-డా.శ్రీరంగ గోడ్బలే
సంఘ స్వయంసేవకుల భాగస్వామ్యం (హైదరాబాదు, మహారాష్ట్ర)
1938-1939 నిజాంకు వ్యతిరేకంగా జరిగిన నిరాయుధ పోరాటంలో మధ్యప్రాంతం, బరార్‌కు చెందిన సంఘ స్వయంసేవకుల భాగస్వామ్యం గురించి సంక్షిప్తంగా ఇంతకు ముందు వ్యాసంలో తెలుసుకున్నాం. ఈ వ్యాసంలో హైదరాబాదు, మహారాష్ట్ర ప్రాంతాలను సంబంధించిన ప్రముఖ సంఘ స్వయంసేవకుల భాగస్వామ్యం గురించి తెలుసుకుందాం. ఈ నిష్కర్ష పరిపూర్ణమైనది కాదనే విషయం దృష్టిలో ఉంచుకోవాలి.
దత్తాత్రేయ లక్ష్మీకాంత్ జుక్కల్‌కర్
నిజాం పాలిత హైదరాబాదు రాజ్యంలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ పని ఎప్పుడు మొదలైంది అనే విషయం స్ఫష్టంగా తెలీదు. వేర్వేరు ప్రదేశాలలో మన సంఘటనా కార్యం రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ పేరు మీదగాక ఏదో ఒక పేరుమీద ప్రారంభించే పద్ధతిని సంఘ నిర్మాత డా. హెడ్గేవార్ అలవరుచుకున్నారు. ఆ పద్ధతి ప్రకారం మహారాష్ట్రలోని కొల్హాపూర్ సంస్థానంలో “రాజారామ్ స్వయంసేవక్ సంఘ్”, గ్వాలియర్ సంస్థానంలో “రాణీజీ స్వయంసేవక్ సంఘ్” అనే పేర్లతో సంఘ పని ప్రారంభమైంది. ఈ ప్రకారంగానే “హిందూ స్వయంసేవక్ సంఘ్” పేరుతో హైదరాబాదు రాజ్యంలో సంఘ పని ప్రారంభమై ఉండవచ్చని సందేహం ఉంది. ముంబై నుంచి వచ్చిన యల్లప్ప గారు సంఘ (బహుశా మరో పేరు) మొదటి శాఖ కరీంనగర్ జిల్లాలో తమ స్వగ్రామమైన కోరుట్లలో 1936లో ప్రారంభించారని చరిత్ర చెబుతోంది. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ అభిలేఖాగార్‌లో లభిస్తున్న లేఖలలో సంఘ కార్యం గురించి మొదటిసారిగా 1939 డిసెంబర్ 12 అంటే నిరాయుధ పోరాటం ముగిసిన తర్వాత ఉల్లేఖించబడింది.
2735 గౌలిగూడ, హైదరాబాదు నుంచి పూజ్య డాక్టర్ హెడ్గేవార్ కు వ్రాసిన ఉత్తరాన్ని దత్తాత్రేయ లక్ష్మీకాంత్ జుక్కల్‌కర్ అనే వ్యక్తి వ్రాసినట్లుగా ఉంది. నిరాయుధ పోరాటానికి ఆయనే ఆద్యుడు. ఉత్తరం ప్రారంభంలోనే “దీనికన్నా ముందు వ్రాసిన ఉత్తరం అంది ఉంటుంది.” అని వ్రాసి ఉంది. 1939 డిసెంబర్ 3న డాక్టర్ జీకి వ్రాసిన ఈ ఉత్తరంలో “ఇక్కడ సంఘపని యధోచితంగా జరుగుతోంది. 1వ తేదీన శ్రీ కె,బి. విమయే ( మహారాష్ట్ర ప్రాంత సంఘచాలక్) సంఘ స్వయంసేవకులను కలిశారు. సంఘ కార్యకర్తలతో ఆలోచనలను పంచుకున్నారు. ఆయన రాకతో స్వయంసేవకులకు మంచి ప్రోత్సాహం లభించింది. పుణె నుంచి వచ్చిన స్వయంసేవక్ శ్రీ కులకర్ణి 8రోజుల పాటు శిక్షకులను తయారు చేసే వర్గ నిర్వహించారు. అది నిన్ననే ముగిసింది. దాని తర్వాత ఆయన ఇక్కడే ఉండిపోవడానికి నిర్ణయించుకోవడం చాలా ప్రాముఖ్యత కల్గిన విషయం. ఆయన ఇక్కడ ఉండడం వల్ల మాకు చాలా సహాయంగా ఉంటుంది. సమయానుకూలంగా ఉత్తరం వ్రాసి విషయాలను తెలుపుతున్నాను.” (సంఘ అభిలేఖాగార్, హెడ్గేవార్ ఉత్తరాలు, Cirrespondence-c-a/Hyderabad 0001)
Read : హైదరాబాద్ (భాగ్యనగర్)నిరాయుధ ప్రతిఘటన: మొదటి భాగం
సంక్షిప్తంగా, జుక్కల్‌కర్ హైదరాబాద్‌లో సంఘానికి ప్రముఖ స్వయంసేవక్ అనేది నిశ్చయమవుతోంది. ఆయన ఎపుడు స్వయంసేవక్ అయ్యారు. సంఘ పని నిరాయుధ పోరాటానికి ముందు లేదా తర్వాత ప్రారంభమైందా అనేది మాత్రం తెలియడం లేదు. జుక్కల్‌కర్ ఉద్యమంలో ప్రముఖ పాత్ర వహించారు. కాబట్టి దాని గురించి సంక్షిప్తంగా చెప్పడం సందర్భోచితంగా ఉంటుంది.
1930కి అటూఇటుగా హిందూ హితం కోసం “కర్మయోగి సేవాదళ్” ను జుక్కల్‌కర్ ప్రారంభించారు. దానిలో భాగంగా గ్రంథాలయం, శార్ధూల్ ప్రకాశన్, నమస్కార్, ప్రార్థనా మండలి, అల్లర్ల పీడిత సహాయనిధి వంటి కార్యక్రమాలను నిర్వహించారు. నిరాయుధ ఉద్యమం ప్రారంభమయ్యాక ఈ దళానికి నిర్వాహకుడిగా జుక్కల్ కర్ దాని పనిని ఆపేశాడు. ఉద్యమం ప్రారంభమయ్యాక వీర యశ్వంతరావు జోషి, జుక్కల్‌కర్ “హిందూ నాగరిక స్వాతంత్య్ర సంఘ్” అనే పేరుతో హైదరాబాద్‌లో పనిచేసే సంస్థకు కార్యదర్శులయ్యారు. 1938 అక్టోబర్ 21న హిందూనేత స్వర్గీయ వామన్ రావ్ నాయక్ ద్వితీయ వర్థంతి సందర్భంగా జోషి, జుక్కల్‌కర్, వారి మరో ముగ్గురు సహచరులు వేలాది ప్రజల సమక్షంలో నిషేధాజ్ఞను ఉల్లంఘించి ఊరేగింపు ప్రారంభించారు. అలా నిరాయుధ వ్యతిరేక ఉద్యమం ఔపచారికంగా ప్రారంభమైంది. ఈ 5మంది వీరుల మీద అభియోగం మోపారు. అక్టోబర్ 26న జోషికి 2సంవత్సరాల కఠిన కారాగార శిక్ష, రూ.200 జరిమానా విధించారు. జుక్కల్‌కర్, మరో ముగ్గురు వీరులకు 6నెలల కఠిన కారాగార శిక్ష, రూ.50 జరిమానా విధించారు. (కేసరి 1938 నవంబర్ 1). 1939 జూన్ 17న జుక్కల్‌కర్ తన జైలు శిక్షను పూర్తి చేసుకుని బయటకొచ్చారు (కేసరి 1 ఆగస్టు 1939). డాక్టర్ జీ స్వర్గస్థులయ్యాక రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సెక్రటరీ ద్వారా “హైదరాబాదు సంస్థాన హిందూ ప్రజా మండల్” అనే లెటర్‌పాడ్ మీడ జుక్కల్‌కర్ కు అభినందన పత్రం, హిందూ స్వయంసేవక్ సంఘ్, ప్రార్థనా మండలి, బాల సంఘ్ ద్వారా ఆమోదించిన తీర్మానం సంఘ అభిలేఖాగార్ లో ఉన్నాయి. (సంఘ అభిలేఖాగార్, హెడ్గేవార్ ఉత్తరాలు (Dr.Hedgewar Miscellaneus 1/ Huderbad 001, 0002).
Read : హైదరాబాద్ (భాగ్యనగర్ )నిరాయుధ ప్రతిఘటన: రెండవ భాగం
న్యాయవాది దత్తాత్రేయ గ.దేశ్‌పాండే ఉరఫ్ బాబూరావు జాఫరాబాద్‌కర్
మహారాష్ట్రలోని జల్నా జిల్లా జాఫరాబాదుకు చెందిన దత్తాత్రేయ గ.దేశ్‌పాండే ఉరఫ్ బాబూరావు జాఫరాబాద్ కర్ 1933లో ఔరంగాబాదుకు వచ్చారు. అక్కడ వ్యాయామశాలు, గణేశ్ మండలి, విద్యార్థి ఉద్యమంలాంటి సార్వజనిక కార్యాలలో పాలు పంచుకున్నారు. రెండేళ్ల తర్వాత ఆయన ఉన్నత విద్య కోసం ఉస్మానియా విశ్వవిద్యాలయంలో చేరారు. హిందూ విద్యార్థులను షేర్వాణి ధరించేలా ఒత్తిడి చేయడం, ప్రార్థన చేసుకోవడానికి అవకాశం లేకుండా చేయడం, వందేమాతరంపై నిషేధం లాంటి అన్యాయాలకు వ్యతిరేకంగా ఉద్యమాలలో ఆయన పాల్గొన్నారు. ఆ తర్వాత ఆయన హిందూ సభ, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ లో సక్రియులయ్యారు. 1939లో ఆయన సంఘ ప్రతిజ్ఞ స్వీకరించారు. ఆయన వ్రాసిన “హైదరాబాద్ వహాడ్ ముక్తి సంగ్రామ్” (నవభారత్ ప్రకాశన్ సంస్థ, ముంబై 1987), `సంస్థాన్ హైదరాబాద్‌చే స్వాతంత్ర లోకస్థితి’ ( సాహిత్యసేవా ప్రకాశన్, ఔరంగబాదు, 1998) అనే రెండు మరాఠీ పుస్తకాలు వివరణాత్మకంగా ఉన్నాయి. “వందేమాతరం” పై విధించిన నిషేధాన్ని వ్యతిరేకంచినందున ఉస్మానియా విశ్వవిద్యాలయానికి చెందిన వేలాది విద్యార్థులను బహిష్కరించారు. నాగపూర్ విశ్వవిద్యాలయం ఛాన్స్‌లర్ టి.జె కేదార్, నాగపూర్‌లోని వేర్వేరు కళాశాలల్లో ప్రవేశం ఇప్పించారు. దీని వెనుకాముందు హిందూమహాసభ , జనసంఘ్ నేత అయిన ప్రొ. విష్ణు ఘనశ్యామ్ దేశ్‌పాండే, సంఘ కార్యకర్త అయిన బిందు మాధవ పురాణిక్ ల విశేష ప్రయత్నం ఉంది. దేశ్ పాండే ద్వయం విద్యార్థుల సమస్యల గురించి డా. హేడ్గేవార్ న్యాయవాది హ.వా. కులకర్ణి (1935- 36 లో సంఘ సర్ కార్యవాహ) డా. ల.వా పరాంజపై, విశ్వనాథరావు కేల్కర్ లాంటి సంఘ హిందూ సభ నాయకులకు అర్థమయ్యేలా వివరించారు. ఈ విషయం ద.గ.దేశ్‌పాండే వ్రాశారు. “సర్ కార్యవాహ కులకర్ణి దేశ్ పాండేకు మామ అవుతారు. కులకర్ణి గారు బెనారస్‌లో అధ్యాపక వృత్తి వదిలిపెట్టి సంఘకార్యం కోసం తమ జీవితాన్ని, సమర్ఫణ చేయడం కోసం ఇక్కడికి రావడానికి శ్రీ మాధవరావు గోల్వళ్కర్ వసతి ఏర్పాటు చేశారు. కులకర్ణి మామ దగ్గరకు రాకపోకలు సాగేవి. అక్కడే శ్రీ గోల్వళ్కర్‌తో మాకు పరస్పర పరిచయం ఏర్పడింది. స్నేహం కలిగింది. విద్యార్థులకు ఓదార్ఫు, ధైర్యం కల్గించే అనేకానేక ఆయన ఉపన్యాసాలు తిలక్ విద్యాలయ భవనంలో జరిగాయి. శ్రీ గోల్వళ్కర్ ధంతోలి – ధరమ్‌పేట్ – నాగపూర్ నగరంలో విద్యార్థులు ఉండడానికి స్థలం లభించేలా చేయడానికి అనేక కష్టలు పడ్డారు.” అని దేశ్‌పాండే గారు రాశారు. ( హైదరాబాద్ వహాడ్ ముక్తి సంగ్రామ్ పుటలు 76,77) హైదరాబాదు నుంచి వెళ్లగొట్టబడిన ఈ విద్యార్థులు వసతులకు డా.హెడ్గేవర్ వెళ్తూ వారితో పరిచయం పెంచుకున్నారు. వారికి సంఘప్థాపన ఉద్దేశ్యం, సిద్ధాంతం, కార్యపద్ధతిని అర్థం చేయించారు. ఈ విద్యార్థులతో అనేక సార్లు కలవడం వల్ల వారిలో చాలామంది విద్యార్థులు తమ వసతుల్లో సంఘ శాఖ ప్రారంభించారు. వారికి మార్గదర్శనం చేయడానికి నాగపూర్ స్వయంసేవకులు వెళ్తుండేవారు. పరీక్షలో ఉత్తీర్ణులయ్యాక కొందరు స్వయంసేవకులు తమ గ్రామాలకు తిరిగి వెళ్లారు. అక్కడ వారు శాఖలు ప్రారంభించారు. (మరాఠ్వాధ్యాతీల్ సంఘచం ఉషఃకాల్, సంపాదకుడు అప్పా పులుజకర్, రాష్ట్రీయ స్వయంసేవక్ జనకళ్యాణ్ సమితి, సంభాజీనగర్ 2007, పుటలు 19-24)
సతారా జిల్లా సంఘచాలక్, హిందూ సభ నాయకుడు శివరామ్ విష్ణు ఉరఫ్ భావూరావు మోదక్ నిరాయుధ వ్యతిరేక ఉద్యమంలో ప్రారంభం నుంచి ఉన్నారు. 1938 మార్చి – ఏప్రిల్ లో నిజాం పాలిత మరాఠ్వాడా (మహారాష్ట్ర) లోని పరిస్థితులను రహస్యంగా సర్వేక్షణ చేయడానికి ఏర్పడిన హిందూసభ త్రిసభ్య సమితిలో సభ్యుడు నిరాయుధ వ్యతిరేక ఉద్యమం నడపడానికి సతారా, దక్షిణ మహారాష్ట్ర ప్రదేశాలలో ఏర్పడిన యుద్ధమండలికి మోదక్ అధ్యక్షుడు కాగా సంఘ సతారా జిల్లా కార్యవాహ, హిందూసభ కార్యకర్త అనంత సదాశివ భిదే ఉరఫ్ భిదే గురూజీ కార్యదర్శి. మహారాష్ట్ర ప్రాంత సంఘచాలక్ కాశీనాథ్ భాస్కర్ ఉరఫ్ కాకా లిమయే మండలిలో సభ్యుడు. (కేసరి 17 ఫిబ్రవరి 1939) సతారా నుండి వాసుదేవ యశ్వంత్ గాడ్గిల్, వినాయక్ ధవలే, భాస్కర్ గజానన్ ఉరఫ్ నానా కాజేకర్, న్యాయవాది కానా. ఉరఫ్ నానా కాప్రె, రంగ సంఘ స్వయంసేవకులను సత్యాగ్రహం తర్వాత బంధించడం జరిగింది. వసంత కులకర్ణి, కరాద్‌కు చెందిన పూర్ణ ప్రజ్ఞ ఘల్సాసీ కూడా సత్యాగ్రహం చేశారు.( స్వర్గీయ బావూ సాహెబ్ మోదక్ శత జయంతి సంవత్సరం 1999, చారిత్రాత్మక స్మరణిక్ పుట 9)
బాబూరావుమోరె
యశ్వంత్ జయరామ్ ఉరఫ్ బాబూరావు మోరె చంద్రాపూర్‌కు చెందిన ప్రశిక్షణ పొందిన సంఘ స్వయంసేవక్ మెట్రిక్ చదువు పూర్తయ్యాక డా.హెడ్గేవర్ సూచన మేరకు 1936లో ఉన్నత చదువు కోసం అహ్మద్ నగర్ (మహారాష్ట్ర) లోని ఆయుర్వేద మహావిద్యాలయంలో చేరాడు. నగరంలోని సంఘ కార్యంపై ఆయన ప్రభావం ఎంత గొప్పగా ఉందంటే నగరానికి చెందిన కొందరు సంఘ స్వయంసేవకులు తమ ఇళ్లల్లో డా.హెడ్గేవర్, బాబూరావు మోరెల ఛాయాచిత్రాలను ఒకటే ఫ్రేమ్‌లో ఉంచుకున్నారు. అహ్మద్‌నగర్ నిజాం రాజుల పాత రాజధాని అయిన కారణంగా అక్కడ ఎక్కువగా మసీదులుంటాయి. సంఘ పథసంచలనం మీద మసీదు నుండి రాళ్లు పడటం మొదలవగానే, బాబూరావు తన సహచరులతో మసీదు తలుపులు తెరిచి లోపలికి దూసుకెళ్లి, ఎదురుగా వచ్చినవాళ్ళను చితకబాదేవారు. ఫలితంగా, సంఘ సంచలనం మీద రాళ్లు పడటం ఆగిపోయింది. బాబూరావు మోరె నిరాయుధ పోరాటంలో హిందూ నాగరిక స్వాతంత్య్ర సంఘ్ 8వ జట్టు నాయకుడు. ఈ జట్టు 1938 డిసెంబర్ 1న బంధించబడింది. మోరె గారికి ఒక సంవత్సరం కఠిన కారాగారవాసం, రూ.50 జరిమానా లేదా 3 నెలల కఠిన కారాగారవాసం విధించారు. ( కేసరి 1938 డిసెంబర్ 20)
బాబూరావు మోరె గారి ఆర్థిక స్థితి అంత బాగుండేది కాదు. బాబూరావు ఈ నిరాయుధ పోరాటంలో తన చదువు, ఆర్థిక ఇబ్బందులను లెక్కపెట్టకుండా పాల్గొన్నారు. ఉద్యమంలో పాల్గొనడానికి డా. హెడ్గేవార్ ఆయనకు ప్రేరణనిచ్చారు. అయితే డాక్టర్ జీ ఇలాంటి లెక్కలేనంత మంది స్వయంసేవకుల క్షేమం గురించి ఆలోచించి, దానికి వ్యవస్థ చేశారు. ఇలాంటి స్వయంసేవకులకు వ్యక్తిగత వ్యవస్థ చేసే సమయంలో సంఘ పద్ధతిని డాక్టర్ జీ ఎల్లప్పుడూ ఎలా దృష్టిలో ఉంచుకునేవారన్నది స్వయంసేవకులు ఆలోచించాల్సిన అవసరం ఉంది. డాక్టర్ జీ తమ వ్యవహారం ద్వారా సంఘ రీతిని నిర్ణయించారన్నది చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. నిజాం కారాగారం నుంచి విడుదలవగానే ఆయన తల్లిగారి ఆరోగ్యం దెబ్బతిన్న కారణంగా మోరె గారు నాగపూర్ కు వెళ్లారు. డాక్టర్ జీ ఆయనను గుర్తుపెట్టుకుని మరీ కలిశారు. ఆయన ఆర్థిక స్థితిని అర్థం చేసుకున్నారు. 1939 డిసెంబర్ 20న అహ్మద్‌నగర్‌కు చెందిన రావ్ సాహెబ్ బాగదేకు రాసిన ఉత్తరంలో డాక్టర్ జీ నగర్‌కు చెందిన శ్రీ బాబూరావు మోరె పరిస్థితిని తెలియజేశారు. `మీకు వ్యవస్థనంతా శ్రీ రావ్ సాహెబ్ బాగదే చేశారు. కాబట్టి మీరు నిశ్చితంగా ఉండండి. మీరు నగర్‌లో మీ చదువు, సంఘకార్యం మరింత గట్టిగా ప్రారంభించండి అని మోరేకు చెప్పాను” అని వ్రాశారు. రావ్ సాహెబ్ బాగడేకు డాక్టర్ జీ “ఇప్పుడు ఆయన (బాబూ రావు మోరె) నగర్‌కు వచ్చారు. మీరు ఆయనకు వ్యవస్థ చేయబోతున్నందుకు నాకు ఆనందంగా ఉంది. ఆయన గురించి ఇకపై నేను ఆలోచించాల్సిన అవసరమే లేదు. మీతో నా వ్యక్తిగత, ప్రేమేతో కూడిన సూచన ఏమిటంటే ఆయన వ్యవస్థ సంఘ డబ్బులతో కాకుండా వ్యక్తిగతంగా చేయమనేదే. ఒక వేళ మీకు ఏదైనా అవసరమైతే నాకు చెప్పగలరు. మీకు అవసరమైన సహకారం మేమే అందించగలం” అని కూడా వ్రాశారు( సంఘ అభిలేఖాగార్, డాక్టర్ హెడ్గేవార్ ఉత్తరాలు, Dr. Hedewar letters cleaned/1939/అక్టోబర్ 1939 20-10-39b)
Read : హైదరాబాద్ (భాగ్యనగర్) నిరాయుధ ప్రతిఘటన – మూడవ భాగం
లక్షణరావు ఇనాందార్, ప్రహ్లాద్ జీ అభ్యంకర్
1939 ఏప్రిల్ 23న హిందూ మహాసభ నాయకుడు ల.బ.భో పట్‌కర్ నాయకత్వంలో 200 మంది ప్రదర్శన కారులు పుణె వదిలిపెట్టి ఉద్యమంలో పాల్గొన్నారు. దానికి ఒక రోజు ముందు డా.హెడ్గేవార్ సంఘ అధికారి శిక్షణ వర్గ (OTC) కోసం పుణెకు వచ్చారు. ఆ రోజున బోపట్‌కర్ జీ కి వీడ్కోలు పలకడం కోసం పుణెలోని చారిత్రాత్మక శనివార్‌వాడలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో డా. హెడ్గేవార్ వేదిక మీద ఉన్నారు. (కేసరి, 1939 ఏప్రిల్ 24) బోపట్‌కర్ బృందానికి వీడ్కోలు చెప్పడానికి డాక్టర్ జీ తర్వాతి రోజున రైల్వేస్టేషన్ వెళ్లారు.
బోపట్‌కర్ జీ బృందంలో ఖటావ్ (సతారా జిల్లా) కు చెందిన ఒక స్వయంసేవక్ ఉన్నారు. లక్షణమాధవ ఇనాందార్ (మూల ఇంటిపేరు ఖటావ్ కర్ ) అనే యువకుడి వయస్సు 22 ఏళ్లు. ఈ సంఘ స్వయంసేవక్ కు డా. హెడ్గేవార్ అనే పరుసవేది స్పర్శ తగిలింది. తర్వాత 1952 నుంచి గుజరాత్‌లో ప్రచారక్, అక్కడ 1972 వరకు ప్రాంత ప్రచారక్, ప్రధానమంత్రి నరేంద్రమోడితో సహా గుజరాత్‌లో అసంఖ్యాక సంఘ స్వయంసేవకులకు మార్గదర్శకుడిగా ప్రఖ్యాతి చెందిన లక్షణరావు ఇనాందార్ ఉరఫ్ వకీల్ సాహెబ్ అనబడే ఆ స్వయంసేవక్ భవిష్యత్ కాలం నేడు కాలగర్భంలో దాగి ఉంది. 1936లో లక్షణరావు విశ్వవిద్యాలయం చదువు నిమిత్తం సతారా నుంచి పుణె వచ్చారు. ఇంటర్లో ఉత్తీర్ణులయ్యాక ఆయన ఎల్.ఎల్.బిలో చేరారు. ఎల్.ఎల్.బి మొదటి పరీక్ష ఉత్తీర్ణులైన అదే సమయానికి భాగానగర్ నిరాయుధ ఉద్యమం ప్రారంభమైంది. 1939 ఏప్రిల్ 21న లక్షణరావు ఎల్.ఎల్.బి అధ్యయనం వదిలిపెట్టి 1939 ఏప్రిల్ 23న బోపట్‌కర్ నాయకత్వంలో పుణె నుంచి బయల్దేరబోయే బృందంతో కలిశాడు.
ఏప్రిల్ 23న బోపట్‌కర్ జీ తన బృందాన్ని తీసుకుని ప్రత్యేక రైలులో పుణె నుంచి హైదరాబాదు బయల్దేరాడు. ఏప్రిల్ 24న ఆ బృందం నాసిక్, మన్మాడు చేరుకున్నపుడు అక్కడ వారికి భవ్య స్వాగతం లభించింది. ఆ బృందం రెండు గుంపులుగా వేర్వేరు రోజుల్లో మన్మాడ్ నుంచి ఔరంగాబాదు చేరుకుంది. అందరినీ ఔరంగబాదు రైల్వేస్టేషన్‌లో బంధించి కారాగారానికి తరలించారు. ఔరంగబాదు కారాగారంలో ప్రద్శనకారులపై అత్యాచారాలు విశేషంగా 5 నుంచి 12 జూన్ 1939 కాలంలో జరిగినవన్నీ 4వ వ్యాసంలో ఇవ్వడం జరిగింది.
ఈ ఘటనా క్రమంలో లాఠీలు చేబూనిన పోలీసులు, నగరానికి చెందిన ముస్లిం గుండాల ద్వారా జరిగిన భయంకర అత్యాచారాలను లక్షణరావు ఎంతో ధైర్యంతో ఎదుర్కొన్నారు. మొట్టమొదట మో.స సాఠే అనే సత్యాగ్రహిని బాగా కొట్టడం జరిగింది. సాఠే ఆ సంఘటనను గురించి `నా తర్వాత లక్షణ్ (వకీల్ సాహెబ్) వంతు అలాంటి పరిస్థితిలోనూ ఆయన గట్టిగా ఉన్నారు. దీనికంతటికీ ఆయన మాసికంగా చాలా ముందుగానే తయారయ్యారు. పోలీసులు కొట్టిన దెబ్బలకు ఆయన ఏమాత్రం కలతచెందలేదు. బాధ, కలత, ప్రలోభం ఆయన ముఖంలో ఎలాంటి మార్పు తేలేదు. దాదాపు 7నెలల తర్వాత వకీల్ సాహెబ్ కారాగారం నుంచి విడుదలయ్యారు’ అని వ్రాశారు. (రాజాభాయూ నెనె, నరెంద్రమోడీ, సేతుబంధ్, ప్రభాత్ ప్రకాశన్, బ-23 పుటలు)
“ఔరంగబాదు జిల్లాలోని కన్నడ తాలుకాకు చెందిన సెవుర్ గావ్‌కు చెందిన ప్రహ్లదరావు అభ్యంకర్ అనే సాహసవంతుడు, త్యాగపూరిత జీవనం గడిపే యువకుడు సత్యాగ్రహం చేశాడు. ఆయనకు 11నెలల కారాగావాసం శిక్ష పడింది. ఔరంగాబాదుకు చెందిన హర్సల్ పర్భణి, హైదరాబాదు కారాగారాల్లో ఆయన శిక్ష అనుభవించాడు. విడుదలయ్యాక ఆయన హిందుత్వ కార్యంలో తనను తాను సమర్పించుకున్నాడు.” అని దేశ్‌పాండే పేర్కొన్నారు. (పుట 90) ఈ సాహస యువకుడు ఆ తర్వాత మహారాష్ట్ర ప్రాంత సంఘచాలక్ అయ్యారు. ప్రహ్లాద్ సీతారామ్ అభ్యంకర్ 11 నెలలు కఠిన కారాగారవాస, ఒక సాధారణ కారాగార వాస శిక్ష అనుభవించాడు. ( కేసరి, 1939 మే 19)
భిడె గురూజీ శౌర్యం
అనంత సదాశివ ఉరఫ్ భిడె గురూజీ, విప్లవవీరుడు బాబారావు సావర్కర్ ద్వారా ప్రేరణ, ప్రశిక్షణ పొందిన హిందుత్వ నిష్ట కలిగిన కార్యకర్త. ఆయన రత్నగిరి (మహారాష్ట్ర లోని పటకవర్థన్ స్కూల్‌లో ఉపాధ్యాయుడిగా వీరసావర్కర్ ద్వారా పరిచయమయ్యాడు. ఫలితంగా ఆయన హిందూ సభ, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ కార్యం చేసేవాడు. 1857 నాటి స్వాతంత్య్ర సమరం మీద వ్యాఖ్యానం (ఉపన్యాసం) చేశాడు. దాంతో ఆయన రత్నగిరి స్కూల్‌ను వదిలేయాల్సి వచ్చింది. కొన్ని రోజుల నిమిత్తం ఆయన సతారాలోని న్యూ ఇంగ్లిష్ స్కూల్‌లో ఉపాధ్యాయుడిగా పనిచేశాడు. సతారాలో ఉన్నన్నాళ్లు ఆయన హిందూసభ, సంఘ్ అభివృద్ధి కోసం పని చేశాడు. నిరాయుధ ఉద్యమం ప్రారంభమయ్యే నాటికి భిడె సంఘ్‌లో సతారా జిల్లాకు జిల్లా కార్యవాహగా ఉన్నారు. దాంతో బాటు ఆయన సతారా జిల్లా, దక్షిణ ప్రదేశాల కోసం ఏర్పాటైన భాగానగర్ నిరాయుధ ప్రతీకార మండలికి కార్యదర్శిగా కూడా అయ్యాడు. ఉద్యమంలో పాల్గొనడానికి ఆయన తన ఉద్యోగానికి రాజీనామా చేశాడు. సంఘానికే చెందిన ఒక కార్యకర్త, న్యాయవాది కా.రా. ఉరఫ్ కారపితో కలిసి భిడె గురూజీ 1939 జనవరి 30న సతారా జిల్లాలో ఉద్యమానికి సమర్థన లభించేలా చూడటానికి పర్యటన మొదలెట్టాడు. ఒక వారంలో ఆయన దాదాపు 40 గ్రామాలలో పర్యటించారు. (కేసరి 1939 ఫిబ్రవరి 15) 1939 మార్చి 10న భిడె గురూజీ నాయకత్వంలో 12మంది ప్రదర్శనకారుల 17వ బృందం హైదరాబాదుకు బయల్దేరింది. అలాగే ఉద్యమంలో పాలుపంచుకోవడానికి భిడే గురూజీ వెళ్లిపోయారు. ఆయన స్థానంలో కాపరె, ప్రతీకార మండలి కార్యదర్శి అయ్యాడు. కాపరెకు సహాయం చేయడానికి శ్రీరామ్ బాలకృష్ణ ఆచార్య అనే సంఘ స్వయంసేవక్ ను నియమించారు. (కేసరి 1939 మార్చి 17) 18వ తేదిన భిడె గురూజీ ఔరంగబాద్‌లో సత్యాగ్రహం చేశాడు. ఆయనను కారాగారానికి పంపించారు. (కేసరి, 1939 ఆగస్టు 1)
విడుదలయ్యాక భిడె గురూజీ మళ్లీ ఉద్యమంలో చేరాడు. 1939 జులై 17న ఆయన నాయకత్వంలో హిందూసభకు చెందిన 6మంది ప్రదర్శనకారులు సికింద్రాబాదులో ఉన్న బ్రిటిష్ రెసిడెంట్ బంగళా వద్దకు ఊరేగింపు తీశారు. మరుసటి రోజు భిడె గురూజీ రెసిడెంట్ సెక్రటరీకి తమ డిమాండ్లను వివరించాడు. రెసిడెంట్‌ను కలవడం కుదరదు అనే జవాబు రాగానే అన్ని రాజ్యాంగపరమైన మార్గాలు మూసుకుపోయాయి, మా మార్గం ఇపుడు తెరుచుకుంది అని చెబుతూ భిడె గురూజీ అక్కడ నుంచి వచ్చేశాడు. ఆయన వెంటనే తన సహచర ప్రదర్శనకారులను వెంటబెట్టుకుని రెసిడెంట్ బంగళా వద్దకు తిరిగివెళ్లాడు. ఆయన చేతిలో కర్ర ఉంది. దానికి భగవాధ్వజం కట్టి ఉంది. బంగళా వద్ద ఉన్న రక్షక భటులను ఏమార్చి లోపలికి వెళ్లగానే అక్కడ స్తంబానికి ఎగురవేయబడిన యూనియన్ జాక్‌తో పోటీపడే భగవాధ్వజాన్ని మరింత ఎత్తుకు ఎగరేసి, హిందూధర్మకీ జయ్ అని నినాదామిచ్చాడు. పులి గుహలోకి వెళ్లి, అక్కడ కాసేపు కూడా సమయం వృథా చేయక, దృడ నిశ్చయంతో భిడే గురూజీ భగవాధ్వజాన్ని ఎగురవేశాడు. హైదరాబాదు విముక్తి ఉద్యమంలో బ్రిటిష్ రెసిడెన్సికి సవాలు విసరడం, వ్యతిరేకత తెలపడంలో ఇదే మొదటి సంఘటన. ( కేసరి 1939 జూలై 18, 21) తర్వాత భిడె గురూజీ సంఘంలో కాకుండా, హిందూసభలో సక్రియంగా ఉన్నాడు. 1945-48 కాలంలో ఆయన “ఫ్రీ హిందూస్థాన్” అనే ఆంగ్ల వారపత్రికను నడిపాడు. ఆయన వీరసావర్కర్ ఇల్లు సావర్కర్ సదన్‌లో క్రింది అంతస్థులో ఉండేవాడు.
మనదేశానికి స్వాతంత్య్రం ఊరికే లభించలేదు. అసంఖ్యాక ప్రజలు తమ వ్యక్తిగత స్వార్థాన్ని మరిచిపోయి స్వాతంత్య్ర సంగ్రామంలో దుమికారు, కారాగార వాసాన్ని స్వీకరించారు. అనేక కష్టాలను అనుభవించారు. ప్రాణాలను బలిదానం చేశారు. వాళ్ల ద్వారా మనకు లభించిన ఈ స్వాతంత్య్రాన్ని సార్థకం చేసుకునే బాధ్యత రాబోయే తరాలమీద ఉంది.
హైదరాబాద్ (భాగ్యనగర్) నిరాయుధ ప్రతిఘటన – నాలుగవ భాగం