టెర్రరిస్టులను మేధావులు, ఇస్లామిక్ సంస్థల నుంచి వెల్లువెత్తుతున్న నిధులు, ఇస్లామీయులు, రాజకీయ నాయకులు సమర్థిస్తున్నారు. అత్యధికుల బుర్రల్లో ఈ విషం నింపే కార్యక్రమం విద్యా సంస్థల ద్వారా, మేధావులతో నిండిన మీడియా ద్వారా బాహటంగా, ప్రశాంతంగా జరుగుతుండగా భారతీయతా ధ్వజాన్ని ఎగురవేస్తూ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) దశాబ్దాల కాలంగా చేస్తున్న కఠినమైన కృషి కారణంగా హిందూత్వ ఎదుగుతున్నది. ఘనత వహించిన లౌకికవాదుల అండతో చెలరేగిపోతున్న వామపక్ష శక్తుల అరాచకానికి అడ్డుకట్టపడింది. సరిగ్గా అప్పుడే మోడీ జీ జనబాహుళ్యంలోకి వచ్చారు. కుయుక్తులు పన్నుతున్నవారు నిరాశ చెందారు.

2014లో, అత్యంత శక్తిమంతమైన సమూహాలు బీజేపీ విజయం తాత్కాలికమేనని, తాము 2019లో తిరిగి అధికారంలోకి వస్తామని భ్రమించాయి. ఆ క్రమంలో మేధావులతో కూడిన విపక్షం వాచాలత్వాన్ని ప్రదర్శించింది. కానీ 2019 ఈ లాబీలను నిశ్చేష్టపరిచింది. మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టయ్యింది. నూపుర్ అంశమనేది కేవలం ఒక నెపం మాత్రమేనని నేను గతంలో వ్రాసి ఉన్నాను. 2019 నుంచి నిరంతరాయంగా అలజడులు, హింసను నెలకొల్పడానికి ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. అది CAA కావొచ్చు లేదా హిజాబ్ వివాదం కావొచ్చు రైతుల ఆందోళన లేదా ప్రస్తుతం అగ్నిపథ్ కావొచ్చు. ఇదే కుయుక్తులను త్రిపుల్ తలాఖ్, ఆర్టికల్ 370పై ప్రయోగించడానికి వారు ప్రయత్నించారు. కానీ అవి పనిచేయలేదు. వారు కిరోసిన్ పోయడం కోసం (రాహుల్ గాంధీ సరిగ్గా ఇలాగే అన్నారు) ఒక నిప్పు రవ్వ కోసం వేచి చూస్తున్నారు. మతపరమైన వేడిని రగల్చడానికి ఉపకరించే ఇతర మండే పదార్థాల కోసం కూడా వారు వేచి చూస్తున్నారు. వీధుల్లోకి రావాలని అంటూ సోనియా గాంధీ ప్రజలకు ఇచ్చిన పిలుపును ఒక్కసారి గుర్తు చేసుకోండి.

నూపుర్ శర్మ ఉదంతాన్ని తమ కుయుక్తులకు అనువుగా మలచుకున్నారు. నిప్పు రవ్వ ద్వారా అంతటా మంటలను వ్యాపింపజేయడానికి మహమ్మద్ జుబెయిర్ లాంటి సోషల్ మీడియా ఇస్లామీయులు సదరు ఉదంతానికి మసిపూసి మారేడుకాయ చేసి మరీ వారి స్వార్థ ప్రయోజనాలకు వాడుకున్నారు. అనేక నగరాలు, పట్టణాల్లో లక్షలాదిగా ముస్లిములు వీధుల్లోకి రావడం, అల్లర్లు చోటు చేసుకోవడంతో ఈసారి వారు విజయం సాధించారు. దురదృష్టవశాత్తూ నూపుర్ దైవ నిందకు పాల్పడ్డారు (లౌకికవాదానికి కట్టుబడినదిగా చెప్పుకునే ఒక దేశంలో) అని అంగీకరించడం ద్వారా పేరొందిన హిందువులు, మేథావులు వారి దురాక్రమణకు చట్టబద్ధత కల్పించారు. శాంతి స్థాపన కోసం నూపుర్‌ సభ్యత్వాన్ని కలిగి ఉన్న భారతీయ జనతా పార్టీ (BJP) సైతం ఆమె తప్పిదానికి పాల్పడినట్టుగా అంగీకరించింది. “పలు అంశాలపై పార్టీ విధానానికి విరుద్ధంగా మీరు అభిప్రాయాలను వ్యక్తం చేశారు. మున్ముందు విచారణ పెండింగ్‌లో ఉంది. తక్షణం అమల్లోకి వచ్చే విధంగా మిమ్ములను పార్టీ నుంచి మీకు అప్పగించిన బాధ్యతల నుంచి సస్పెండ్ చేస్తున్నాము” అని సస్పెన్షన్ లేఖలో పార్టీ కేంద్రీయ క్రమశిక్షణా కమిటీ పేర్కొంది.

ఊహించని విధంగా పలు సమూహాలు ఆమోద ముద్ర వేయడం ఇస్లామీయులు మరింతగా పేట్రేగిపోవడానికి ఆజ్యం పోసింది. నూపుర్ దైవ నిందకు పాల్పడలేదంటూ అన్ని వేదికలపై నేను పదే పదే విజ్ఞప్తులు చేసినప్పటికీ అధీకృత హదీస్, ఇస్లామీయ స్కాలర్లు చెప్పిన మాటలను అదే పనిగా ఈ అసత్యవాదాన్ని యాంకర్లు వల్లెవేశారు. నిత్యం బీజేపీ, ఆర్ఎస్ఎస్‌లపై విమర్శలు గుప్పించే ఒక ఇస్లామీయ స్కాలర్ నా సమక్షంలో జరిగిన ఒక చర్చా కార్యక్రమంలో నూపుర్ దైవ నిందకు పాల్పడలేదు కానీ వేరే దారి లేదని అన్నారు. దేనిని అనుసరించాలి అనే దానికి ఇది వేదికను సిద్ధం చేసింది.

ప్రస్తుతం ఈ దేశాన్ని నిర్దేశిస్తున్నది షరియా లేక రాజ్యాంగమా అనేది ప్రశ్నార్థకంగా మిగిలింది. బుర్రల్లో విషాన్ని నింపుకున్న జిహాదీలు ఈ జీవితం కంటే కూడా మరణానంతర జీవితం పట్ల మరింత ఆసక్తిని కలిగి ఉన్నారు. గొప్పదైన మరణానంతర జీవితం కోసం వారి జీవితాన్ని నరకప్రాయం చేసుకుంటున్నారు. ‘జన్నత్’ లో చోటును దక్కించుకొని ‘హూర్లు’ తో సౌఖ్యాన్ని అనుభవించే దిశగా భగవంతుని మంచి చేసుకోవడానికి వారు కసరత్తు చేస్తున్నారు. అలా జరగడం కోసం ‘వినాశకరమైన రోజు’ న దేవదేవుని ఎదుట నిర్జీవమైన వారి భౌతిక దేహాలు సమాధి చెంది ఉండాలి.

“కంటికి కన్ను తీసుకుంటూ పోతే ప్రపంచం గుడ్డిదైపోతుంది” అనే నానుడి మనలో తరతరాలుగా జీర్ణించుకుపోయింది. రుచించినా రుచించకపోయినా సరే ‘కంటికి కన్ను తీస్తే అనేక కళ్ళు రక్షించపడతాయి’ అనేది చేదు నిజం. ఇది ఒక నాగరికతా సమరం. అధర్మీయులకు వ్యతిరేకంగా ధర్మాన్ని అనుసరించడం ద్వారా 1000 సంవత్సరాలుగా బానిసత్వం, అవమానాన్ని చవిచూస్తున్నాము. ఈజిప్టునకూ ఇదే గతి పట్టింది. అశ్విన్ సంఘి కొత్తగా రచించిన ‘The Magicians of Mazda’ అనే పాక్షిక చారిత్రక కాల్పనిక పుస్తకం భోగభాగ్యాలతో తులతూగిన పర్షియా నాగరికత అంతరించిపోయిన వైనాన్ని గుర్తు చేస్తున్నది. మనదైన ఒక నాగరికతను కాపాడుకోవాలని మనం ఆకాంక్షిస్తున్న పక్షంలో నాగరిక ప్రపంచం ప్రతిపాదించిన ఆమోదిత నియమాలు, మన స్వధర్మాన్ని మనం అనుసరించరాదు. ఎందుకంటే వీటిని జిహాదీలు ఏ మాత్రం గుర్తించరు కాబట్టి. పంకజ్ సక్సేనా ట్వీట్ చేసినట్టుగా ఇది ఒక పద్దతి అంటూ లేని యుద్ధం. ఒక చేతిని వీపునకు కట్టుకొని మనం ఈ యుద్ధం చేయలేము.

రెపరెపలాడుతున్న అత్యంత పురాతనమైన నాగరికత భారత్ ఎంత త్వరగా ఉదయ్‌పూర్ ఉత్పాతాలను గుర్తిస్తే అంత మంచిది. భారతీయ ముస్లిం సమాజంలోని స్థిర చిత్తము కలిగిన వారు సాధ్యమైనంత త్వరగా వహ్హబీ ముస్లిములను, వారి ఏడవ శతాబ్దం నాటి విద్వేష సిద్ధాంతాన్ని దూరం పెడితే అది వారికి, వారి దేశానికి అంత మంచిది. మంచిగా ఉండటం, లౌకికవాదం, సహనపు శిలువను భుజాలపై మోస్తున్న కారణంగా తామెంతగా నష్టపోయిందీ హిందువులు త్వరలో గుర్తిస్తారు. నిజమే, మనం యుగయుగాలుగా అన్ని మతాలతో కలిసి శాంతియుతంగా జీవించాలని ఆకాంక్షిస్తూ వస్తున్నాము. కానీ ఒప్పందం తాలూకు నియమ నిబంధనలు మారిపోయాయి. వాటిని మనం ఆమోదించాల్సిన అవసరం ఉంది. శాంతి అనేది అంగడిలో అమ్మే వస్తువు కాదు. ఒక శక్తిమంతమైన స్థాయిలో ఉండి దానిని సంపాదించాలి. అందుకోసం ముస్లిములతో పాటుగా ప్రతి ఒక్క భారతీయుడు కలిసి రావాలి.

Source : NEWS BHARATHI