Home News CPI(M) కార్యకర్త హత్య కేసు: 13 మంది RSS కార్యకర్తలకు విముక్తి

CPI(M) కార్యకర్త హత్య కేసు: 13 మంది RSS కార్యకర్తలకు విముక్తి

0
SHARE

కేర‌ళ రాష్ట్రంలో 2008లో విష్ణు అనే CPI(M) కార్యకర్త హత్యకు సంబంధించి ట్రయల్ కోర్టు జీవిత ఖైదు విధించిన 13 మంది RSS కార్యకర్తలను నిర్దోషులుగా పేర్కొంటూ కేరళ హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పును ఇచ్చింది. హ‌త్య కేసుకు సంబంధించి 13 మంది RSS కార్యకర్తలను తిరువనంతపురం అదనపు జిల్లా, సెషన్స్ కోర్టు దోషులుగా నిర్ధారించింది. ఈ తీర్పును స‌వాలు చేస్తూ వారు 2016లో కేరళ హైకోర్టులో అప్పీలు చేశారు.

జూలై 12 మంగ‌ళ‌వారం రోజున హైకోర్టులో జ‌రిగిన విచార‌ణ‌లో జస్టిస్ కె. వినోద్ చంద్రన్, జస్టిస్ సి. జయచంద్రన్‌లతో కూడిన డివిజన్ బెంచ్ వారిని నిర్దోషులుగా పేర్కొంటూ తీర్పును వెలువరించింది. RSS కార్యకర్తలను దోషులుగా నిర్ధారించేందుకు కల్పిత కథనాన్ని సృష్టించినందుకు ప్రాసిక్యూషన్‌పై హైకోర్టు విరుచుకుపడింది. సాక్షులను సృష్టించి, సాక్ష్యాలను సేకరించడం ద్వారా ఒక కట్టు కథనాన్ని ప్రవేశపెట్టడానికి ప్రాసిక్యూషన్ ఉద్దేశ్యపూర్వకంగా ప్రయత్నించిందని డివిజన్ బెంచ్ పేర్కొంది.

“కేసుకు సంబంధించి స‌రైన సాక్ష్యం లేదు. నిందితులపై నేరారోపణ పరిస్థితులను నిరూపించడంలో ప్రాసిక్యూషన్ ఘోరంగా విఫలమైంది. ఇందులో రెండు రాజ‌కీయ పార్టీల మ‌ధ్య విబేధాలు స్ప‌ష్టంగా క‌నిపిస్తున్నాయి. అయినా కానీ వారిపై మోపిన అభియోగాల నుంచి నిందితులకు విముక్తి కల్పిస్తున్నాము.” అని హైకోర్టు పేర్కొంది.

విష్ణు హత్య కేసు
ఏప్రిల్ 1, 2008న కైతముక్కు పాస్‌పోర్ట్ కార్యాలయం ఎదుట DYFI (CPI(M) యువజన విభాగం) కార్యకర్త విష్ణు హ‌త్య‌కు గుర‌య్యాడు. హత్యకు సంబంధించి విచారణ చేపట్టి తిరువనంతపురం అదనపు సెషన్స్ కోర్టు 13 మంది RSS కార్యకర్తలను దోషులుగా నిర్ధారించింది. వారిలో 11 మందికి రెండు పర్యాయాలు జీవిత ఖైదు, ఒకరికి యావజ్జీవ కారాగార శిక్ష, మరొకరికి 3 సంవత్సరాల జైలు శిక్ష విధించింది.

అయితే జులై 12న జ‌రిగిన విచార‌ణ‌లో విష్టు హత్య కేసులో ఈ RSS కార్యకర్తలను జైలుకు పంపడానికి ఎలాంటి ఆధారాలు లేవని, ఇదంతా రాజకీయ విబేధాల కార‌ణంగా సృష్టించిన త‌ప్పుడు క‌థ‌న‌మ‌ని కేరళ హైకోర్టు పేర్కొంది.