Home News మతపరమైన ఉద్రిక్తతల‌ను అరిక‌ట్టేందుకు కృషి చేయాలి – శ్రీ అజిత్ దోవల్ జీ

మతపరమైన ఉద్రిక్తతల‌ను అరిక‌ట్టేందుకు కృషి చేయాలి – శ్రీ అజిత్ దోవల్ జీ

0
SHARE

దేశంలో జ‌రుగుతున్న మ‌త‌ప‌ర‌మైన ఉద్రిక్త‌త‌ల‌కు అరిక‌ట్టాల్సిన బాధ్య‌త‌ మ‌నంద‌రిపై ఉంద‌ని జాతీయ భద్రతా సలహాదారు (NSA) అజిత్ దోవల్ జీ అన్నారు. న్యూ ఢిల్లీలోని కాన్‌స్టిట్యూషన్ క్లబ్ ఆఫ్ ఇండియా ప్రాంగ‌ణంలో సూఫీ మతపెద్దలతో ఏర్పాటు చేసిన సర్వమత సామరస్య సమావేశానికి అజిత్ దోవల్ జీ హాజరయ్యారు. ఈ సంద‌ర్భంగా ఆయన ప్రసంగిస్తూ దేశంలో జరుగుతున్న మత ఘర్షణలకు భారతీయులమైన మనం మూగ ప్రేక్షకులుగా ఉండలేమని అన్నారు. భారతదేశ పురోగమనానికి భంగం కలిగించే వాతావరణాన్ని సృష్టించేందుకు ప్రయత్నిస్తున్న సంఘ విద్రోహ‌ శ‌క్తుల‌కు వ్యతిరేకంగా మనం సంఘటితమై గళం వినిపించాలని ఆయన పిలుపునిచ్చారు.

ఇండియా టుడే నివేదిక ప్రకారం…”దేశంలో కొన్ని శ‌క్తులు భారతదేశ పురోగతిని దెబ్బతీసే వాతావరణాన్ని సృష్టించడానికి ప్రయత్నిస్తున్నాయి. వారు మతం, భావజాలం పేరుతో అఘాయిత్యాలు, సంఘర్షణలను సృష్టిస్తున్నారు. ఇది దేశం వెలుపల కూడా వ్యాపిస్తూనే మొత్తం దేశాన్ని ప్రభావితం చేస్తోంది. కాబ‌ట్టి ఇటువంటి ప‌రిస్థితుల‌ను మ‌నం చూస్తూ ఉండ‌కుండా మ‌న‌మంతా ఏక‌తాటి పైకి వ‌చ్చి దేశ వ్య‌తిరేక కార్య‌క‌లాపాల‌ను అడ్డుకోవాల్సిన అవ‌స‌రం, బాధ్య‌త మ‌న‌పై ఉన్న‌ది. కేవ‌లం రాడికల్ శక్తులను ఖండిస్తే సరిపోదని, భారతదేశంలోని ప్రతి వర్గాన్ని క‌లుపుకుని మ‌నమంతా ఒక‌టే దేశం అనే భావ‌న‌ను తీసుకురావాలి” అని అజిత్ దోవ‌ల్ జీ అన్నారు.

ఈ సమావేశాన్ని ఆల్ ఇండియా సూఫీ సజ్జద నాశిన్ కౌన్సిల్ నిర్వహించిన ఈ స‌ద‌స్సులో అఖిల భారత సూఫీ సజ్జదా నషీన్ కౌన్సిల్ చైర్‌పర్సన్ హజ్రత్ సయ్యద్ నసీరుద్దీన్ చిష్తీ పాల్గొని ప్రసంగించారు. “ఒక సంఘటన జరిగినప్పుడు మేము ఖండిస్తున్నాము. కానీ ఇప్పుడు అలాంటి సంఘ‌ట‌న‌లు జ‌ర‌గ‌కుండా చూడాల్సిన సమయం వచ్చింది. రాడికల్ సంస్థలను నియంత్రించడం లేదా నిషేధించడం ఈ సమయంలో అవసరం. పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పిఎఫ్‌ఐ)తో సహా ఏదైనా రాడికల్ సంస్థ అయినా వాటికి వ్యతిరేకంగా ఆధారాలు ఉంటే వాటిని నిషేధించాలి.” అని ఆయ‌న అన్నారు.

‘సర్ త‌న్ సే జుదా’ వంటి నినాదాలు ఇస్లాంకు వ్యతిరేకం అని హజ్రత్ సయ్యద్ నసీరుద్దీన్ చిష్తీ అన్నారు. ఇది తాలిబాన్ల అభిప్రాయంమ‌ని, ఇటువంటి వాటికి వ్య‌తిరేకంగా మ‌నం పోరాడాల‌న్నారు.

సమావేశ ముగింపులో చ‌ట్టవిరుద్ధంగా ఉన్న రాడికల్ సంస్థలకు వ్య‌తిరేకంగా ఒక తీర్మానాన్ని ఆమోదించారు. ‘ఏ వ్యక్తి లేదా సంస్థపైనైనా ఏ విధంగానైనా వర్గాల మధ్య ద్వేషాన్ని వ్యాప్తి చేసినట్లు రుజువైతే, చట్ట నిబంధనల ప్రకారం దానిపై చర్యలు తీసుకోవాలని తీర్మానంలో పేర్కొన్నారు. ఏదైనా స‌మావేశంలో గానీ చ‌ర్చ‌ల‌లో గాని ఏదైనా దేవుళ్లను, దేవతలను లేదా ప్రవక్తలను లక్ష్యంగా చేసుకోవ‌డాన్ని ఖండించాలి, చట్టానికి అనుగుణంగా వ్యవహరించాల‌ని తీర్మానంలో పేర్కొన్నారు.

Source : OP INDIA