వికటించిన రుణాల పరపతి విధానం:
చైనా బ్యాంకులపై వసూలు కాని బాకీల వలన,అధికమవుతున్న వత్తిడి
‘బ్ల్లూమ్ బెర్గ్’విశ్లేషణ ప్రకారం, ప్రభుత్వరంగ బ్యాంకులు కూడా, చిన్నవ్యాపారాలకు రుణాలు ఇచ్చేందుకు సంసిద్ధంగా లేవు, ఎందుకంటే, ఆయా చిన్నసంస్థలకు, రుణాలకు సరిపడాహామీ ఇచ్చేందుకు స్థిరాస్తులేవీ లేవు, సరైన ధృవీకరణ గల పరపతి రికార్డులు (credit records)కూడా లేవు. ఆన్హుయి (Anhui) లో ఒక విద్యుత్ వాహనాల పరికరాల తయారీదారు, ఈ వార్తాసంస్థతో మాట్లాడుతూ, రుణాలుతిరిగి చెల్లించేసామర్థ్యం తక్కువగా ఉండటం చేత,వాళ్ళసంస్థకు మంజూరైన బ్యాంకు రుణాలలో, కేవలం 60% మాత్రమే చేతికి వచ్చింది, అని చెప్పారు.
అసలే ఆర్థికరంగ మందగమనం వలన తీవ్రమైన ఒత్తిడిలో ఉన్న చైనా బ్యాంకులు, నిరర్థక ఆస్తుల (NPAs) పెరుగుదల వలన హాని కలిగే అవకాశాన్ని కూడా ఎదుర్కొంటున్నాయి. మొత్తం రుణాలలో, స్థిరాస్తుల తనఖా రుణాలు కేవలం 30% మాత్రమే ఉన్నట్లు ఒక అంచనా. ఇంకా రుణగ్రహీతలు ఇలా రుణాలు తీసుకోకుండా బహిష్కరణలతో బెదిరించటం కొనసాగిస్తూ పోయినట్లయితే, బ్యాంకులు స్థిరాస్తి తనఖా రుణాలలో 356 బిలియన్ డాలర్ల నష్టాలను ఎదుర్కోవచ్చునని అంచనా వేశారు.
ఇలా చైనాబ్యాంకులు, ఒకవైపు తమప్రభుత్వం నుండి రుణాలు అధికంగా ఇవ్వాలనే మితిమీరిన ఆదేశాలు, ఇంకోవైపు ప్రమాద నిర్వహణా సామర్థ్యం (RiskManagement Capacity) సవాళ్ళ మధ్య నలిగిపోతున్నాయి. “ఆర్థికరంగంపై అధోగమన ఒత్తిడి క్రమంగా అనుభవమైన కొద్దీ, నిరర్ధక రుణాలు తిరిగి పుంజుకోవాలన్న ఒత్తిడి కూడా పెరుగుతున్నది” అని CBIRC అధికారి లియూ ఝోంగృయీ వ్యాఖ్యానించారు.
చైనాలో అధికమవుతున్న నిరుద్యోగం:
ఆర్థికరంగ మంద గమనం ప్రబలమవుతూండగానే, నిరుద్యోగసంక్షోభాన్ని కూడా చైనా ఎదుర్కొంటున్నది. ఆ దేశ మానవవనరుల మరియు సామాజికరక్షణ మంత్రిత్వశాఖ లెక్కల ప్రకారం, నిరుద్యోగ అంచనావ్యయాలు ఈ సంవత్సరం జూన్ వరకూ, 5.45 బిలియన్ డాలర్లకు చేరింది.
చైనా నిరుద్యోగబీమా వ్యవస్థ లెక్కల ప్రకారం, ఈ సంఖ్య జూన్ 2021 సంఖ్య కంటే, 3.6 రెట్లు అధికం. లబ్ధిదారుల సంఖ్య 20% అధికం అయినప్పటికీ,లోటు మాత్రం 22.7 బిలియన్ యువాన్లకు చేరుకుంది. బీమావ్యవస్థ నమోదు చేసిన లెక్కల ప్రకారం, మార్చి 2020లో నమోదైన15.6 బిలియన్ యువాన్ల లోటు నాటి నుంచి, ఇది తీవ్రమైన పతనం.
‘ది గార్డియన్’ ఎకనమిక్స్ కరస్పాండెంట్ పీటర్ హన్నామ్ చెప్పిన ప్రకారం, చైనాలోని అన్నినగరాలలో, పట్టణాలలో, 16 నుండి 24 ఏళ్ల మధ్య యువతలో, ప్రతి అయిదుగురిలోఒకరు, పని/ఉద్యోగం కోసం నిరీక్షిస్తున్నారు. అధికశాతం యువత గ్రాడ్యుయేషన్ పూర్తిచేసి ఉండటం వలన, ఉద్యోగాల కోసం పోటీ చాలా తీవ్రతరమైంది.
కంపెనీలు/సంస్థలు తమ జీతాల జాబితాలో(payroll) ఉద్యోగుల సంఖ్యను అధికంగా సూచించినట్లయితే, అటువంటి వాటికి కొన్ని ప్రోత్సాహకాలను చైనాప్రభుత్వం ప్రకటించింది. పెద్ద కార్పొరేషన్లు, బీమా సహకారనిధిలో జమచేసిన నిధిలో 50% వరకూ, గత సంవత్సరం నుండి, తిరిగి పొందవచ్చు. చిన్న, మధ్యస్థాయి కంపెనీలయితే, ఈ మొత్తంలో 90% వరకూ, వెనక్కి తిరిగి పొందేటట్లు పెంచబడింది.
ఆశ్చర్యకరంగా, చైనా-అమెరికాల మధ్య 2019లో వాణిజ్యయుద్ధం మొదలైనప్పటినుండి, నిరుద్యోగ బీమానిధిక్షీణిస్తూపోతున్నది. “ నిరుద్యోగ బీమా వ్యవస్థ 2022 పూర్తి సంవత్సరం లోటుతోనే అంతమయ్యే అవకాశం బలంగా ఉన్నది.” అని ప్రముఖ ఆర్థిక శాస్త్రవేత్త టకమోటో సుజుకీ, నిక్కీ ఆసియాతో అన్నారు.
“ఈ నిధుల నిల్వ, నిరంతరంగా ఇలాగే తగ్గుతూ కొనసాగినట్లయితే, పౌరులకు లబ్ది చేకూర్చే బీమా ప్రయోజనాల కాల వ్యవధిని పొడిగించటం, లేదా నగదు చెల్లింపులకు అర్హతను విస్తరింపజేయటం వంటి మంచి పథకాలు/కార్యక్రమాలను కొనసాగించడం చాలా కష్టం అవుతుంది.” అని ఆయన తెలిపారు.
ప్రస్తుతం మన దృష్టి అంతా, శ్రీలంక,బంగ్లాదేశ్ ఆర్థిక వ్యవస్థలపైనా, చైనా ఆర్థికరంగ మందగమనం, వాటివలన సంభవించే పరిణామాలు, ఇవన్నీ మన ఆసియాఖండం పైనా, ప్రపంచ ఆర్థికరంగం పైనా ఎటువంటి దుష్ప్రభావం చూపిస్తాయోనన్న ఆందోళనపైన, సమీపంలో వచ్చే కొన్నినెలల సమయంలో ప్రపంచంలో సంభవించే ముఖ్యాంశాలపైనా, కేంద్రీకృతమయి ఉన్నది.
అనువాదం: సత్యనారాయణ మూర్తి
Source : OPINDIA