Home News ఇస్లాంలోకి మారి అభివృద్ధికి దూర‌మైన మాల్దీవులు

ఇస్లాంలోకి మారి అభివృద్ధికి దూర‌మైన మాల్దీవులు

0
SHARE

మాల్దీవులు అనే దేశం.. 1192 ద్వీపాలతో కూడిన ఒక‌ దేశం. ఇది భారతదేశానికి దక్షిణాన 750 కిలోమీటర్ల దూరంలో హిందూ మహాసముద్రంలో ఉంది. మాల్దీవులు అనే పేరు మాల, ద్వీప్ (మాల రూపంలో ఉండే ద్వీపం) అనే సంస్కృతం నుండి వచ్చింది. క్రీ.పూ 500 సమయంలో రాజస్థానీయులు, గుజరాతీలు మాల్దీవులు, శ్రీలంక చేరుకున్న తొలి స్థిరనివాసులు. దీని భాష ధివేహి సంస్కృతానికి చెందినది. కానీ ఇప్పుడు వారు అరబిక్ లిపిని అనుస‌రిస్తున్నారు. వారు తమతో హిందూ మతాన్ని తీసుకువచ్చారు. వెంటనే ద్వీపాల‌న్నీ దేవాలయాలతో నిండిపోయాయి. క్రీ.పూ 250 సమయంలో అశోకుడు తన వారితో బౌద్ధమతాన్ని ద్వీపాలకు ప‌రిచ‌యం చేశాడు. ఆ త‌ర్వాత ఇది 12వ శతాబ్దం వరకు ఆధిపత్య మతంగా కొనసాగింది. తరువాత అరబ్ వ్యాపారులు వచ్చారు. ఆగ్నేయాసియాతో పాటు, మాల్దీవులు కూడా భారతదేశ ప్రభావ పరిధి త‌గ్గింది. అరబ్ సముద్ర వ్యాపారులు ఇండోనేషియాకు మధ్యలో ఉన్నందున మాల్దీవుల స్థానాన్ని అనువైనదిగా గుర్తించారు. వారు త్వరలోనే స్థిరపడటం ప్రారంభించారు. మ‌తాంత‌ర వివాహాలు జ‌రిగాయి. తక్కువ సమయంలోనే ముస్లిం జనాభాలో గణనీయంగా పెరిగింది. 1153లో, బౌద్ధ రాజు ధోవేమి కలమింజ (త్రిబువన అదితియా) ఇస్లాం మతంలోకి మారి త‌న పేరును ముహమ్మద్ అల్-ఆదిల్ అబ్దుల్లా గా మార్చుకున్న‌పుడు ఇస్లాం ప్ర‌భావం చాలా పెరిగిపోయింది.

ప్రజలు మతం మారిన తరువాత, ఇతర చోట్ల జరిగినట్లుగా బౌద్ధ, హిందూ దేవాలయాలు, విగ్రహాలు ధ్వంసం చేయబడ్డాయి.16వ శతాబ్దం తరువాత, పోర్చుగీస్, డచ్, బ్రిటీష్ ద్వీపాలపై చాలా ప్రభావం చూపారు. 1953లో స్వాతంత్ర్యం పొందారు.

ఇతర ఇస్లామిక్ దేశాల వలె, ఈ దేశానికి కూడా స‌రైన ప్రజాస్వామిక వ్య‌వ‌స్థ లేదు. తరచుగా హింసకు లోనవుతుంది. ఈ ద్వీపాలపై భారతదేశం కొంత ప్రభావాన్ని చూపడం వ‌ల్ల ఈ దేశం కొంత ప్ర‌యోజ‌నం పొంద‌గ‌లుగుతుంది. ద్వీపసమూహం అయిన ఈ దేశం మొత్తం జ‌నాభా భార‌తదేశంలోని ఒక ప్రధాన నగరంలో ఒక చిన్న ప్రాంతంలో వ‌ల కేవలం 5-6 లక్షల జనాభా మాత్రమే ఉండ‌వ‌చ్చు.