Home News కేర‌ళ: ఆర్.ఎస్.ఎస్‌ నేతలే ల‌క్ష్యంగా పీఎఫ్‌ఐ కుట్ర‌.. ఉగ్ర‌వాది అరెస్టు

కేర‌ళ: ఆర్.ఎస్.ఎస్‌ నేతలే ల‌క్ష్యంగా పీఎఫ్‌ఐ కుట్ర‌.. ఉగ్ర‌వాది అరెస్టు

0
SHARE
  • ఆర్‌.ఎస్‌.ఎస్ నాయ‌కుల పేర్ల‌తో ఉన్న కీల‌క ప‌త్రాల స్వాధీనం
  • రాష్ట్ర పోలీసుల‌కు స‌మాచారం లేకుండానే NIA సోదాలు

కేరళలోని కొల్లాం జిల్లా చవరాలో పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్‌ఐ) ఉగ్రవాది మహ్మద్ సాదిక్‌ను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) అరెస్టు చేసింది. పీఎఫ్‌ఐ మాజీ పీఆర్‌ఓ ఇంట్లో జరిపిన దాడిలో కొల్లాం, తిరువనంతపురం జిల్లాల్లోని ఆర్‌.ఎస్‌.ఎస్‌ నేతల వివరాలతో సహా కీలకమైన పత్రాలను (హిట్ లిస్ట్) ఎన్‌ఐఏ స్వాధీనం చేసుకుంది.

కొచ్చి యూనిట్‌కు చెందిన NIA బృందం జనవరి 17న తెల్లవారుజామున 3గం.ల‌కు ఉగ్రవాది ఇంటిపై దాడి చేసింది. వారు చవరా పోలీసుల మద్దతును తీసుకున్నారు. అయితే చివరి క్షణం వ‌ర‌కు సోదాల గురించి రాష్ట్ర పోలీసులకు సమాచార‌మివ్వ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. సోదాల‌కు సంబంధించి కేరళ పోలీసులతో ఎన్ఐఏ ఎలాంటి వివరాలు, పత్రాలు పంచుకోలేద‌ని సమాచారం. ఇలాంటి కీలకమైన కార్యకలాపాల గురించి కేరళ పోలీసులకు తెలియకుండా ఉండటానికి సరైన కారణం ఉంది. గ‌తంలో జ‌రిగిన ఘ‌ట‌న‌ల‌ను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర పోలీసుల‌కు స‌మాచార‌మివ్వ‌కుండానే దాడులు నిర్వ‌హించింది. రాష్ట్ర పోలీసు శాఖలో PFI అనుకూల గ్రూపులు ఉండ‌డ‌మే దీనికి కార‌ణం.ఇందుకు సంబంధించి “పచ్చ వెలిచం” (గ్రీన్ లైట్) అనే పేరుతో ఒక వాట్సాప్ గ్రూప్ ఉంటుంది. దీనిపై మీడియాలో కథనాలు వచ్చాయి.

రాష్ట్ర పోలీసు శాఖ‌లో ఎంతో మంది PFI తో సంబంధాలున్నాయ‌ని దీనికి సంబంధించిన నివేదిక‌ను గ‌తంలో ఎన్ఐఏ రాష్ట్ర పోలీస్ ఉన్న‌తాధికారికి అందజేసిందని మీడియా వెల్లడించింది. కానిస్టేబుల్ ర్యాంక్ నుంచి సబ్ ఇన్‌స్పెక్టర్లు, స్టేషన్ హౌస్ ఆఫీసర్ల (ఎస్‌హెచ్‌ఓ) వరకు 873 మంది పోలీసులు చట్టవిరుద్ధమైన PFIతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నారని నివేదిక‌లో పేర్కొంది. రాష్ట్ర పోలీసు యంత్రాంగం కదలికల గురించి, ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తల ఆచూకీ గురించి సమాచారాన్ని లీక్ చేసినట్లు వారిపై అభియోగాలు మోపారు. సంబంధాలున్న పోలీసులు స్పెషల్ బ్రాంచ్‌లు, ఇంటెలిజెన్స్, లా అండ్ ఆర్డర్, అనేక ఇతర విభాగాలలో, ఉన్నత పోలీసు అధికారుల కార్యాలయ కార్యకలాపాలలో నిమగ్నమై ఉన్నారని నివేదిక పేర్కొంది.

ఫిబ్రవరి 2022లో, ఇడుక్కి జిల్లా, కరిమానూరు పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న పికె అనస్‌ను సర్వీసు నుండి తొలగించారు. నిషేధిత PFI రాజకీయ విభాగం అయిన సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా (SDPI)కి అతను RSS కార్యకర్తలు, నాయకుల వివరాలను లీక్ చేస్తున్నాడని విచార‌ణ‌లో తేలింది. మనీలాండరింగ్, ఉగ్ర‌వాద నిధుల సేక‌ర‌ణ‌లో అత‌ని ప్రమేయం ఉన్న అవకాశాలపై NIA దర్యాప్తు చేస్తున్నట్లు నివేదికలు ఉన్నాయి.