
వీరసావర్కర్
యాతననుభవించె యావత్తు జీవము
కన్నభూమి కొరకు కడలినీదె
విప్లవాగ్ని యితడె వీర సావర్కరు
వినుర భారతీయ వీర చరిత
భావము:
బ్రిటిష్ వారి కన్నుకప్పి, ఓడ నుండి దూకి, కడలిని ఈది, రెండుసార్లు అండమానులో యావజ్జీవశిక్షను అనుభవించి, కన్నభూమి కోసం తీవ్రమైన బాధలను ఓర్చుకొని, విప్లవవీరులకు మార్గదర్శిగా నిలిచిన వీర సావర్కర్ చరిత్ర తెలుసుకో ఓ భారతీయుడా.
-రాంనరేష్