Home News రాయ్‌పుర్ లో సెప్టెంబ‌ర్ 10నుంచి ఆర్‌.ఎస్‌.ఎస్ స‌మ‌న్వ‌య సమావేశాలు

రాయ్‌పుర్ లో సెప్టెంబ‌ర్ 10నుంచి ఆర్‌.ఎస్‌.ఎస్ స‌మ‌న్వ‌య సమావేశాలు

0
SHARE

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ స్ఫూర్తి, ప్రేరణతో వివిధ రంగాల్లో పనిచేస్తున్న సంస్థల పదాధికారులతో మూడు రోజుల పాటు జ‌రిగే సమన్వయ సమావేశాలు సెప్టెంబర్ 10నుంచి 12వ‌ర‌కు చత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లో జ‌ర‌గ‌నున్నాయ‌ని ఆర్‌.ఎస్‌.ఎస్ అఖిల భార‌తీయ ప్ర‌చార ప్ర‌ముఖ్ శ్రీ సునీల్ జీ అంబేక‌ర్ ఒక ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్నారు. ఈ స‌మావేశంలో పూజనీయ సర్ సంఘచాలక్ డాక్టర్ మోహన్ భగవత్ జీ, సర్ కార్య‌వాహ శ్రీ దత్తాత్రేయ హోసబాలే జీ తో పాటు ఐదుగురు స‌హ స‌ర్ కార్య‌వాహ‌లు, ఇత‌ర సంఘ ముఖ్య అధికారులు పాల్గొంటార‌ని పేర్కొన్నారు.

భారతీయ మజ్దూర్ సంఘ్ కు చెందిన శ్రీ హిరణ్మయ పాండే, శ్రీ సురేందర్‌, విశ్వహిందూ ప‌రిష‌త్ నుంచి శ్రీ అలోక్ కుమార్, శ్రీ మిలింద్ పరాండే, అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ABVP) నుండి శ్రీ ఆశిష్ చౌహాన్, నిధి త్రిపాఠి, BJP జాతీయ అధ్యక్షుడు శ్రీ జె.పి. నడ్డా, శ్రీ బి.ఎల్ సంతోష్, భార‌తీయ కిసాన్ సంఘ్(BKS) నుండి శ్రీ దినేష్ కులకర్ణి, విద్యాభారతి నుండి శ్రీ రామకృష్ణారావు, శ్రీ గోవింద్ మహంతి, రాష్ట్ర సేవికా సమితి నుండి వందనీయ శాంతక్క, సు.శ్రీ. అన్నదానం సీతక్క, వ‌న‌వాసి క‌ళ్యాణ ఆశ్ర‌మం శ్రీ రామచంద్ర ఖరాడి, అతుల్ జోగ్ తో పాటుగా మొత్తంగా 36 సంస్థల ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన‌నున్న‌ట్టు ఆయ‌న పేర్కొన్నారు. ఈ సంస్థలు విద్య, ఆర్ధిక రంగం, సేవ మొదలైన వివిధ సామాజిక రంగాల్లో నిరంతరం పనిచేస్తున్నాయి. ఇలాంటి సంస్థలలో పనిచేసే స్వయంసేవకులతో సంఘం సమన్వయాన్ని కొనసాగిస్తుందని శ్రీ సునీల్ అంబేకర్ తెలిపారు.

ఈ సమావేశంలో ఆయా సంస్థ‌ల ప్ర‌తినిధులు వారి సంస్థ‌ల నివేదిక‌ను, వారి విజయాల గురించి వివ‌రిస్తారు. ఈ స‌మావేశాల్లో విద్య, మేధ‌స్సు, ఆర్థిక వ్యవస్థ, సేవా, జాతీయ భద్రత మొదలైన అంశాల‌కు సంబంధించిన విష‌యాల‌పై ఈ సంస్థ‌లు చ‌ర్చిస్తాయి. ఈ సంస్థలలో క్రియాశీలకంగా ఉన్న స్వయంసేవకులతో RSS సమన్వయం చేస్తుంది. ఈ సమావేశంలో పర్యావరణం, కుటుంబం ప్రబోధన్, సామాజిక సమరస‌తా కు సంబంధించిన విష‌యాల‌పై సమన్వయంతో ఎటువంటి కార్యక్రమాలు చేపట్టాలి అనే విషయంపై కూడా చర్చ జరుగుతుందని శ్రీ సునీల్ అంబేకర్ వెల్లడించారు.