Home Ayodhya భారత రాజ్యాంగ స్ఫూర్తితో అయోధ్య శ్రీ రామ మందిర నిర్మాణం

భారత రాజ్యాంగ స్ఫూర్తితో అయోధ్య శ్రీ రామ మందిర నిర్మాణం

0
SHARE

1950 జనవరి 26న మ‌న భార‌త రాజ్యాంగం అమలులోకి వచ్చింది. ఆ రోజున గ‌ణ‌తంత్ర దినోత్స‌వం జ‌రుపుకుంటాము. సుమారు వెయ్యి సంవత్సరాల విదేశీ పాలన అనంతరం ఒకే కేంద్ర ప్రభుత్వం క్రింద విశాల దేశంగా భారత దేశంగా అవతరించింది. ఆగస్టు 15న ఆంగ్లేయుల నుండి మనకు రాజకీయ స్వాతంత్య్రం లభించింది. ఆంగ్లేయ పాలకుల కుట్ర, ముస్లిం లీగ్ వేర్పాటు(హింసా) వాదం, కాంగ్రెస్ పాలకుల మోసం, హిందువులు కలసి లేకపోవడం వల్ల దేశం రెండు ముక్కలయింది. ఇది దురదృష్టకరం.

నేటి పరిస్థితులకు అనుగుణంగా మనదైన రాజ్యాంగం డా.బాబూ రాజేంద్ర ప్రసాద్ నేతృత్వంలో భారత రాజ్యాంగ సభ భారత రాజ్యాంగాన్ని రూపొందించుకుని, ఆమోదించింది. డా.బాబా సాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగ సభకు డ్రాఫ్ట్ చైర్మన్ గా వ్యవహరించారు. రాజ్యాంగ పద్దతులలోనే సమస్యల నివేదన

1) డా.బాబా సాహెబ్ అంబేద్కర్, “ప్రజలు రాజ్యాంగ బద్ధ విధానాలు ద్వారానే తమ సమస్యలను విన్నవించుకోవాల‌ని పిలుపునిచ్చారు. కానీ తుపాకీ ద్వారా రక్తపాత విప్లవం ద్వారా మార్పు కోసం నేటికీ నక్సలైట్లు పని చేయడం దురదృష్టకరం. పరిపాలకులు కూడా ప్రజల సమస్యలను మొదటి దశలోనే గుర్తించి సకాలంలో పరిష్కరించే చురుకుదనం చూపాలి. భారత రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా చట్ట సభలు చట్టాలు చేయాలి. చట్ట సభల్లో చేస్తున్న చట్టాలు రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా ఉన్నాయా లేదా అన్నది విష‌యాన్ని ఉన్నత న్యాయ స్థానాలు గ‌మ‌నించాల్సి ఉంది.

2) ఆత్యయిక స్థితి (Emergency) దుర్వినియోగం
రాజ్యాంగంలో ఉన్న “అత్యయిక పరిస్థితి” దుర్వినియోగం చేసి, తన అధికారాన్ని, పదవిని కాపాడుకోవడం కోసం ఆనాటి ప్రధాన మంత్రి శ్రీమతి ఇందిరా గాంధీ ఎమ‌ర్జెన్సీ ప్రకటించింది. ఆ చీకటి కాలంలో కొంత మంది ఉన్నత స్థాయి న్యాయమూర్తులు సైతం తమ పదవుల కోసం ఆ చీకటి పాలనను ఉన్నత న్యాయ స్థానంలో సమర్థించారు. అది చీకటి అధ్యాయం.

లౌకిక‌త్వానికి వక్ర భాష్యాలు
భారత రాజ్యాంగ సభలో ఉన్న పీఠిక (pre-amble) పై వారం రోజులు విస్తృత చర్చ జరిగింది. కొందరు సెక్యులర్, సోషలిస్టు పదాలను జోడించాలని సూచించారు. వారి సలహాలను డా.అంబేడ్కర్ తార్కింగా తిరస్కరించారు. 1975 అత్యాయిక పరిస్థితి చీకటి కాలంలో ప్రతిపక్ష నాయకులు జైలులో ఉన్న వేళ సమగ్ర చర్చ లేకుండానే భారత రాజ్యాంగ పీఠకలో సోషలిస్టు, సెక్యులరిస్ట్ పదాలను జోడించారు. నేటి వ్యవహారంలో సెక్యులరిజం అంటే మత సమ భావన కాదు. ధర్మ (మత) వ్యతిరేక, హిందూ వ్యతిరేక, మైనారిటీ మతాల సమర్థనగా చెలామణి అవుతున్నది. భారత దేశం ఆధ్యాత్మిక దేశం. దీనికి ఆధారం ధ‌ర్మం. ధర్మం అంటే మతం కాదు. కొన్ని విజాతీయ శక్తులు నిర్మించిన భ్రమల వల్ల మన దేశానికి, అయోధ్య సమస్య పరిష్కారానికి నష్టం ఏర్పడింది.

3) ఉన్నత న్యాయ వ్యవస్థకు భారత రాజ్యాంగానికి జేజేలు
భారత దేశపు ఆత్మకు ప్రతీక అయిన అయోధ్యలో శ్రీ రామ జన్మ భూమి కొరకు ఈ దేశ ప్రజలు 74 సాయుధ పోరాటాలు చేశారు. 1947 నుండి న్యాయ స్థానాలలో కేసులు నిరవధికంగా కొనసాగాయి. ప్రజా జాగరణ ఉద్యమాలు, కర సేవకుల బలిదానాలు వల్ల ప్రజల ఆగ్రహం వల్ల, ఎట్టకేలకు సుప్రీం కోర్టు రాజ్యాంగ ధర్మాసనం తీర్పు మేరకు బాల రాముని మందిర నిర్మాణం సుగమం అయింది. రామ మందిర నిర్మాణ పనులు చురుకుగా సాగి, 2024 జనవరి 22న బాల రాముని విగ్రహ ప్రతిష్ఠ అయోధ్యలో జరిగింది. 550 సంవత్సరాల క్లిష్ట సమస్యకు భారత రాజ్యాంగము ఆధారంగా భారత న్యాయ వ్యవస్థ ద్వారా సమస్య పరిష్కారం కావడం “భారత రాజ్యాంగానికి” భారత ఉన్నత న్యాయ వ్యవస్థకు ఒక గెలుపు. ఇదే స్ఫూర్తితో భవిష్యత్తులో మన భారత దేశాన్ని ఒక సుసంపన్నం దేశంగా తీర్చిదిద్దు కుందామని నేడు మన‌మంద‌ర‌మూ ప్రతిజ్ఞ చేద్దాం.

శ్యాం ప్రసాద్
(అఖిల భారతీయ సామాజిక సమరసత ప్రముఖ్)