Home News వినుర భారతీయ వీర చరిత

వినుర భారతీయ వీర చరిత

0
SHARE

రాణి అబ్బక్క చౌతా

యుధ్ధ నౌక గనుము ఉల్లాలు రాజ్యాన
పోరు బాట పట్టి పోర్చుగీసు
దెబ్బ కొట్టి నట్టి  అబ్బక్కను గనుము
వినుర భారతీయ వీర చరిత

భావము

1947కు 300 ఏళ్ళ పూర్వమే అపరిమిత సేన, అత్యాధునిక ఆయుధాలు కలిగిన పోర్చుగీసు సేనను తక్కువ సైన్యంతో పలుమార్లు ఎదురొడ్డి వారిని పరాజితులను చేసిన వీరనారి అబ్బక్క చౌత. కేరళ ప్రాంతంలో ఉల్లాల్ అనే చిన్న రాజ్యానికి చెందిన ఈ వీరనారి పేరును ఒక యుద్ధనౌకకు పెట్టి ఇటీవలే భారత ప్రభుత్వం గౌరవించింది. ఆ వీరనారి చరిత విను ఓ భారతీయుడా!

-రాంనరేష్