Home Ayodhya అయోధ్య‌లో ప్రాణ‌ప్ర‌తిష్ఠ… కందకుర్తిలో రామోత్సవం

అయోధ్య‌లో ప్రాణ‌ప్ర‌తిష్ఠ… కందకుర్తిలో రామోత్సవం

0
SHARE

500 ఏళ్ల సుదీర్ఘ పోరాటం తర్వాత అయోధ్యలోని భవ్య రామ మందిరంలో బాల రాముడి ప్రాణ‌ప్ర‌తిష్ట సంద‌ర్భంగా ఆర్‌.ఎస్‌.ఎస్ వ్య‌వ‌స్థాప‌కులు డాక్ట‌ర్ హెడ్గెవ‌ర్ గారి పూర్వీకుల గ్రామ‌మైన కంద‌కుర్తిలో రామోత్స‌వం ఘ‌నంగా జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి ఆర్‌.ఎస్‌.ఎస్ తెలంగాణ ప్రాంత సేవా భారతి ప్రాంత సంఘటన కార్యదర్శి శ్రీ వాసు గారు హ‌జ‌రయ్యారు. ఈ సంద‌ర్భంగా వారు మాట్లాడుతూ అయోధ్య‌లో రామ మందిర నిర్మాణం చేసుకోవడం ఎంతో శుభదినం, ఆనందదాయక‌మ‌ని, ఇక జరగవలసింది రామరాజ్యం కావాలి అందుకుగాను ప్రతి హిందువు ధర్మాన్ని ఆచరణగా చేసుకొని దేశానికి ప్రాధాన్యత ఇస్తూ మానవీయ విలువలకు, కుటుంబ జీవన వ్యవస్థను బలోపేతం చేసుకోవలసిన అవశ్యకత ఎంతైనా ఉంద‌ని అన్నారు. రామరాజ్యమే హిందూ రాజ్యం నిర్మాణం హిందూ రాజ నిర్మాణమే ప్రపంచశాంతికి మూలాధారం అని ఆయ‌న అన్నారు. కందకుర్తి పౌరాణికంగా చారిత్రాత్మకంగా ఎంతో ప్రసిద్ధి గాంచిన ప్రదేశమని ఇక్కడ సాక్షాత్తు శ్రీరామచంద్రుడు నడియాడిన భూమి అని ఈ భూమిలో శివాజీ మహారాజ్ అహల్యాబాయ్ హోల్కర్ విచ్చేసిన పుణ్యభూమి అని కొనియాడారు. వంద సంవత్సరాల క్రితం హిందూ హిందువుగా చెప్పుకోటానికి సిగ్గుపడిన రోజు నుండి ఈ రోజు ప్రపంచమంతా హిందువుగా గర్విస్తున్నామ‌ని చెప్పుకోవ‌డానికి కారణం కందకుర్తి అని అన్నారు. ఈ కంద‌కుర్తి పుణ్యభూమి మూలాల నుండి వచ్చిన డా. హెడ్గెవార్ గారు ఆర్ఎస్ఎస్ కు ప్రాణం చేసిన కారణంగా ఇంతటి హిందూ జాగరణ జరిగిందన్నారు.

అయోధ్య‌లో ప్రాణప్ర‌తిష్ట జ‌రుగుతున్న ఈ పుణ్య తిధి రోజు కందకుర్తి లోని సేవాబస్తి నుండి మాతృమూర్తులు హారతులతో వైభవపేతమైన శోభాయాత్రని నిర్వహిస్తూ గ్రామంలోని రామాలయానికి చేరుకున్నారు. ఈ శోభాయాత్రలో ఆబాల గోపాలమంతా కూడా ఉత్సాహంగా ఆనందంగా పాల్గొన్నారు. అయోధ్యలో భవ్యమైన రామ మందిరంలో బాల రాముని విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని ఆధ్యాత్మిక ఆనందంతో ప్రత్యక్ష ప్రసారాన్ని విక్షించారు. ఈ కార్యక్రమంలో బాల బాలికలచే సీతారామ లక్ష్మణ భరత శత్రుజ్ఞల వేషధారణ, సాంస్కృతిక కార్యక్రమాలు అత్యంత వైభవంగా జరిగాయి. అనంత‌రం భక్తులందరికీ అన్న ప్రసాద వితరణ జరిగింది. ఈ కార్యక్రమానికి కేశవ సేవా సమితి సభ్యులు శ్రీ దేవుళ్ళ గోవిందు గారు, సేవా భారతి, కేశవ సేవా సమితి సభ్యులైన శ్రీ మర్రి కృష్ణారెడ్డి గారు, శ్రీ సంజయ్ సంగ్వాయి గారు, శ్రీ బూర్ల రవీంద్ర గారు, గ్రామ ప్రముఖులు పాల్గొన్నారు.