భారతీయ సంస్కృతి గొప్పదనం కళలు, ఆధ్యాత్మికత, వాస్తు, శిల్పానికి మాత్రమే పరిమితం కాదు. మంచి ఆహార సంస్కృతిని మనదేశం కలిగి ఉంది. మన పూర్వీకులు దీనిపై అనేక రకాలైన ఆలోచనలు చేశారు. భారతీయ పాకశాస్త్రం వేల సంవత్సరాల క్రితం నుంచీ ఉంది. ఆహారానికి శరీరంతో మాత్రమే కాదు మనస్సుతో సంబంధం కలిగి ఉందని మన పాకశాస్రం బోధిస్తుంది. ఇలాంటి ప్రస్తావన గ్రీకు, ఈజిప్టియన్ లేదా చైనా లాంటి నాగరికతల్లో ఈ విషయం గురించి ఎక్కడా కనిపించదు.
భగవద్గీత పుస్తకం కనీసం 5,000-6,000 సంవత్సరాల నాటిదని అంచనా. పాశ్చాత్య పండితుల అంచనాల ప్రకారం చూస్తే, గీత కనీసం 3,500-4,000 సంవత్సరాల క్రితం వ్రాయబడిందని ఖచ్చితంగా చెప్పవచ్చు. అందులోని 17వ అధ్యాయం లోని 8, 9 మరియు 10 శ్లోకాలు మన జీవితంలో మన ఆహారం కారణంగా కనిపించే ఫలితాలను వివరిస్తాయి. మూడు రకాల స్వభావాలు కలిగిన వ్యక్తులు- సాత్విక, రాజసిక, తామసిక ఉంటారనీ, వ్యక్తులు తీసుకునే ఆహారాల ప్రకారం వారి మానసిక వైఖరిని నిర్ధారించవచ్చని చెబుతోంది. ఇక ఎనిమిదవ శ్లోకంలో
ఆయు: సత్త్వబలారోగ్య సుఖ ప్రీతి వివర్ధనా:
రస్యా: స్నిగ్దా: స్థిరా హఈద్యా ఆహారా: సాత్త్వికప్రియా
పై శ్లోకంలో ఆహారములు ఆయు: సత్త్వ అంటే ఆయుష్షును పెంచేవి అని చెప్పబడ్డాయి. అవి మంచి ఆరోగ్యాన్ని, సద్గుణాన్ని, ఆనందాన్ని సంతుష్టిని కలుగజేస్తాయి.
శాఖాహార భోజనము ఆధ్యాత్మిక జీవనానికి అనుగుణముగా సత్త్వ గుణము పెంపొందించుకోవటానికి వీలుగా ఉంటుంది. ఎంతోమంది సాత్త్విక (సత్త్వ గుణ ప్రధానముగా ఉన్నవారు) మేధావులు, తత్త్వవేత్తలు ఈ భావాన్నే వ్యక్తీకరించారు.
సాత్విక దృక్పథం ఉన్నవారు ఆయుష్షును, బుద్ధిని, బలాన్ని, ఆరోగ్యాన్ని, ఆనందాన్ని పెంచే, రుచికరంగా, మనసుకు ఆహ్లాదకరంగా కనిపించే ఆహారాన్ని తినడానికి ఇష్టపడతారు.…
14వ అధ్యాయము, 6వ శ్లోకములో, శ్రీ కృష్ణుడు సత్త్వ గుణము స్వచ్ఛమైనది, తేజోవంతమయినది, ప్రశాంతమైనది అనీ, ఒకలాంటి సంతోషాన్ని తృప్తిని కలుగచేస్తుంది అని చెప్పి ఉన్నాడు. సత్త్వ గుణ ఆహారము కూడా ఇదే విధమైన ప్రభావము కలిగి ఉంటుంది.
ప్రపంచంలోనే పరిపూర్ణమైన, శాస్త్రీయమైన, ప్రాచీన ఆహార సంస్కృతి కలిగిన ఏకైక దేశం మనది. వేదాలలో కూడా ఈ విషయం గురించి చెప్పబడింది. రుగ్వేదంలో కూడా ఈ విషయం చెప్పబడింది. యజస్వ తత్వం తత్వం అంటే శరీరాన్ని గౌరవించండి.. దాన్ని కాపాడుకోండి అని. ఇక అథర్వణ వేదంలోని ఆరవ అధ్యాయంలో కూడా ఎలాంటి ఆహారం తీసుకోవాలన్న విషయం రాసి ఉంది.
మెహెర్గఢ్, హరప్పా ఇంకా మొహెంజొదారోలలో జరిపిన త్రవ్వకాల్లో ఇటువంటి వాదనలను ధృవీకరించే అనేక ఆధారాలు కనుగొనబడ్డాయి. దాదాపు 8,000 ఏళ్ల క్రితమే గోధుమలు, బార్లీ, పాలతో తయారు చేసిన ఆహారం గురించి మన పూర్వీకులకు తెలుసునని వారు వెల్లడించారు. ఇంకా ఆసక్తికరంమైన విషయం ఏంటంటే, మన భారతీయ వంటకాలు గత కొన్ని వేల సంవత్సరాల నుండి దాల్చినచెక్క మరియు నల్ల మిరియాలను ఉపయోగిస్తున్నాము…….
మెహర్‌ఘర్ అనేది ప్రస్తుత పాకిస్తాన్‌లోని బలూచిస్థాన్‌లోని ఒక చిన్న గ్రామం. ఫ్రెంచ్ పురావస్తు శాస్త్రవేత్త జీన్-ఫ్రాంకోయిస్ జారిగే 1974లో ఇక్కడ త్రవ్వకాలు ప్రారంభించాడు మరియు 7,000 సంవత్సరాల పురాతన గ్రామ అవశేషాలను కనుగొన్నాడు. ఆ తవ్వకాలలో ప్రపంచంలోని పురాతన వ్యవసాయ విధానం ఆధారాలు కనుగొనబడ్డాయి. వాస్తవానికి, భారత ఉపఖండంలో వ్యవసాయం అనే భావన మొదట ప్రవేశపెట్టబడిందని ఈ రోజు అందుబాటులో ఉన్న ఆధారాల ఆధారంగా సులభంగా చెప్పవచ్చు.
వివిధ రకాల పప్పుధాన్యాల సాగు, కాయగూరలు పండించడం, గోధుమలు దంచడంలాంటివి, గోధుమల నుండి వివిధ వంటకాలను తయారు చేయడం-ఇవన్నీ దాదాపు 8,000-9,000 సంవత్సరాల కాలం నుంచీ మన భారతీయ వంటలో భాగమైపోయింది.
ప్రపంచ ఆహార సంస్కృతికి భారతదేశం చేసే అతిపెద్ద సహకారం ఏమిటి? సుగంధ ద్రవ్యాలు ఇవ్వడం! దాల్చిన చెక్క. నల్లమిరియాలు లాంటి ఎన్నో సుగంధ ద్రవ్యాలు మన ఆహారంలో భాగంగా ఉండేవి. వీటన్నీంటినీ కనీసం 2,000-3,000 సంవత్సరాల క్రితం భారతదేశం నుండి పెద్ద పరిమాణంలో ఎగుమతి చేయబడ్డాయి. దీనికి సంబంధించింన ఆధారాలు ఎన్నో ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి.
“5,060 సంవత్సరాల క్రితం, భారతదేశం ఎగుమతులు ఇటలీలోని జెనోవా మరియు వెనిస్ కు తరలివెళ్లాయి, ఈ రెండు నగరాలు సుగంధ ద్రవ్యాల వ్యాపారం కారణంగా ఆ సమయంలో ఐరోపాలోని అత్యంత ధనిక నగరాలుగా ప్రసిద్ది పొందాయి“……
బెరెనికే ప్రాజెక్ట్ తవ్విన సమయంలో, బెరెనికే ఓడరేవు వద్ద మూసివున్న పెట్టెలో ఎనిమిది కిలోల నల్ల మిరియాలు కనుగొనబడ్డాయి. ఆ AD 30-70 నాటిది అని నిర్ధారించారు. భారతదేశం నుండి సుగంధ ద్రవ్యాలు ఎగుమతి అయ్యాయి అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం.
ఇప్పుడు విభిన్న భౌగోళిక లక్షణాల ఆధారంగా భారతదేశంలో విభిన్న వంటకాలు వచ్చాయి. మన మసాలాదినులు వీటికి మరింత రుచిని కలిగించాయి. అందుకే భారతీయ వంటకాలు కొన్ని వేల సంవత్సరాల క్రితం విదేశీ ప్రయాణికులను ఆకర్షించాయి. అయితే, భారతీయ మసాలా దినుసులు ఎక్కువగా ఐరోపాలో మాంసం వండడానికి ఉపయోగించబడ్డాయి. పాశ్చాత్యులు శాకాహార వంటకాలను వండలేకపోయారు. దీనికి రెండు కారణాలు ఉన్నాయి- వాతావరణ అసమానతల కారణంగా అక్కడ మాంసాహారం ఎక్కువగా తినడం, రెండోది వారికి శాఖాహార వంటకాలలో వైవిధ్యం గురించి తెలియకపోవడం.
మన ఆహారాలలో చాలా వైవిధ్యత దాగి ఉంది. ఆంధ్ర, తమిళనాడు, కేరళ, కర్నాటక ఇలా దక్షిణ భారత వంటలలో విభిన్న ఆహారపదార్థాలు ప్రఖ్యాతి పొందినవి. దోస, వడ ఇలాంటి వంటకాలు మన దేశంలో దాదాపు రెండువేల సంవత్సరాల నుంచి తయారు చేయబడ్డాయి. అయితే ఇడ్లీ అనేది మనదేశంకి చెందినది కాదు ఇప్పుడు ఇండోనేషియాగా చెప్పబడే జావాసుమిత్రా దీవులలో భారతీయ రాజుల
.జావా-సుమత్రా (ఇండోనేషియా) దగ్గర ఉండే వంటవాళ్లు ఆవిరి ప్రక్రియ ద్వారా వాటిని తయారు చేశారు. ఇది అక్కడి నుంచి మనదేశానికి ఆ తర్వాత ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి పొందింది. ..క్రీ.శ.920లో బళ్లారి జిల్లాకు చెందిన శివకోటి ఆచార్య రచించిన వడ్డారాధనే అనే కన్నడ భాషా గ్రంథంలో ఇడ్లీల గురించిన ప్రధమ ప్రస్తావన ఉంటుంది.… అలాగే మనం వాడే కూర అంటే శాఖం అనే పదం తమిళంలోని కైకారి అనే పదం నుంచి వచ్చింది. దీనర్థం వివిధ మసాలా దినుసులతో వండిన కూరగాయలు..…
ప్రపంచంలోని చాలా ప్రాంతాల్లో భోజనం చేసేముందు ప్రార్థన చేసి తింటారు. అయితే భారతీయులు చెప్పే ప్రార్థనకు ఒక విశేషత దాగి ఉంది. మనం ఆహారాన్ని పరబ్రహ్మ స్వరూపంగా చూస్తాం.
ఓం అన్నపతే అన్నస్య నో దేహి అనమేవస్య సుశ్మిన:।
ప్ర ప్ర దాతారం తారిష్ ఊర్జం నో దేహి ద్విపదే చతుష్పదే.
&
ఓం బ్రహ్మార్పణం బ్రహ్మహవి: బ్రహ్మాగ్నౌ బ్రహ్మనావఈతం
బ్రహ్మైవతైవ గంతవ్యం బ్రహ్మకర్మసమాధినా
ఓం సహనావవతు సహనౌభునక్తు
సహవీర్యం కరవావహే తేజస్వినావధీతమస్తు మావిద్విషావహై:
ఓం శాంతి: శాంతి: శాంతి:
అంటూ శాంతిమంత్రాన్ని పఠిస్తూ భోజనాన్ని ప్రారంభిస్తాం. కేవలం అన్నం పరబ్రహ్మంగా భావించడమే కాదు, దాన్ని పండిచిన రైతు కూడా బాగుండాలని కోరుకునే సంస్కఈతి మనది. ఇది మనది అని అనుకుని గర్వపడడంలో తప్పులేదు.
భారతదేశం మొత్తం ప్రపంచానికి అత్యంత రుచికరమైన, పోషకమైన ఆహార సంస్కృతిని అందించింది. భారతీయ ఆహార సంస్కృతి ప్రపంచంలోని ప్రతి మూలకు వ్యాపించింది. కానీ మన ఆహారం చాలా దేశాల్లో అంత సులభంగా దొరకడంలేదు. చాలా చోట్ల చైనీస్, ఇటాలియన్, జపనీస్ రెస్టారెంట్ల ఆహారమే ప్రజాదరణ పొందింది. పిజ్జా, పాస్తాలాంటివి ఎక్కువగా అమ్ముడుపోతున్నాయి. వివిధ దేశాల్లో మనం మన ఆహారానికి సబంధించిన రెస్టారెంట్లను ఏర్పాటు చేయడంలో విఫలమవుతున్నాము. మనం కూడా వాటికి సరైన పోటీ ఇవ్వగలం. అందుకోసం మన దేశపు ఆహార సంస్కృతిని ప్రపంచానికి ప్రచారం చేయడం అవసరం!