Home News సమాజంలోని అన్ని రంగాలలో మహిళల భాగస్వామ్యాన్ని పెంచేందుకు ఆర్‌.ఎస్‌.ఎస్ కృషి – మ‌న్మోహ‌న్ వైద్య జీ 

సమాజంలోని అన్ని రంగాలలో మహిళల భాగస్వామ్యాన్ని పెంచేందుకు ఆర్‌.ఎస్‌.ఎస్ కృషి – మ‌న్మోహ‌న్ వైద్య జీ 

0
SHARE
స‌మాజంలోని అన్ని రంగాలలో మహిళల భాగస్వామ్యాన్ని పెంచడానికి, వారి ప్రముఖ్య‌త‌ను నిల‌ప‌డానికి రాష్ట్రీయ స్వ‌యంసేవ‌క్ సంఘ్ (RSS), సంఘ ప్రేరేపిత సంస్థలు ప్రత్యేక ప్రయత్నాలు చేస్తున్నాయ‌ని ఈ విష‌యంపై ఆర్‌ఎస్‌ఎస్ సమన్వయ స‌మావేశాల్లో చ‌ర్చించిన‌ట్టుగా ఆర్‌ఎస్‌ఎస్ సహ- సర్ కార్య‌వాహ డాక్టర్ మన్మోహన్ వైద్య జీ తెలిపారు.

సెప్టెంబ‌ర్ 14 నుంచి 16 వ‌ర‌కు పూణెలో జ‌రిగిన ఆర్‌ఎస్‌ఎస్ సమన్వయ సమావేశాలు శ‌నివారం రోజున ముగిశాయి. మాన‌నీయ స‌ర్ సంఘ‌చాల‌క్ డాక్టర్ మోహన్ భాగవత్ జీ ప్రసంగంతో సమావేశం ముగిసింది. 36 వివిధ సంస్థలకు చెందిన మొత్తం 243 మంది ప్రతినిధులు ఈ సమావేశాల‌కు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆర్‌ఎస్‌ఎస్‌ అఖిల భారతీయ ప్రచార్‌ ప్రముఖ్‌ సునీల్‌ జీ అంబేకర్ తో క‌లిసి డాక్టర్ మన్మోహన్ వైద్య జీ  పాల్గొని మాట్లాడారు.

భారతీయ తత్వశాస్త్రం ప్రకారం కుటుంబం అనేది అతి చిన్న‌ది, ప్ర‌త్యేక‌మైన‌ద‌ని డాక్టర్ మన్మోహన్ వైద్య జీ అన్నారు. కుటుంబంలో మహిళల పాత్ర అత్యంత ప్రధానమైనద‌ని, కాబట్టి సమాజంలోని ప్రతి రంగంలోనూ మహిళలు ప్రముఖ పాత్ర పోషించాలన్నారు. సమాజంలో మహిళలు పెరుగుతున్న క్రియాశీలత అభినందనీయమని, ఆర్‌ఎస్‌ఎస్ శతాబ్ది ఉత్సవాల్లో మహిళలు భాగస్వామ్యమయ్యేలా చూడాలనే అంశంపై సమావేశంలో కూలంకషంగా చర్చించినట్లు తెలిపారు. అన్ని రంగాల‌లోని మహిళల మధ్య సంబంధాలను పెంపొందించేందుకు దేశవ్యాప్తంగా 411 సదస్సులు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. RSS ఇప్పటివరకు, 12 ప్రాంతాల్లో ఇటువంటి 73 సదస్సులను నిర్వహించింది, దీనికి 1.23 లక్షల మందికి పైగా మహిళలు పాల్గొనడంతో ఉత్సాహభరితమైన స్పందన లభించింద‌ని ఆయ‌న తెలిపారు.

ఆర్‌ఎస్‌ఎస్‌కు సంస్థ, విస్తరణ, పరిచయం, కార్యకలాపాలు అనే నాలుగు దశలు ఉన్నాయని పేర్కొంటూ, 97 సంవత్సరాల సంఘ ప్రయాణంలో, నాల్గవ దశ 2006లో శ్రీ గురూజీ జయంతి సందర్భంగా ప్రారంభమైంద‌ని, ఈ దశ దేశ పురోగమనానికి ప్రతి స్వయంసేవక్ ప్రతిజ్ఞాబ‌ద్ధులయ్యార‌ని ఆయ‌న అన్నారు. సమాజంలో నీతి, నిజాయితీని పాటించే వారిని సంఘటితం చేసి చైతన్యవంతం చేసేందుకు చేస్తున్న ప్రయత్నాలపై సమావేశంలో చర్చించార‌ని తెలిపారు.

సనాతన ధర్మం అంటే మతం కాదని, సనాతన నాగరికత ఆధ్యాత్మిక ప్రజాస్వామ్యం అని సనాతన‌ గురించి ప్రకటనలు చేసే వారు ముందుగా ఈ పదానికి అర్థం అర్థం చేసుకోవాల‌ని  సనాతన సంస్కృతిపై ఒక విలేక‌రి అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. భారతదేశం, భారత్‌పై చర్చ గురించి అడిగిన ప్రశ్నకు, ఈ దేశం పేరు భారత్ అని, భారత్ అనేది ప్రాచీన కాలం నుండి ప్రసిద్ధి చెందిన పేరు, భారత్ అనే పేరుకు నాగరికత విలువ ఉంద‌ని ఆయన అన్నారు.

సంఘ పని విస్తరణ

సంఘ పని విస్తరణ గురించి మన్మోహన్ జీ మాట్లాడుతూ సంఘ పనికి దేశవ్యాప్తంగా స్పందన పెరుగుతోందన్నారు. శాఖల సంఖ్య నిరంతరం పెరుగుతోందని,  కోవిడ్‌కు ముందు కాలంతో పోలిస్తే శాఖల సంఖ్యను దాటింద‌న్నారు. 2020లో శాఖలు 38,913 చోట్ల జరగ్గా, 2023లో 42,613 స్థానాల్లో జ‌రుగుతున్నాయ‌న్నారు. RSS పనిలో ఇది 9.5 శాతం వృద్ధి. సంఘ రోజువారీ శాఖల సంఖ్య 2020లో 62,491 ఉండ‌గా 2023లో సంఖ్య 68,651 పెరిగింద‌న్నారు. ఇందులో 60 శాతం విద్యార్థి శాఖ‌లు, కాగా  40 సంవత్సరాల వ‌య‌సున్న స్వయంసేవకుల‌తో న‌డిచే శాఖలు 30 శాతం ఉండగా, మిగిలిన పది శాతం శాఖలలో 40 ఏళ్లు పైబడిన స్వయంసేవకులు ఉన్నార‌ని తెలిపారు.  దాదాపు 1.25 లక్షల మంది స్వయంసేవకులు ప్రతి సంవత్సరం అధికారిక వెబ్‌సైట్ ద్వారా RSSలో చేరేందుకు తమ సుముఖత వ్యక్తం చేస్తున్నార‌ని, ఇందులో ఎక్కువ మంది 20 నుంచి 35 ఏళ్ల మధ్య వయసు వారున్నార‌ని మ‌న్మోహ‌న్ వైద్య జీ తెలిపారు.