రామభక్త జిల్లా కలెక్టర్ కె.కె.నాయర్
అయోధ్యలోనున్న శ్రీరామ జన్మభూమి ఉద్యమాన్ని ముగింపు దశ వరకు చేర్చుటలో బహుమూల్యమైన పాత్ర ఎందరిదో ఉండింది. అందులో అయోధ్య జిల్లా కలెక్టర్ శ్రీ కె.కె.నాయర్ (కాన్దన్ గలాథిల్ కరుణాకరణ్ నాయర్) గారి పేరు ఎంతో ప్రముఖమైనది. వారు 11 సెప్టెంబర్ 1907న కేరళలోని అలపుఝా జిల్లాలోని కుదృలాద గ్రామంలో జన్మించారు. మద్రాసు విశ్వవిద్యాలయం నుండి విద్యాభ్యాసం పూర్తి చేసి కేవలం 21వ ప్రాయంలోనే ఐ.సి.ఎస్ గా ఎంపికయ్యారు. ఉత్తర ప్రదేశ్ లో అనేక జిల్లాల్లో కార్యరంగంలో ఉంటూ వారు 1949 ఫైజాబాద్ జిల్లాధికారిగా నియమితులయ్యారు. శ్రీ నాయర్ గారు అపార రామభక్తులు. శ్రీరామజన్మభూమి ఒక కట్టడం బూరుజు (బాబరి కట్టడం)లో ఉండటం వారికి తీవ్ర మనోవేదనకు గురిచేసింది. వారు తన సహచర జిల్లాధికారి శ్రీ గురుదత్త సింగ్ తో నిశితంగా పరిశీలించి నివేదికను రిపోర్ట్ సిద్ధపర్చచాల్సిందిగా ఆదేశించారు. అయోధ్యవాసులు అక్కడ భవ్యమైన రామమందిర నిర్మాణం చేయాలనుకుంటున్నారని, ప్రభుత్వాధీనంలో ఉండుడం వల్ల భూమినిగైకొనడంలో ఎటువంటి ఆటంకం కాబోదనుకుంటున్నారని తెలుసుకున్నారు. ఈ తరుణంలోనే 1949, డిసెంబర్ 22-23 రాత్రి హిందూవుల ఒక బృందం అక్కడ శ్రీరామలలా విగ్రహాలను స్థాపింపజేసేసారు. కొందరి వాదనేమిటంటే శ్రీ నాయర్ గారి సంకేతాలతోనే జరిగిందనుకుంటుంటారు. ఏదైతేనేమి, కానీ రాత్రిలోనే శ్రీరామలలా దివ్య విగ్రహాలు వెలిసాయనే వార్త అక్కడంతా వ్యాపించిపోయింది. వేలాదిమంది అక్కడ చేరి ఆడుతు-పాడుతు భజన సంకీర్తనలు చేయ సాగిరి.
ఆ సమయంలో జవాహర్ లాల్ నెహ్రు దేశ ప్రధానిగా ఉన్నారు. వారు స్వభావికంగానే హిందూ విరోధి, వారు ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి గోవింద్ వల్లభ్ పంత్ తో విగ్రహాలను అక్కడినుండి తొలగించాలని ఆదేశించారు. కానీ శ్రీ నాయర్ గారు అలాగైతే అక్కడ గొడవలైపోతాయని స్పష్టం చేశారు. నెహ్రూ పంతం పట్టేసరికి నాయర్ గారు అయితే ముందు నన్నిక్కడ నుండి పంపించేయండి, ఆ తర్వాత మీరనుకున్నది చేసుకొండని ఖరాఖండిగా తెలిపారు. అప్పుడు ముఖ్యమంత్రి గారు వారిని ప్రశాసనిక సేవలనుండి నిష్క్రమింపజేసేసారు. కానీ తన పదవి వదిలిపెట్టబోయేముందే వారు తగిన విధంగా ఏర్పాటులు చేసి అక్కడ నిత్య పూజాలు జరుగుతుండేట్లు వ్యవస్థ చేయగలిగారు. అన్ని అంశాలను కూడా ముందుగానే జాగ్రత్తగా సువ్యవస్థితంగా వ్రాయించిపెట్టారు. తద్వారా రానున్నరోజులల్లో ఈ వాదప్రతి వాదనలలో వారి లిఖిత ఆధారమే అంతిమ సత్యాంగా విజయం లభించినట్టైంది. ఆ తర్వాత నాయర్ గారు న్యాయస్థానానికి వెళ్లి సవాలు చేసి విజయం సాధించారు. దానితో నెహ్రూ రక్తబిందువులు త్రాగినట్టుగా అభాసుపాలైనారు. ఈ ప్రభుత్వం తనను ఏదో సాకుతో ఇబ్బందులకు గురి చేస్తునే ఉంటుందనుకుని 1952లో ప్రశాసనిక సేవాల నుండి నాయర్ గారు రాజీనామా చేసి, ప్రయాగరాజ్ లోని ఉన్నత న్యాయస్థానంలో న్యాయవాద వృత్తి చేపట్టారు. కానీ రామమందిర ఉద్యమంతో అయోధ్య, అక్కడి హిందూబంధువులు వారిని తమందరి మన్ననలుపొందిన నాయకుడుగా భావించేవారు. అందరు వారిని నాయర్ సాహబ్ అని సంబోదించేవారు. అందరు వారిని రామమందిర ఉద్యమం న్యాయాలయాలతో పాటు పార్లమెంటులో కూడా వాదించుటకు రాజకీయాలలో రావలసిందిగా ఒత్తిడి జేసేవారు. అందరి ఒత్తిడిమేరకు శ్రీ నాయర్ గారు సకుటుంబసమేతంగా హిందూ హితైషిగల భారతీయ జన సంఘ్ సభ్యత్వం తీసుకున్నారు. ముందు వారి సతిమణి శ్రీమతి శకుంతలా నాయర్ గారు ఎన్నికలలో పోటిచేసి ఉత్తర ప్రదేశ్ శాసన సభా సభ్యురాలిగా ఎన్నికయ్యారు. 1962లో శ్రీ నాయర్ గారు బహరాయిచ్ నుండి శ్రీమతి నాయర్ గారు కైసరగంజ్ నుండి లోకసభకు ఎన్నికయ్యారు. నాయర్ సాహబ్ గారి పేరు ప్రఖ్యాలుతోనే వారి కార్ డ్రైవర్ సైతం ఉత్తర ప్రదేశ్ శాసనసభ సభ్యులుగా ఎన్నుకయ్యారు. వారి సతిమణి మూడు పర్యాయాలు కైసరగంజ్ నుండి పార్లమెంటు సభ్యురాలిగా ప్రాతినిధిత్వం వహించారు. ఎమర్జేన్సీ కాలంలో వారిద్దరూ ఇందిరాగాంధి ఆగ్రాహానికి గురై జైలుకి వెళ్లారు. 7 సెప్టెంబర్, 1977 లో లక్నో లో శ్రీ నాయర్ గారు దివంగతులయ్యారు. శ్రీ నాయర్ గారు కేరళకి చెందిన వారైనప్పటికీ అక్కడ కమ్యూనిజం, కాంగ్రేస్ ప్రభుత్వాల ఆగాడాలవలన తగిన గుర్తింపు కాని ఆదరణకాని లభించలేదు. ఇప్పుడిక విశ్వహిందూ పరిషత్ ప్రయత్నాల వలన అక్కడ కె.కె.నాయర్ స్మృతి ట్రస్ట్ ఏర్పాటు చేసి వారి జన్మస్థలంమైన స్వగ్రామంలో ఒక భవనం నిర్మించబడుతున్నది. అక్కడా సేవా కార్యక్రమాలతోపాటు ప్రశాసనిక సేవలలో ఔత్సాహికులకు కూడా శిక్షణ ఇస్తున్నారు. శ్రీరామ మందిరం కొరకు లక్షల మంది తమ ప్రాణాలను ఆహుతినిచ్చారు. అయినా కె.కె.నాయర్ గారి కార్య పద్దతి వేరే విధంగా ఉన్నది. అయినప్పటికి వారు నిత్యం అవిస్మరణీయులే.