
తెలంగాణకు మాత్రమే ప్రత్యేకమయిన పండుగ. తెలంగాణ సాంస్క ృతిక ప్రతీక బతుకమ్మ. ఈ పండుగని ఆశ్వయుజ మాస శుద్ధ పాడ్యమి నుండి తొమ్మిది రోజుల పాటు జరుపుకుంటారు. బతుకమ్మ పండుగ శరత్ ఋతువు ఆగమనానికి సూచకం. మొదటి రోజును ఎంగిపూల బతుకమ్మ అని, చివరిరోజును సద్దులబతుకమ్మఅని అంటారు.