Home News ఇస్రో ‘గ‌గ‌న్‌యాన్ టీవి డి1’ ప్ర‌యోగం విజ‌య‌వంతం

ఇస్రో ‘గ‌గ‌న్‌యాన్ టీవి డి1’ ప్ర‌యోగం విజ‌య‌వంతం

0
SHARE

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న గగన్ యాన్ మిషన్లో తొలి అడుగు పడింది. ఇస్రో తొలి పరీక్ష టెస్ట్ (డైహికిల్ అబార్ట్ మిషన్’ (టీవీ-డీ1) ప్రయోగం విజయవంతమైంది. శనివారం ఉదయం శ్రీహరికోట నుంచి నింగిలోకి రాకెట్ దూసుకెళ్లగా.. క్రూ మాడ్యూల్ పారాచూట్ ల సాయంతో కిందకు సురక్షితంగా ల్యాండ్ (సముద్రంలోకి) అయ్యింది. గగన్ యాన్ వ్యోమగాముల భద్రతకు సంబంధించి కీలకమైన ఈ సన్నాహాక ప్రయోగం సక్సెస్ కావడం పట్ల.. ఇస్రో శాస్త్రవేత్తలు సంతోషం వ్యక్తం చేశారు.

గగనాన్ టెస్ట్ లాంచ్ విజయవంతం అయ్యిందని ఇస్రో చైర్మన్ సోమనాథ్ ప్రకటించారు. టీవీ-డీ1 మిషన్ ను విజయవంతంగా పరీక్షించామ‌ని, వ్యోమగాముల భద్రతకు సంబంధించిన వ్యవస్థ సమర్థతను దీని ద్వారా విశ్లేషించగలిగామ‌ని, తొలుత సాంకేతిక లోపం రాగానే వెంటనే గుర్తించాం. దాని సరిచేసి మళ్లీ ప్రయోగించిన‌ట్టు, పారాచ్యూట్ లు సమయానికి తెరుచుకున్నాయ‌ని, క్రూ మాడ్యూల్ సురక్షితంగా బంగాళాఖాతంలో దిగింది అని ఆయ‌న వెల్లడించారు.

గగనయాను ముందు ఇస్రో నాలుగు పరీక్షలు నిర్వహించాలనుకుంది. అందులో టెస్ట్ వెహికిల్ అవార్డ్ మిషన్(టీవీ- డీ1) మొదటిది, 2018లో ఇలాంటి పరీక్ష నిర్వహించినప్పటికీ అది పరిమితస్థాయిలోనే జరిగింది. ఈసారి దాదాపుగా పూర్తిస్థాయిలో సిద్ధమైన వ్యోమనౌకను పరీక్షిస్తున్నారు. దీని ఫలితాల ఆధారంగా ఇస్రో తదుపరి పరీక్షలకు సిద్ధమవుతుంది. ఇందులో క్రూవ్యోమగాముల) ఎస్కేప్ సిస్టమ్ సమర్థత, క్రూ మాడ్యూల్ పనితీరు, వ్యోమనౌకను క్షేమంగా కిందకి తెచ్చే డిసలరేషన్ వ్యవస్థ పటిష్టతను పరిశీలిస్తుంది. అలాగే సాగర జలాల్లో పడే మాడ్యూల్ను సేకరించి, తీరానికి చేర్చే కసరత్తును పరీక్షిస్తుంది.

గ‌గ‌న్‌యాన్ లో ముగ్గురు వ్యోమగాముల్ని 400 కిలోమీటర్ల ఎత్తులోని కక్ష్యలోకి పంపాలన్నది ఇస్రో లక్ష్యం. మూడు రోజుల తర్వాత వారిని భూమికి రప్పిస్తుంది. 2025లో ఈ యాత్ర జరిగే అవకాశం ఉంది. ఆ దిశగా కొన్ని కీలక పరిజ్ఞానాలపై కొన్నేళ్లుగా ఇస్రో కసరత్తు చేస్తోంది.

రాకెట్ నింగిలోకి బయల్దేరాక‌, ఇస్రో శాస్త్రవేత్తలు ‘అబార్ట్’ సంగీతాన్ని పంపారు. దీంతో రాకెట్ పైభాగంలో క్రూ ఎస్కేప్ వ్యవస్థకు సంబంధించిన ఘన ఇంధన మోటార్లు ప్రజ్వరిల్లాయి. దాదాపు 12 కిలోమీటర్ల ఎత్తులో.. క్రూ ఎస్కేప్ వ్యవస్థను రాకెట్ నుంచి వేరు చేశాయి. 17 కిలోమీటర్ల ఎత్తులో క్రూ ఎస్కేప్ మాడ్యూల్, క్రూ మాడ్యూల్ పరస్పరం విడిపోయాయి. ఆ తర్వాత డ్రోగ్ పారాచూట్లు విచ్చుకున్నాయి. సెకనుకు 8.5 మీటర్ల వేగంతో క్రూ మాడ్యూల్.. సురక్షితంగా బంగాళాఖాతంలో దిగింది. సింగిల్ స్టేజ్ (ఒకే దశతో) ప్రయోగాన్ని.. 531.8 న్లలో 18.85 నిమిషాల్లో పూర్తి చేశారు.