Home News వినుర భారతీయ వీర చరిత

వినుర భారతీయ వీర చరిత

0
SHARE

చాణక్య చంద్రగుప్త

యవనులనెదిరించి యమపురికి విసర
చక్రవర్తిగాను చంద్రగుప్తు
మలచి గురువు గాను నిలచె చాణక్యుడు
వినుర భారతీయ విమల చరిత

భావము

భారతదేశంపై దాడికి వచ్చిన యవనులను ఎదిరించడానికి చంద్రగుప్తుడు అనే బాలుని చేరదీసారు. చంద్రగుప్తునికి యుద్ధ విద్యలు నేర్పారు. వీరునిగా నిలిచిన చంద్రగుప్తునితో యవనులను తిప్పి కొట్టినటువంటి వీర గురువు చాణక్యుని చరిత విను ఓ భారతీయుడా!

-రాంనరేష్