Home News వినుర భారతీయ వీర చరిత

వినుర భారతీయ వీర చరిత

0
SHARE

హేమూ కలానీ

మరల బుట్టెదనుచు మాత స్వేచ్చ కొరకు
యురిని ముద్దిడేను మురిపెముగను
హేమమంటిబిడ్డ హేమూకలానియె
వినుర భారతీయ వీర చరిత

భావము

సింధ్ ప్రాంతంలో జన్మించారు. దేశ స్వాతంత్య్రం కోసం ఉద్యమించారు. బ్రిటిష్ వారి ఆయుధాలు రవాణా చేస్తున్న రైలును పట్టాలు తప్పించడానికి తోటి విప్లవకారులతో కల్సి ఫిష్ ప్లేట్లు తొలగించారు. ఒంటరిగా బ్రిటీషు వారికి చిక్కాడు. హేమూ కలానీని విడిచిపెట్టాలని ఆ ప్రాంత పెద్దలు బ్రిటీషు వారికి విన్నవించుకున్నారు. అందుకు సమ్మతించిన జడ్జి తోటి విప్లవకారుల పేర్లు చెప్పాలని హేమూను అడిగారు. “నాకు ఉరిశిక్ష పడినా పరవాలేదు కానీ నేను వారి పేర్లు చెప్పి తల్లి భారతికి ద్రోహం చేయను” అని నిర్భయంగా పలికారు. 29 ఏళ్ళ వయసులోనే ఉరి కంబం ఎక్కుతున్న హేమూ కలానీని నీ ఆఖరు కోరిక ఏమిటని అధికారులు అడిగారు. అప్పుడు “నేను భారతమాత స్వేచ్చ కోసం మళ్ళీ మళ్ళీ పుట్టాలి. మళ్ళీ మళ్ళీ ఉరికంబం ఎక్కాలి” అని కోరుకున్న భారతి బంగారు బిడ్డ హేమూ కలానీ వీర చరిత విను ఓ భారతీయుడా!

-రాంనరేష్