Home News ఆర్‌.ఎస్‌.ఎస్ పరువు న‌ష్టం కేసులో జావేద్ అక్త‌ర్ పిటిష‌న్ ను తిర‌స్క‌రించిన ముంబై సెషన్స్ కోర్టు

ఆర్‌.ఎస్‌.ఎస్ పరువు న‌ష్టం కేసులో జావేద్ అక్త‌ర్ పిటిష‌న్ ను తిర‌స్క‌రించిన ముంబై సెషన్స్ కోర్టు

0
SHARE

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) ప్ర‌తిష్ట‌ను భంగ‌ప‌రిచి… పరువు నష్టం కేసులో మేజిస్ట్రేట్ కోర్టు జారీ చేసిన సమన్లను సవాలు చేస్తూ గీత రచయిత జావేద్ అక్తర్ చేసిన రివిజన్ దరఖాస్తును ముంబైలోని సెషన్స్ కోర్టు తిరస్కరించింది.

“ఇంటర్వ్యూలో పిటిషనర్ (అక్తర్) చేసిన వ్యాఖ్యలు ఒక జాతీయ ఛానెల్, యూట్యూబ్‌లో ఉంది. ఆయ‌న వాఖ్య‌లు ఆర్‌.ఎస్‌.ఎస్ స్వ‌యంసేవ‌కుల, మద్దతుదారుల ప్రతిష్టకు భంగంవాటిల్లింది. ఆఫ్ఘనిస్తాన్‌లోని తాలిబాన్‌ల మాదిరిగానే ఆర్‌ఎస్‌ఎస్ వ్య‌వ‌హ‌రిస్తుందంటూ చేసిన వ్యాఖ్యలవల్ల ఆర్‌ఎస్‌ఎస్ ప్రతిష్ట దిగజారిందని చూపించడానికి తగిన అంశాలు ఉన్నాయి” అని సెషన్స్ కోర్టు పేర్కొంది. నిందితుడు తన ఇంటర్వ్యూలో చేసిన వాఖ్య‌లు కచ్చితంగా ఉద్దేశ‌పూర్వ‌కంగా చేసిన‌ట్టు ఉన్నాయని కోర్టు పేర్కొంది. దీనికి సంబంధించి ప్రాథమిక సాక్ష్యం ఉందని మెజిస్ట్రేట్ కోర్టు పేర్కొన్న తీర్పును కూడా సెష‌న్స్ కోర్టు గ‌మ‌నించింది.

“నిందితుడు అత్యంత ప్రసిద్ధ వ్యక్తి. అలాగే RSS కూడా ఎంతో మంది స్వ‌యంసేవ‌కులు మద్దతుదారులతో దేశంలో ప్రసిద్ధి చెందిన సంస్థ‌. అదే విధంగా ఇటీవ‌ల అఫ్ఘ‌నిస్తాన్‌లో తాలిబాన్ ల కార్యకలాపాలు ప్రపంచం గమనించింది. దీంతో జావేద్ అక్త‌ర్ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్య‌లు అధికంగా ప్రాచుర్య‌మ‌య్యాయి.

కేసు వివ‌రాలు :

2021లో NDTV ఇచ్చిన ఇంటర్వ్యూలో అక్తర్ RSS సంస్థను రాడికల్ ఇస్లామిస్ట్ సంస్థ తాలిబాన్‌తో పోల్చిన తర్వాత సంతోష్ దూబే అనే ఆర్‌ఎస్‌ఎస్ కార్య‌క‌ర్త‌, న్యాయవాది మేజిస్ట్రేట్ కోర్టులో పిటిష‌న్ దాఖలు చేశారు.

”ముస్లిం దేశాన్ని నిర్మించేందుకు తాలిబాన్‌లు ప్రయత్నిస్తున్న తీరు. అదే విధంగా కొందరు హిందూ రాష్ట్ర భావనను క‌ల్పిస్తున్న వ్యక్తుల మనస్తత్వం ఒక్కటేనని, ఆర్‌ఎస్‌ఎస్‌, విశ్వహిందూ పరిషత్‌, భజరంగ్‌దళ్‌కు మద్దతిచ్చే వ్యక్తులది అదే మనస్తత్వమని జావేద్ అక్తర్‌ అనవసరపు వ్యాఖ్యలు చేశారు.

మేజిస్ట్రేట్ కోర్టు సమన్లు ​​జారీ చేసిన తర్వాత, గీత రచయిత క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (CrPC) సెక్షన్లు 397, 399 కింద ముంబైలోని సెషన్స్ కోర్టును ఆశ్రయించారు. రివిజన్ అప్లికేషన్‌లో, సంతోష్ దూబేకి ఈ కేసులో ఎటువంటి లోకస్ స్టాండి లేదని అతను పేర్కొన్నాడు.

“పిటిషనర్‌పై నిర్దిష్టమైన లేదా సాధారణమైన ఆరోపణలు లేవు, కానీ అతను ఏదో ఒకదానిపై తన ఆలోచనలను వ్యక్తం చేయడం పరువు నష్టం కలిగించే నేరంగా పరిగణించబడదు, ఫిర్యాదుదారుడికి ఫిర్యాదు చేసే హక్కును ఇవ్వదు” అని అతని దరఖాస్తు లో పేర్కొన్నాడు. తాజాగా సెషన్స్ కోర్టు ఈ దరఖాస్తును తిరస్కరించింది.

Source: OPINDIA