Home News హైదరాబాద్ విమోచన పోరాటంలో RSS పాత్ర

హైదరాబాద్ విమోచన పోరాటంలో RSS పాత్ర

0
SHARE

హైదరాబాద్ విమోచన ఉద్యమాన్ని కూలంకషంగా అధ్యయనం చేసిన సంఘ్ స్వయంసేవకుడు, న్యాయవాది, రచయిత శ్రీ భండారు సదాశివరావు డాక్టర్ హెడ్గేవార్ ఈ సందర్భంగా అన్న మాటల విషయంలో వివరణ ఇచ్చారు. “ఈ ఉద్యమం ఒకటి, రెండు సంస్థలకు పరిమితం కాకూడదు, ఇది హిందూ ప్రజా ఉద్యమంగా రూపు దిద్దుకోవాలి. స్వయంసేవకులు, సంఘ్ పేరిట అయినా సరే, సత్యాగ్రహంలో పాల్గొని ప్రజల్లో జాతీయతా చైతన్యం కలిగించేందుకు కృషి చేసేలా నేను చూస్తాను,” అన్నారు డాక్టర్ హెడ్గేవార్. .

“సత్యాగ్రహానికి మీరు ఎంత మందిని పంపుతారు?’ అని ఆర్య సమాజ్ నాయకులు ఆయనని అడిగారు. “మీకు ఎంత మంది కావాలి?” అని డాక్టర్ హెడ్గేవార్ బదులు ప్రశ్న వేశారు. అయిదు వందల మందిని పంపమని ఆర్య సమాజ్ నాయకులు చెప్పారు. “తప్పకుండా. వారు వచ్చి సత్యాగ్రహంలో పాల్గొంటారు,” అని డాక్టర్ హెడ్గేవార్ హామీ ఇచ్చారు. డాక్టర్ హెడ్గేవార్ మాటలు కార్యరూపం దాల్చాయి. విదర్భ, మరాఠ్వాడ, రాజస్థాన్, మధ్య భారత్, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన 2000 మందికి పైగా స్వయంసేవకులు బృందాలుగా ఆర్య సమాజ్ నేతృత్వంలో సత్యాగ్రహంలో పాల్గొన్నారు. వారిలో అనేకమంది జైలుకి వెళ్ళగా, ఇంకా ఎంతో మంది తీవ్రమైన కష్టాలను ఎదుర్కొన్నారు. కొంతమంది స్వాతంత్ర్యం, స్వేచ్చ కోసం ప్రాణాలర్పించి అమరులయ్యారు. డాక్టర్ హెడ్గేవార్ స్వయంగా భయ్యాజీ దానేకి వీడ్కోలు పలికారు. వామన్ హెడ్గేవార్ కూడా సత్యాగ్రహంలో పాల్గొన్నారు. రాజస్థాన్ నుంచి వచ్చిన ఆచార్య ధర్మేంద్ర సత్యాగ్రహం చేసి, జైలు పాలయ్యారు.

మూలం: నిజాం రూల్ అన్ మాస్క్ డ్, పీజీల సంఖ్య 72 &73