Home News లక్షద్వీప్ భారత్‌లో ఎలా భాగమైంది?

లక్షద్వీప్ భారత్‌లో ఎలా భాగమైంది?

0
SHARE

1947 ఆగస్టులో భారత్, పాకిస్తాన్ విడిపోయినప్పుడు, 500 కంటే ఎక్కువ సంస్థానాలను ఏకం చేయడంలో అప్పటి భారత హోం మంత్రి, ఉప ప్రధానమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ ముఖ్యమైన పాత్ర పోషించారన్న విషయం తెలిసిందే.

ఆ సమయంలో పాక్ ప్రధాని లియాఖత్ అలీ ఖాన్ పంజాబ్, సింధ్, బెంగాల్, హజారాలను తమ దేశంలో విలీనం చేసేందుకు సాయశక్తులా ప్రయత్నించారు. ఇలా ఇరుదేశాలు స్వాతంత్రం తరువాత ప్రధాన భూభాగాలను తమ దేశాల్లో కలుపుకోవడంలో నిమగ్నమయ్యాయి. అయితే.. లక్షద్వీప్‌ను ఎవరూ పట్టించుకోలేదు. కట్ చేస్తే.. భారత్ ఇంకా దానిని క్లెయిమ్ చేయకపోవడం, ముస్లింలు ఎక్కువగా ఉండటంతో.. లక్షద్వీప్‌ని నియంత్రించాలని ఆగస్టు నెలాఖారులో లియాఖత్ అలీ భావించారు. వెంటనే తమ యుద్ధనౌకను అక్కడికి పంపించారు..

అదే సమయంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ కూడా ఆర్కాట్ రామస్వామి ముదలియార్, ఆర్కాట్ లక్ష్మణస్వామి ముదలియార్‌లను వెంటనే సైన్యంతో లక్షద్వీప్ వైపు వెళ్లాలని ఆదేశించారు. ఆ ప్రాంతాన్ని వీలైనంత త్వరగా స్వాధీనం చేసుకొని, భారతీయ జాతీయ జెండాను ఎగురవేయాలని ఆయన ఆదేశించారు..

ఇలా భారత్, పాక్ సైన్యాలు లక్షద్వీప్ వైపు బయలుదేరాయి. చివరికి.. భారత సైన్యం ముందుగా లక్షద్వీప్‌కు చేరుకుని, త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసింది. కాసేపయ్యాక అక్కడికి చేరుకున్న పాకిస్థాన్ యుద్ధ నౌక.. భారతదేశపు త్రివర్ణ పతాకాన్ని చూసి, అక్కడి నుంచి వెనక్కు వెళ్లిపోయింది. ఇక అప్పటి నుంచి లక్షద్వీప్ మన భారతదేశంలో అంతర్భాగం అయ్యింది. ఒకవేళ మన సైన్యం అరగంట ఆలస్యమై ఉంటే.. పరిస్థితులు మరోలా ఉండేవి. నెహ్రూ నిర్ణయం కోసం సర్దార్ పటేల్ వేచి చూడకుండా త్వరితంగా తీసుకున్న నిర్ణయంతో ఈరోజు లక్షద్వీప్ భారత్‌లో భాగంగా ఉంది. లేకపోతే పక్కలో బల్లెం అయ్యి ఉండేది.

– పెంజర్ల మహేందర్ రెడ్డి