
వరంగల్ సమీపంలోని గుండు చెరువు గుట్టపై కాకతీయులు నిర్మించిన రామాలయం, శ్రీ శంభు రామలింగేశ్వర దేవాలయాలున్నాయి. భక్తుల రద్దీ తక్కువగా ఉండటం గమనించిన కొందరు పాస్టర్లు ఏప్రిల్9న రెండు ఆలయాల్లో క్రైస్తవ ప్రార్ధనలు ఏర్పాటు చేశారు. ఏకంగా దేవాలయం మంటపంలోనే మైకులు, లౌడ్ స్పీకర్లు పెట్టుకుని క్రైస్తవ ప్రార్ధనలు నిర్వహించారు.
కాకతీయుల కాలం నాటి అతి పురాతన రామాలయం మండపంలో క్రైస్తవులు ప్రార్థనలు నిర్వహించడంపై వరంగల్ విశ్వహిందూ పరిషత్ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఘటన జరిగిన ప్రదేశానికి చేరుకున్న వీహెచ్ పి నాయకులు, స్థానిక మిల్స్ కాలనీ పోలీసులకు, వరంగల్ ఎండోమెంట్స్ శాఖ అసిస్టెంట్ కమీషనర్ కు ఫిర్యాదు చేశారు.