
బిపిన్ చంద్రపాల్
వంగ విభజ నొద్దు వందెమాతరమని
కారుచిచ్చు లేపె కాంక్ష తోడ
బిపినుచంద్ర నిల్చె విప్లవ దర్శిగ
వినుర భారతీయ వీర చరిత
భావము
బెంగాల్ విభజనను స్వరాజ్య సమర యోధులు బిపిన్ చంద్రపాల్ వ్యతిరేకించారు. దేశమంతటా వందేమాతరం ఉద్యమాన్ని కార్చిచ్చులా రగిలించారు. జైలు శిక్ష అనుభవించిన అనంతరం విదేశాల నుంచి విప్లవ వీరులకు మార్గదర్శిగా నిలిచిన బిపిన్ చంద్రపాల్ వీర చరిత తెలుసుకో ఓ భారతీయుడా!
-రాంనరేష్