జాగృతి వార పత్రిక సౌజన్యంతో సమాచారభారతి, జాతీయ సాహిత్య పరిషత్, ప్రజ్ఞాభారతి, ఇతిహాస సంకలన సమితి, భారత్ వికాస్ పరిషత్, సంస్కార భారతి, సెంటర్ ఫర్ సౌత్ ఇండియన్ స్టడీస్ భాగస్వామ్యంతో ఏప్రిల్ 7న వరంగల్ జిల్లా హన్మకొండలోని బాలసముద్రంలోని సామ జగన్ మోహన్ రెడ్డి స్మారక భవనంలో “ఓరుగల్లు సాహితీ ఉత్సవం” జరగనుంది.
ప్రారంభ సమావేశంలో “నైజాం విముక్త స్వాతంత్య్ర పోరాటం రజాకార్ల అరాచాకాలు” అనే అంశంపై వక్తలు ప్రసంగించనున్నారు. సభాధ్యక్షులుగా నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో గణిత శాస్త్ర ఆచార్యులు ఆచార్య జె. వి. రమణమూర్తి గారు, ముఖ్య అతిథిగా నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ డైరెక్టర్ ఆచార్య యన్.వి. రమణారావు, ప్రధాన వక్తగా ఆర్.ఎస్.ఎస్. తెలంగాణ ప్రాంత కార్యవాహ శ్రీ కాచం రమేష్ గారు పాల్గొననున్నారు.
మొదటి సంగోష్టిలో సభాధ్యక్షులుగా సహృదయ సాహిత్య సాంస్కృతిక సంస్థ అధ్యక్షులు, డా॥ గన్నమరాజు గిరిజా మనోహర్ బాబు గారు వ్యవహరించనున్నారు. వక్తగా శ్రీ అరబిందో సొసైటీ చైర్మన్ శ్రీ పరిగొండ కాంతారావు గారు “నైజాం విముక్త స్వాతంత్య్ర పోరాటం – గ్రంథాలయోద్యమంష అనే అంశంపై
ప్రసంగించనున్నారు. రెండవ సంగోష్ఠి అంశం “నైజాం విముక్త స్వాతంత్ర్య పోరాటం – సంస్కృతి, సాహిత్యోద్యమం”. సభాధ్యక్షులుగా చైతన్య డీమ్డ్ టు బి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఆచార్య దామోదర్ గారు, వక్త జాతీయ సాహిత్య పరిషత్ అధ్యక్షులు, ఆచార్య కసిరెడ్డి వెంకట రెడ్డి గారు పాల్గొననున్నారు.
మూడవ సంగోష్ఠిలో నైజాం విముక్త స్వాతంత్య్ర పోరాటం-పత్రికల పాత్ర అనే అంశంపై జాగృతి వారపత్రిక సంపాదకులు డా॥ గోపరాజు నారాయణ రావు గారు ప్రసంగించనున్నారు. సభాధ్యక్షులు ఎడిషన్ ఇంచార్జి, ఆంధ్రజ్యోతి దినపత్రిక శ్రీ శంకర రావు శంకేసి గారు వ్యవహరించనున్నారు. నాలుగవ సంగోష్ఠి అంశం “కాకతీయులు – ఆలయాలు” సభాధ్యక్షులు సమగ్ర శిక్ష జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయం సి.యం. ఓ & ఐ.ఇ. కో-ఆర్డినేటర్, శ్రీమతి బోయినపల్లి రాధ గారు, వక్తగా కాకతీయ విశ్వవిద్యాలయం ఫ్యాకల్టీ ఆఫ్ సోషల్ సైన్సెస్ చరిత్ర విభాగము డీన్ ఆచార్య కొక్కొండ విజయబాబు గారు ప్రసంగించనున్నారు.
ఐదవ సంగోష్ఠిలోకాకతీయ సామ్రాజ్యంపై ముస్లింల దండయాత్ర- తదనంతర పరిస్థితులు అనే అంశంపై జరిగింది. సభాధ్యక్షులుగా ప్రధాన కార్యదర్శి, సహృదయ సాహిత్య సాంస్కృతిక సంస్థ డా॥ ఎన్.వి.ఎన్. చారి గారు, వక్త ప్రముఖ జర్నలిస్ట్, శ్రీ రాకా సుధాకర్ రావు గారు పాల్గొననున్నారు.
ముగింపు సమావేశానికి సభాధ్యక్షులు నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గణిత శాస్త్ర ఆచార్యులు జె.వి. రమణమూర్తి, వక్త తెలుగు విభాగము విశ్రాంతాచార్యులు, కాకతీయ విశ్వవిద్యాలయం ఆచార్య కోవెల సుప్రసన్నాచార్య గారు ప్రసంగించనున్నారు.