Home News ABPS 2023 – బలమైన, సంపన్నమైన భారత‌దేశ‌మే RSS ల‌క్ష్యం

ABPS 2023 – బలమైన, సంపన్నమైన భారత‌దేశ‌మే RSS ల‌క్ష్యం

0
SHARE

– ర‌త‌న్ శార్దా

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ఆవిర్భవించి వంద సంవ‌త్స‌రాలు కావ‌స్తోంది. ఆర్‌.ఎస్‌.ఎస్ అనేది సమాజంలో ఒక సాధార‌ణ సంస్థగా కాకుండా, స‌మాజం కోసం, స‌మాజాన్ని ఏకం చేయ‌డానికి పుట్టిన‌టువంటి ఒక‌ సంస్థ ఆర్‌.ఎస్‌.ఎస్ అని సంఘ వ్యవస్థాపకులు ప‌ర‌మ పూజ‌నీయ డాక్టర్ కేశవ్ బలిరామ్ హెడ్గేవార్ గారి ముఖ్య ఉద్దేశం. సంఘ ప్ర‌యాణం సుదీర్ఘమైన‌ది. ఇది అంత సుల‌భైనది కాదు. గ‌డిచిన శతాబ్దకాలం దేశంలో, ప్ర‌పంచంలోనూ ఎన్నో పెను మార్పుల‌ను సంభ‌వించాయి. మహర్షి అరబిందో, శ్రీ గురూజీ వర్ణించినట్లుగా ఆ కల్లోల జలాల్లో ముందుకు వెళ్తున్న ఓడ లాగా ఎన్నో అటంకాలు ఎదురైన‌ప్ప‌టికీ బహుళ-వర్ణ విరాట్ పురుషుని వంటి భారతదేశం అని పిలువబడే దేశ‌భ‌క్తిని క‌ణ కణంలోకి నింపిన సంస్థను నిర్మించడం అనేది ఎంతో మంది సామాజికవేత్త‌లు గుర్తించడానికి తిరస్కరించినా.. ఇప్పుడు ఎన్నో విజ‌యాలు సాధించి శ‌తాబ్ధి ఉత్స‌వాల‌కు స‌న్న‌ద్ధ‌మైంది.

RSS ఆవిర్భ‌వించిన కాలంలోనే ఎన్నో ఇతర సంస్థలు, ఉద్యమాలు కూడా పుట్టుకొచ్చాయి. వాటిలో ముఖ్యమైనది కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా, సోషలిస్ట్ ఉద్యమం. ఇవి రెండూ ఎప్పుడో చీలిపోయి తమ శక్తిని పూర్తిగా కోల్పోయాయి. స్వాతంత్య్ర పోరాటంటో అందరినీ కలుపుకుని ప‌ని చేసిన భారత జాతీయ కాంగ్రెస్ కూడా చాలా సార్లు పరివర్తన చెందింది. ఇప్పుడు శిథిలావ‌స్థ‌లో ఉంది. కానీ RSS మాత్రం తనను తాను పునరుద్ధరించుకుంటూ, అభివృద్ధి చెందుతూనే ఉంది. నేను రాసిన “RSS – దాని పరిణామం” అనే పుస్త‌కంలో “ఒక సంస్థ నుండి ఉద్యమం వరకు” అనే నేప‌థ్యాన్ని చాలా వ‌ర‌కు విస్తరించాను. సంపన్నమైన భారత్‌ను నిర్మించడానికి, ఐక్యమైన బలమైన సమాజాన్ని నిర్మించాలనే లక్ష్యాన్ని సాధించడానికి RSS దాని పనిలో అనేక చేర్పులు, పునరావృత్తులు ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ, ఇది హిందూ రాష్ట్రమని, హిందుత్వమంటే పురాతన మర్రి చెట్టును కాపాడిన రసము వంటి ఈ దేశ నాగ‌క‌రితనే ఈ దేశ ప్రాణ‌మ‌ని స్ప‌ష్ట‌మ‌వుతోంది.

RSS సంస్థ రజతోత్సవం లేదా స్వర్ణోత్సవాలను జరుపుకోవాలని ఎప్పుడూ భావించ లేద‌నేది డాక్టర్ జీ అభిప్రాయం. “మనం ఈ కళ్లతో, భౌతికంగా స్వతంత్ర, ఐక్యమైన, సుసంపన్నమైన భారతదేశాన్ని చూస్తాము” అని వారు ప్రముఖంగా చెప్పారు. బాలాసాహెబ్ దేవరస్ కూడా ఈ అభిప్రాయాన్ని పునరుద్ఘాటించారు. ఏది ఏమైనప్పటికీ, ఈ దశకు రావడానికి నాలుగు, ఐదు తరాల వ్య‌క్తుల‌ త్యాగం వ‌ల్ల ఆ దృష్టి ఇప్పుడు మన సమాజంలోని సాధారణ పౌరులచే భాగస్వామ్యం చేయగ‌లుగుతున్నాం. RSS ఈ ప్రయాణం 100 ఏళ్లు పూర్తి చేసుకునే లోపు ఈ ల‌క్ష్యాన్ని నెరవేరాల్సిన అవసరం ఉందని సంఘ పెద్ద‌లు భావిస్తున్నారు. అందువల్ల, రాబోయే రెండు సంవత్సరాలు సంఘ‌ లక్ష్యాలు మరింత ప్ర‌తిష్టాత్మకమైనవి, విస్తృతమైనవి.

ఇటీవల ముగిసిన అఖిల భారతీయ ప్రతినిధి సభ (ABPS) లో “సామాజిక సామరస్యం, కుటుంబ విలువలు, పర్యావరణ పరిరక్షణ, స్వదేశీ (భారతీయ) భావ‌న‌, పౌర క‌ర్త‌వ్యం పట్ల అవగాహన ద్వారా పరివర్తన తీసుకురావడమే తమ లక్ష్యం అని RSS పేర్కొంది. భారతీయ విలువలు, సేవభావం, కుటుంబ విలువ‌లు మహిళల సహాయం లేకుండా సాధ్యం కాదనే విష‌యం సంఘం గ‌ట్టిగా న‌మ్ముతుంది.
ఈ రోజు మనం చూస్తున్న జాతీయ పునరుజ్జీవనాన్ని ‘స్వయం’ అనే ‘స్వ’ స్ఫూర్తి ఆధారంగా దాని తార్కిక ముగింపున‌కు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని, భారతీయ జ్ఞానం, భారతీయ తత్వశాస్త్రంపై నిర్మించబడిన దేశం, మరే ఇతర దేశాన్ని అనుస‌రించాల్సిన అవ‌స‌రం లేదు అని తీర్మానం చెబుతోంది.

శతాబ్ది సంవత్సరం సమీపిస్తున్న తరుణంలో RSS ఎటువంటి వేడుకల గురించి మాట్లాడలేదు. సమాజంలోని ప్రతి వర్గాన్ని చేరుకోవాలనే దాని సంకల్పానికి కట్టుబడి ఉంది. సర్ కార్య‌వాహ జీ మాట్లాడిన దాని ప్ర‌కారం దేశ‌మంత‌టా సంఘ కార్య విస్త‌ర‌ణ ప‌నులు ప్రారంభ‌మ‌య్యాయి. సంఘ ప్రాథమిక విభాగ‌మైన శాఖల ధోరణిలో మార్పు, శాఖ స్వయంసేవకులు గ్రామాలు, నివాసాల సామాజిక వాస్తవాలను అధ్యయనం చేయ‌డం, స్థానిక సంఘాలను కలుపుకొని వారి సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేయాల‌నేది సంఘ ప్ర‌ధాన ల‌క్ష్యంగా పెట్టుకుంది.

1950 నుండి RSS ఆమోదించిన తీర్మానాలను అధ్యయనం చేసిన తరువాత, ఇటీవలి కాలంలో ప్ర‌తినిధి స‌భ‌ల‌లో ఆమోదించే తీర్మానాల సంఖ్య తగ్గిందని గమనించ‌వ‌చ్చు. సమాజంలోని వివిధ రంగాల ప్ర‌ముఖుల‌తో చ‌ర్చ‌లు, మీడియాతో పరస్పర చ‌ర్చ‌ల వ‌ల్ల RSS దాని అభిప్రాయాలు, కార్యాచరణ ప్రణాళికలను మరింత తరచుగా వివరిస్తుంది. దీని వ‌ల్ల గతంలో ఉన్నన్ని తీర్మానాలను ఆమోదించవలసిన అవసరాన్ని త‌గ్గించింది. ఇంతకుముందు, ఏడాదిలో జ‌రిగే రెండు జాతీయ సమావేశాల్లోనే RSS త‌న‌ దృక్పథాన్ని, విధానాలను వాటిని ప్రజలతో పంచుకునేది. మారుతున్న కాలానిక‌నుగ‌ణంగా ఒక సంవత్సరం లేదా ఆరు నెలలు వేచి ఉండటం సాధ్యం కాదు.

RSS వ్యవస్థాపకులు డాక్ట‌ర్ జీ అంతిమ దృక్పథాన్ని నెరవేర్చాలనే సంక‌ల్పంలో ఈ సారి తీర్మానం ప్రతిష్టాత్మకమైనది. భారత పౌరుల్లో ‘స్వ’ స్ఫూర్తిని మేల్కొలిపే లక్ష్యంతో RSS ప్రయాణం ప్రారంభమైంది. డాక్టర్ హెడ్గేవార్ ఇతర పెద్ద సంస్థలతో కలిసి పనిచేసిన తర్వాత స్వేచ్ఛాయుత‌, బలమైన భారత్ ను సాధించడానికి అప్పటికే ఉన్న ప‌ద్ద‌తుల‌ను అనుసరించడానికి నిరాకరించారు. భారతీయ జ్ఞానం ఆధారంగా, దాని స్వంత నమూనా, స్వ‌యం స్ఫూర్తితో పని చేసే కొత్త వినయపూర్వకమైన సంస్థను కొత్తగా ప్రారంభించారు. ‘స్వ’ అనే భావం భారతీయ ఆలోచనలపై పెరిగిన జాతీయ జీవితంలోని వివిధ కోణాలలో ఏర్ప‌డిన సంస్థలపై కూడా ప్ర‌భావం చూపింది. విద్యార్థి ఉద్యమం, కార్మిక ఉద్యమం, మతపరమైన ఉద్యమాలు, గిరిజన ప్రాంతాల్లో పని అయినా ‘స్వ’ భావ‌న వ్యాప్తి చెందింది.

“ప్రపంచ శ్రేయస్సు అనే గొప్ప లక్ష్యాన్ని సాధించడానికి భారతదేశం ‘స్వా’ స్ఫూర్తి ఎల్లప్పుడూ మనందరికీ ప్రేరణనిస్తుంది. విదేశీ దండయాత్రలు, పోరాటాల కాలంలో, భారతదేశం సామాజిక జీవితం అస్తవ్యస్తమైంది. సాంఘిక, ఆర్థిక, సాంస్కృతిక, మత వ్యవస్థలు తీవ్రంగా ఛిద్రమయ్యాయి. ఈ కాలంలో సాధువులు, మహానుభావుల ఆధ్వర్యంలో మొత్తం సమాజం నిరంతర పోరాటంలో తన “స్వ” (స్వాభిమానాన్ని) కాపాడుకుంది. ఈ పోరాటానికి ప్రేరణ “స్వ” త్రయంపై ఆధారపడింది. స్వ ధర్మం, స్వదేశీ, స్వరాజ్యం మొత్తం సమాజం ఇందులో పాల్గొన్నారు. స్వాతంత్య్ర అమృత మహోత్సవాల సందర్భంగా ఈ ప్రతిఘటనలో సహకరించిన ప్రజా నాయకులను, స్వాతంత్య్ర సమరయోధులను, దార్శనికులను దేశం మొత్తం కృతజ్ఞతతో అభినందిస్తోంది.

ప్రపంచంలోని అగ్రగామి ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా నిలిచేందుకు భారత్ ప్రతి రంగాల్లో ఎలా పురోగమించిందో వివరిస్తూ తీర్మానం కొనసాగుతోంది. భారతీయ శాశ్వత విలువలపై ఆధారపడిన పునరుజ్జీవనాన్ని ప్రపంచం అంగీకరిస్తోందని ఇది మనకు గుర్తుచేస్తుంది. వసుధైవ కుటుంబం కోసం విశ్లేష‌ణాత్మ‌క ప్ర‌ణాళ‌క ఆధారంగా ప్రపంచ శాంతి, సార్వత్రిక సౌభ్రాతృత్వం, మానవ శ్రేయస్సును నిర్ధారించడం కోసం భారత్ తన నిర్దేశిత పాత్ర వైపు వెళుతోంది. బలమైన ఐక్యత, సంపన్న దేశం ఉన్నతమైన ఆదర్శాల గురించి మాత్రమే మాట్లాడలేము. ఇది జరగాలంటే, సమాజంలోని అన్ని వర్గాల ప్రాథమిక అవసరాలను నెరవేర్చడం, సమగ్ర అభివృద్ధికి అవకాశాలు, సాంకేతికతను తెలివిగా ఉపయోగించడం, పర్యావరణ అనుకూల అభివృద్ధి ద్వారా ఆధునికత అనే భారతీయ భావన ఆధారంగా కొత్త నమూనాలను నిర్మించడం వంటి సవాళ్లను మనం అధిగమించాలని తీర్మానం పేర్కొంది. .

కేవలం ఆర్థిక శ్రేయస్సు మాత్ర‌మే ఆరోగ్యకరమైన సమాజాన్ని ఇవ్వదని RSS గ్రహించింది. కుటుంబాల విచ్ఛిన్నం, సామాజిక బంధాలు, సమాజం బలహీనపడటం వ‌ల్ల ఒకప్పుడు శక్తివంతమైన, సంపన్నమైన పాశ్చాత్య సమాజాలు బలహీనపడటం మ‌నం గ‌మ‌నించాం. అందువల్ల కుటుంబ వ్య‌వ‌స్థ‌ను బలోపేతం చేయడం, సౌభ్రాతృత్వ ఆధారిత సామరస్య సమాజాన్ని సృష్టించడం, స్వదేశీ స్ఫూర్తితో వ్యవస్థాపకతను అభివృద్ధి చేయడం వంటి లక్ష్యాల సాధనకు మనం ప్రత్యేక కృషి చేయాల్సిన అవసరం ఉందని పేర్కొంది. ఆర్‌ఎస్‌ఎస్ తన అన్ని తీర్మానాల్లోనూ స్వయంసేవకులను, సమాజం వివిధ సమస్యల పరిష్కారానికి, తన ఆలోచనల నెరవేర్పున‌కు ముందుకు రావాలని ఉద్బోధిస్తూనే ఉంది. ప్రభుత్వాలు మాత్రమే మార్పు, పరిణామాన్ని తీసుకురాలేవని సమాజం కృషి చేయాలి ఆర్‌.ఎస్‌.ఎస్ నమ్ముతుంది. అందువల్ల మొత్తం సమాజం ముఖ్యంగా యువత ఈ విషయంలో సంఘటిత ప్రయత్నాలు చేయాల్సి ఉంటుందని తీర్మానం పేర్కొంది. భారతీయ ఆలోచనా విధానం విద్యా, ఆర్థిక, సామాజిక, ప్రజాస్వామిక, న్యాయ సంస్థలతో సహా సామాజిక జీవితంలోని అన్ని రంగాలలో సమకాలీన వ్యవస్థలను అభివృద్ధి చేసే ఈ ప్రయత్నంలో జ్ఞానోదయంతో సమాజం పూర్తి శక్తితో పాల్గొనాలని RSS పిలుపునిచ్చింది.

స్వాతంత్య్రం పొంది ఏడు దశాబ్దాలుగా అయిన‌ప్ప‌టికీ మ‌నం వలసవాద మనస్తత్వానికి బానిసలుగా ఉన్నామని ఇప్పుడిప్పుడు సమాజం గుర్తింస్తోంది. భారతీయ ఆలోచనల పునరుజ్జీవనం ఇప్పుడిప్పుడే మొదలైంది. పైన పేర్కొన్న లక్ష్యాల సాకారం కోసం మనం వలసవాద మనస్తత్వాన్ని విడిచిపెట్టి, పౌర విధులకు కట్టుబడి సామాజిక జీవితాన్ని ఏర్పాటు చేసుకోవాలని తీర్మానం నొక్కి చెబుతుంది.

భారతదేశం ఒక ప్రముఖ శక్తిగా ఎదగడానికి చేస్తున్న ప్రయత్నాలను భగ్నం చేయడానికి అంత‌ర్గ‌తంగా, వెలుప‌ల‌ వివిధ శక్తుల ప్రయత్నాలను RSS ఎప్పుడూ పట్టించుకోలేదు. మనం నిర్ణయాత్మక కాలంలో ఉన్నామని గుర్తు చేస్తుంది. అందుకే, అనేక దేశాలు భారత్ పట్ల గౌరవం, సద్భావన కలిగి ఉన్నప్పటికీ, ప్రపంచంలోని కొన్ని శక్తులు ఈ భారతీయ పునరుజ్జీవనాన్ని స్వావ‌లంబ‌న‌ను అంగీకరించడం లేదు. దేశంలో, వెలుపల హిందూత్వ ఆలోచనను వ్యతిరేకించే ఈ శక్తులు కొత్త కుట్రలు పన్నుతున్నాయి అనే వాస్తవాన్ని ఇది నొక్కి చెబుతుంది. సమాజంలో పరస్పర అపనమ్మకాన్ని సృష్టించడం, స్వార్థ ప్రయోజనాలను, విభజనను ప్రేరేపించడం ద్వారా వ్యవస్థాగత పరాయీకరణ, అరాచకాలను సృష్టించడం వీటన్నింటి పట్ల అప్రమత్తంగా ఉంటూనే వారి ఎత్తుగ‌డ‌ల‌ను కూడా ఓడించాలి. వామపక్షాలు, దాని అంతర్జాతీయ సహకారులు అస‌హ‌నాన్నివ్యాప్తి చేసి సమాజాన్ని, దేశాన్ని విచ్ఛిన్నం చేసే తీవ్రమైన ముప్పును తెలియ‌జేసే ఒక ప్రత్యేక తీర్మానాన్ని ఆమోదించాలి. తద్వారా ప్రజలు ఈ ముప్పు తీవ్రతను అర్థం చేసుకోగలరు.

సార్వత్రిక శ్రేయస్సు కోసం కట్టుబడి ఉన్న బలమైన, సంపన్న దేశంగా ప్రపంచ వేదికపై భారత్ తన సముచిత స్థానాన్ని సంపాదించుకోవ‌డానికి దాదాపు 100 సంవత్సరాలు శ్రమించిన సమయం ఆసన్నమైందని RSS భావిస్తోంది. ఇపుడు ఇక భార‌త్ వేచి ఉండ‌ద‌ని, స్వామీ వివేకానంద కాలం నుండి సమాజం ఎలా ఉండాల‌ని, భార‌త్ ఆశించిందో మన దార్శనికులు అంచనా వేసిన మన లక్ష్యాన్ని స్వయం, ప్రపంచ సమాజం కోసం నెరవేర్చే ఈ చారిత్రాత్మక అవకాశాన్ని ఉపయోగించుకోవడానికి ఒకటిగా ఎదగాడానికి ఇది స‌రైన స‌మ‌య‌మ‌ని ఆర్‌.ఎస్‌.ఎస్ భావిస్తోంది.

Source : Organiser