Home News ‘హర్ ఘర్ తిరంగా’ ఉద్యమ స్ఫూర్తి: 12 వేల అడుగుల ఎత్తున రెపరెపలాడిన జాతీయ పతాకం

‘హర్ ఘర్ తిరంగా’ ఉద్యమ స్ఫూర్తి: 12 వేల అడుగుల ఎత్తున రెపరెపలాడిన జాతీయ పతాకం

0
SHARE

ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకల్లో భాగంగా ఇండో-టిబెటిన్ బోర్డర్ పోలీసులు(ITBP) లడఖ్ వద్ద 12,000 అడుగుల ఎత్తున జాతీయ పతాకాన్ని బుధవారం(జులై 27) ఎగురవేశారు. 75వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆగస్టు 13 నుంచి ఆగస్టు 15 వరకు ‘హర్ ఘర్ తిరంగా’ (ఇంటింటా జాతీయ పతాకం) ఉద్యమంలో భాగంగా జాతీయ పతాకాన్ని ఎగురవేయాలని దేశ ప్రజలకు వారు పిలుపునిచ్చారు.

భారత జాతీయ పతాకం పట్ల ప్రజల్లో అవగాహన కలిగించడానికి తోడు వారి హృదయాల్లో దేశభక్తి భావనను పాదుకొల్పడం కోసం ‘హర్ ఘర్ తిరంగా’ ఉద్యమాన్ని కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ భారతీయుల్లోకి తీసుకువెళుతున్నది.

‘హర్ ఘర్ తిరంగా’ ఉద్యమాన్ని బలోపేతం చేయాలని జులై 22న ట్విటర్ ద్వారా దేశ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోడీ విజ్ఞప్తి చేశారు. “ఈ ఏడాది, ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ జరుపుకుంటున్న సందర్బంగా హర్ ఘర్ తిరంగా ఉద్యమాన్ని బలోపేతం చేద్దాం. ఆగస్టు 13 నుంచి ఆగస్టు 15 మధ్యకాలంలో మీ నివాసాల్లో మువ్వన్నెల పతాకాన్ని ఎగుర వేయండి. ఈ ఉద్యమం జాతీయ పతాకంతో మనకు గల అనుబంధాన్ని మరింత దృఢపరుస్తుంది” అని ప్రధాని ట్వీట్ చేశారు.

Courtesy : ORGANISER