భారతదేశంలో ప్రతి సంవత్సరం ఏప్రిల్ 5న జాతీయ సముద్రయాన దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఇది ప్రతి సంవత్సరం డిసెంబర్ 4న జరుపుకునే జాతీయ నేవీ దినోత్సవంలా కాక ప్రధానంగా పౌర షిప్పింగ్‌కు సంబంధించి జరుపుకునే వేడుక. ప్రపంచంలోని ఒక చోటు నుంచి మరొక చోటుకు సుదూర ప్రాంతలకు వస్తువులను రవాణా చేయడంలో అత్యంత చక్కటి వ్యవస్థీకృత, సురక్షిత మైన, బలమైన, పర్యావరణహితంగా ఖండాంతర వాణిజ్యం, ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు మద్దతు ఇవ్వడంలో అవగాహన కల్పించడానికి జాతీయ సముద్ర దినోత్సవం ప్రతి సంవత్సరం జరుపుకుంటారు. మొట్టమొదటిసారి 5 ఏప్రిల్, 1919న సింధియా స్టీమ్ నావిగేషన్ కంపెనీ వారి నౌక ‘ఎస్ ఎస్ లాయల్టీ’ ముంబై నుండి లండన్ వరకు జరిపిన ప్రయాణం జ్ఞాపకార్థం ఏప్రిల్ 5న జాతీయ సముద్రయాన దినోత్సవం జరుపుకుంటారు. ఈ సందర్భంగా 30 మార్చి నుండి 5 ఏప్రిల్ వరకు మర్చంట్ నేవీ వీక్‌గా భారత ప్రభుత్వ హోం వ్యవహారాలు & ఓడరేవుల మంత్రిత్వ శాఖలు ప్రకటించాయి.
జాతీయ సముద్రయాన దినోత్సవం:
1964 ఏప్రిల్ 5న తొలిసారిగా జాతీయ సముద్ర యాన దినోత్సవాన్ని జరుపుకున్నారు. భారత దేశానికి సంబంధించినంత వరకు మొట్టమొదటిసారి 5 ఏప్రిల్, l9I9న సింధియా స్టీమ్ నావిగేషన్ కంపెనీ వారి నౌక ‘ఎస్ ఎస్ లాయల్టీ’ ముంబై నుండి లండన్ వరకు జరిపిన ప్రయాణంతో భారత నౌకాయాన కథ ప్రారంభమైంది. ఈ రోజున భారత సముద్ర రంగానికి విశేష కృషి చేసిన వారికి వరుణ అనే పురస్కారాన్ని ప్రదానం చేస్తారు. 1919లో గుజరాత్‌కు చెందిన పలువురు భారతీయ పారిశ్రామిక వేత్తలు సింధియా స్టీమ్ నావిగేషన్ కంపెనీని స్థాపించగా ఇది భారత దేశపు మొట్టమొదటి భారీ-స్థాయి షిప్పింగ్ కంపెనీగా అవతరించింది. ఈ సంస్థ గ్వాలియర్ పాలకుడి నుండి గతంలో ఎంప్రెస్ ఆఫ్ ఇండియాగా పిలువబడే ఎస్ ఎస్ లాయల్టీని కొనుగోలు చేసింది. ఏప్రిల్ 5, 1919న, ఎస్ ఎస్ లాయల్టీ ముంబై నుండి లండన్‌కు చేసిన ప్రయా ణం భారతీయ షిప్పింగ్ చరిత్రలో ఒక మైలురాయి. ఈ ప్రతిష్టాత్మక సంఘటనను జరుపుకోవడానికి మరియు భారతదేశ షిప్పింగ్ పరిశ్రమను పునరుద్ధరించడంలో సహా యపడిన భారతీయ పారిశ్రామికవేత్తలను గౌరవించడానికి 1964లో జాతీయ సముద్రయాన దినోత్సవం స్థాపించ బడింది. జాతీయ సముద్రయాన దినోత్సవం సందర్భంగా జాతీయ సముద్ర పరిశ్రమను ప్రోత్సహించడం మరియు అభివృద్ధి చేయడంలో కృషి చేసిన నావికులు, వ్యక్తులు మరియు సంస్థలను గుర్తించి అవార్డులు, స్కాలర్‌షిప్స్, స త్కారాలు అందించడంతో పాటు వారికి మెరుగైన సౌక ర్యాలు కల్పించేందుకు కార్యాచరణ రూపొందిస్తుంది. జాతీయ 60వ సముద్రతీర దినోత్సవం సందర్భంగా సాగర్ సమ్మాన్ వరుణ అవార్డు, సాగర్ సమ్మాన్ అవార్డు ఫర్ ఎక్స్ లెన్స్, సాగర్ సమ్మాన్ అవార్డు ఫర్ గ్యాలంట్రీ, రికగ్నిషన్ ఆఫ్ అవుట్ స్టాండింగ్ మారిటైమ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్, రికగ్నిషన్ ఆఫ్ అవుట్ స్టాండింగ్ ఇండియన్ షిప్ ఓనింగ్ కంపెనీస్, రికగ్నిషన్ ఆఫ్ అవుట్ స్టాండింగ్ ఇండియన్ ఎంప్లాయర్ ఆఫ్ ఇండియన్ సీఫెరర్స్, రిక గ్నిషన్ ఆఫ్ అవుట్ స్టాండింగ్ ఫారిన్ ఎంప్లాయర్ ఆఫ్ ఇండియన్ సీఫెరర్స్, రికగ్నిషన్ ఆఫ్ అవుట్ స్టాండింగ్ ఇండియన్ పోర్ట్, రికగ్నిషన్ ఆఫ్ అవుట్ స్టాండింగ్ ఇండి యన్ టెర్మినల్ అవార్డులు ప్రదానం చేస్తారు.
భారతీయ నౌకాదళ చరిత్ర :
భారతీయ సముద్ర చరిత్ర దాదాపు వెయ్యేళ్ల క్రితం ప్రారంభమైంది. సింధు లోయలోని ప్రజలు 3వ సహస్రాబ్ది క్రీస్తు పూర్వమే మెసొపొటేమియాతో సముద్ర వాణిజ్యాన్ని ప్రారంభించారు. రోమన్ సామ్రాజ్యం ఈజిప్టును స్వాధీనం చేసుకున్న తరువాత, వారు రోమన్లతో కూడా వ్యాపారం చేయడం ప్రారంభించారు. పాశ్చాత్య ప్రపంచం భారత దేశం నుండి ప్రధానంగా సుగంధ ద్రవ్యాలు, ధూప ద్రవ్యాలు మరియు వస్త్రాలు దిగుమతి చేసుకునేది. వాణిజ్య నౌకాదళంతో పాటు, అనేకమంది భారతీయ పాలకులు తమ వాణిజ్య నౌకలను రక్షించుకోవడానికి ఒక విధమైన నౌకారక్షణదళాన్ని ఏర్పాటు చేసుకోవడంపై దృష్టి సారిం చారు. పోర్చుగల్ మరియు నెదర్లాండ్స్ నుండి మొదటి యూరోపియన్ నౌకలు భారతదేశానికి రావడం ప్రారం భించిన మధ్య యుగాల చివరిలో నౌకాదళాన్ని నిర్వహిం చాల్సిన అవసరం మరింత అత్యవసరమైంది. మరాఠా సామ్రాజ్య వ్యవష్టాపకుడు ఛత్రపతి శివాజీ నేతృత్వంలో ఏర్పాటైన కన్హోజీ ఆంగ్రే దళం భారత తీరంలో పోర్చుగీస్, డచ్ మరియు బ్రిటిష్ నావికా ప్రయోజనాలకు వ్యతిరేకం గా విజయవంతంగా పోరాడినట్లు మరియు మొఘల్ సామ్రాజ్యాన్ని యూరప్‌తో వ్యాపారం చేయకుండా నిరో ధించినట్లు చరిత్ర చెబుతుంది.
భారత్ లో బ్రిటిష్ రాజ్ ఏర్పడిన తరువాత, భారత నౌకాదళం రద్దు చేయబడి దాని స్థానంలో బ్రిటిష్ వారి రాయల్ నేవీ ఏర్పాటవడంతో భారతీయ నౌకానిర్మాణ దారులు రాయల్ నేవీ కోసం నౌకలను నిర్మించనారంభిం చారు. ఈ నౌకల్లో, హెచ్‌ఎంఎస్ హిందుస్థాన్, హెచ్‌ఎంఎస్ సిలోన్, హెచ్‌ఎంఎస్ ఆసియా, హెచ్‌ఎంఎస్ కార్న్‌వాలిస్ మరియు హెచ్‌ఎంఎస్ మైండెన్ ఉన్నాయి. 1736 మరి యు 1821 మధ్య, బాంబే డాక్‌యార్డ్ 100 టన్నుల కంటే ఎక్కువ బరువున్న 159 నౌకలను ఉత్పత్తి చేసింది, ఇం దులో 1,000 టన్నుల కంటే ఎక్కువ బరువు గలవి 15 కావడం విశేషం.
విజన్ 2030 :
భారతీయ సముద్ర పరిశ్రమ అభివృద్ధికి మరింత దోహదపడాలనే లక్ష్యంతో 22 ఫిబ్రవరి 2021న ప్రధాన మంత్రి మారిటైమ్ ఇండియా విజన్ 2030ని ప్రకటించారు. గత సంవత్సరం జాతీయ సముద్రయాన దినోత్సవం సందర్భంగా, కేంద్ర ఓడరేవులు, షిప్పింగ్, జలమార్గాల శాఖ సహాయ మంత్రి శ్రీపాద్ వై. నాయక్ ఈ దృక్పథాన్ని నెరవేర్చడానికి ప్రపంచ భాగస్వామ్యాలను ప్రోత్సహించాల్సిన అవసరం గురించి ప్రముఖంగా ప్రస్తావించారు.
సముద్రయాన పరిశ్రమ ప్రాముఖ్యత :
ప్రపంచ వాణిజ్యం సముద్ర పరిశ్రమకు జీవనా ధారం. అది లేకపోతే ఈ పరిశ్రమకు ఉనికే లేదు. ప్రపంచ వాణిజ్యంలో భాగంగా 95 శాతం కంటే ఎక్కువ సరుకు రవాణా అంటే సాలీనా దాదాపు 11 బిలియన్ టన్నులు జల మార్గం ద్వారానే జరుగుతుంది. ఒకింత నమ్మశక్యం కానప్పటికీ ఇదంతా కూడా కేవలం 50 వేల వాణిజ్య నౌక ల ద్వారా జరుగుతుంది. వాణిజ్య నౌకల నిర్మాణం, పటి ష్టత మరియు ఓడరేవుల యొక్క సామర్థ్యం ప్రపంచ వాణి జ్యంపై ఎంతో ప్రభావాన్ని చూపుతాయి. ఇందుకు ఉదాహ రణగా 2020లో సూయజ్ కెనాల్‌లో ఎవర్ గివెన్ వాణిజ్య నౌక మునక గురించి ప్రస్తావించవచ్చు. సముద్ర గర్భం నుండి ఈ నౌక విడుదలయ్యే వరకు 60 బిలియన్ డాలర్ల విలువైన ప్రపంచ వాణిజ్యం స్తంభించిపోయింది. మిగతా వాటితో పాటు ఈ నౌకలో ప్రత్యేకించి టాయిలెట్ కాగితం తయారీకి కావలసిన కలప గుజ్జు ఉండడంతో టాయిలెట్ పేపర్ కు తీవ్ర కొరత ఏర్పడింది. ఈ కొరత కోవి్‌డ19 మహమ్మారి కారణంగా కాక జల రవాణాలో ఉత్పన్నమైన సంక్షోభం కారణంగా ఏర్పడిన ప్రత్యక్ష ప్రభావం.
సముద్ర పరిశ్రమ ప్రపంచవ్యాప్తంగా ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా ఉపాధికి ప్రధాన వనరుగా కొనసాగు తోంది. ఇంటర్నేషనల్ మారిటైమ్ ఆర్గనైజేషన్ (ఐఎంఓ) ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా 1.8 మిలియన్లకు పైగా నావి కులు (అధికారులు మరియు సిబ్బంది)తో పాటు 20 మిలియన్లకు పైగా సముద్ర ఆధారిత సిబ్బంది, నౌకాశ్రయ కార్మికులు, నౌకానిర్మాణదారులు మరియు మెరైన్ ఇంజ నీర్లు ఈ పరిశ్రమ ద్వారా ఉపాధి పొందుతున్నారు.
పర్యావరణ పరిరక్షణకు సముద్ర పరిశ్రమ అత్యంత కీలకమైనది. FAOSTAT ప్రకారం, 90 శాతం ప్రపంచ వాణిజ్యం జల రవాణా ద్వారా జరుగుతున్నప్పటికీ, ప్రపంచ GHG జీహెచ్‌జీ ఉద్గారాలలో షిప్పింగ్ పరిశ్రమ నుండి వెలువడేది కేవలం 1.7% మాత్రమే. దీని అర్థం టన్ను-కిలోమీటర్‌కు జీహెచ్‌జీ ఉద్గారాల విషయానికి వస్తే షిప్పింగ్ అత్యంత సమర్థవంతమైన రవాణా విధానం అని స్పష్టమవుతోంది. పర్యావరణ ప్రభావాన్ని మరింత తగ్గించేందుకు పరిశ్రమ తీవ్రంగా కృషి చేస్తోంది. 2008 స్థాయిలతో పోలిస్తే 2050 నాటికి షిప్పింగ్ నుండి జీహెచ్ జీ ఉద్గారాలను కనీసం 50% తగ్గించాలని 2015లో ఐఎం ఓ లక్ష్యంగా పెట్టుకుంది. 2008 మరియు 2018 మధ్య ఉద్గారాలు 3.2% తగ్గడంతో, ఈ లక్ష్యసాధనలో విజయం సాధిస్తుందని ఆశిద్దాం.
సముద్రతీర భద్రత:
ప్రస్తుతం భారతదేశ తీర భద్రత మూడు అంచెల నిర్మాణం ద్వారా నిర్వహించబడుతుంది. ఇండియన్ నేవీ ఇంటర్నేషనల్ మారిటైమ్ బౌండరీ లైన్‌లో గస్తీ నిర్వహిస్తుంది, అయితే ఇండియన్ కోస్ట్ గార్డ్ 200 నాటికల్ మైళ్ల వరకు (అంటే, ప్రత్యేక ఆర్థిక మండలి) పెట్రోలింగ్ మరియు నిఘాను నిర్వహిస్తుంది. ప్రపంచ సముద్ర దినోత్సవం సముద్ర రంగంలో పనిచేసే వ్యక్తుల అంకితభావాన్ని గౌరవించేందుకు ప్రతి సంవత్సరం సెప్టెంబరు నెల చివరి గురువారం నాడు ప్రపంచ సముద్ర దినోత్సవం జరుపు కుంటారు. లాటిన్ పదం ‘మారిటిమస్’ అంటే ‘సముద్రం యొక్క’ అని అర్ధం. ఇది ఆంగ్ల జట్టు పేరు ‘మారిటైమ్’ నుండి వచ్చింది. నావికులు, సేవా సిబ్బంది మరియు సముద్ర అధికారులు మన దైనందిన జీవితంలో పోషించే భాగాన్ని ఈ రోజు స్పష్టం చేస్తుంది.