Home News గర్భాశయ క్యాన్సర్ నివార‌ణ‌కు భార‌త్ లో దేశీయ వ్యాక్సిన్

గర్భాశయ క్యాన్సర్ నివార‌ణ‌కు భార‌త్ లో దేశీయ వ్యాక్సిన్

0
SHARE

గర్భాశయ క్యాన్సర్ నివారణ కోసం భారతదేశం మొట్టమొదటి దేశీయంగా అభివృద్ధి చేయబడిన టీకా సెర్వైక‌ల్‌ష‌(CERVAVAC)ని కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ప్రకటించారు. తక్కువ ఖర్చుతో కూడిన వ్యాక్సిన్ ను రూపొందించిన DBT, BIRAC లకు ముఖ్యమైన రోజు అని అన్నారు. వ్యాక్సిన్ త‌యారీతో ఆత్మనిర్భర్ భారత్ దిశ‌గా భారత్ మరొక అడుగు వేసింద‌న్నారు. సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈఓ ఆద‌ర్ సి.పూనవాల‌, ఇతర ప్రముఖ శాస్త్రవేత్తల‌సమక్షంలో క్వాడ్రివాలెంట్ హ్యూమన్ పాపిల్లోమా వైరస్ (qHPV) వ్యాక్సిన్‌ను శాస్త్రీయంగా పూర్తి చేసినట్లు ప్రకటించారు. టీకా పరిశోధన, అభివృద్ధి సంబంధిత కార్యక్రమాలన్నీ పూర్తయ్యాయని, ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడమే మిగిలి ఉందని ఢిల్లీలో జ‌రిగిన ఒక కార్య‌క్ర‌మంలో తెలిపారు.

ఈ వ్యాధికి మన దేశంలో అభివృద్ధిపరిచిన మొట్ట మొదటి టీకా ఇదే. క్వాడ్రివాలెంట్ హ్యూమన్ పాపిలోమా వైరస్(హెపీవీ) టీకాను ఈ ఏడాది చివరకు విడుదల చేసే అవకాశం ఉందని సీరమ్ సంస్థ సీఈవో ఆదర్ పూనావాలా వెల్లడించారు. టీకా ధర రూ. 200 నుంచి రూ.400 మధ్య ఉండవచ్చన్నారు. ప్రజలందరికీ అందుబాటులోకి తీసుకొచ్చే లక్ష్యంతో ధరను నిర్ణయిస్తామని, ప్రభుత్వంతో చర్చించిన తర్వాత ఇది ఖరారవుతుందని తెలిపారు. తొలుత మన దేశంలో 20 కోట్ల టీకా డోసులను సరఫరా చేస్తామని, ఇక్కడి అవసరాలు తీరిన తర్వాతే విదేశాలకు ఎగుమతి చేస్తామన్నారు.