Home News నెస్లే సెరిలాక్ మోతాదుకు మించి చక్కెర

నెస్లే సెరిలాక్ మోతాదుకు మించి చక్కెర

0
SHARE

గ్లోబల్ ఫుడ్ అండ్ బెవరేజీ దిగ్గజం నెస్లే యూరప్‌లోని మార్కెట్లతో పోలిస్తే పేద దక్షిణాసియా (భారతదేశంతో సహా), ఆఫ్రికన్, లాటిన్ అమెరికా దేశాలలో చక్కెర కంటెంట్‌తో కూడిన పిల్ల‌లు తినే ఉత్పత్తులను విక్రయిస్తుందని స్విస్ NGO, పబ్లిక్ ఐ, ఇంటర్నేషనల్ బేబీ ఫుడ్ యాక్షన్ నెట్‌వర్క్ (IBFAN) నివేదిక పేర్కొంది. వివిధ కౌంటీలలో విక్రయించే సుమారు 150 పిల్లల‌ బేబీ ఉత్పత్తులను నివేదిక కోసం పరిశీలించారు. అందులో అంతర్జాతీయ ఆహార భద్రతా మార్గదర్శకాలకు మించి చక్కెర ఉన్నట్లు గుర్తించారు.

నివేదిక ప్రకారం, ఆసియా, లాటిన్ అమెరికా, ఆఫ్రికాలో విక్రయించే ఆరు నెలల శిశువులకు సంబంధించిన అన్ని గోధుమ ఆధారిత బేబీ ఫుడ్స్‌లో అత్యధిక చక్కెర ఉన్నట్టు గుర్తించారు. నెస్లె ఉత్పత్తుల్లో సగటున 3 గ్రాముల చక్కెర ఉన్నట్లు కనుగొన్నారు. పబ్లిక్ ఐ ఈ దేశాల్లోని కంపెనీకి చెందిన 150 ఉత్పత్తులను బెల్జియంలోని ల్యాబ్‌లో పరీక్షించింది. పబ్లిక్ ఐ ఈ వాదన నిజమని తేలితే, అది ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్లుహెచ్‌ఒ ) సూచనలను ఉల్లంఘించినట్లే అవుతుంది. డబ్లుహెచ్‌ఒ మార్గదర్శకాల ప్రకారం, 3 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు ఆహారంలో చక్కెర లేదా తీపి పదార్థాలను ఉపయోగించకూడదు.

యూరోపియన్ దేశాల బేబీ ఉత్పత్తులలో చక్కెర లేదు

నివేదికల ప్రకారం, బ్రిటన్, జర్మనీ దేశాల్లో ఆరు నెలల చిన్నారుల నెస్లె సెరెలాక్ ఉత్పత్తులకు ఎలాంటి చక్కెరను జోడించలేదు. కానీ భారత్‌లో 15 సెరెలాక్ ఉత్పత్తులకు సగటున 2.7 గ్రాముల చక్కెరను యాడ్ చేసినట్లు గుర్తించారు. నవజాత శిశువుల కోసం విక్రయించే పౌడర్డ్ మిల్క్ నిడోలో ఒక్కో బాటిల్‌లో సగటున 2 గ్రాముల చక్కెర ఉంటుంది. మరోవైపు నెస్లే స్వదేశమైన స్విట్జర్లాండ్‌లో లేదా జర్మనీ, బ్రిటన్, ఫ్రాన్స్ వంటి యూరోపియన్ దేశాలలో విక్రయించే ఉత్పత్తులలో చక్కెర ఉండదు.

యాడెడ్ షుగ‌ర్ అంటే?
ఒక ప్ర‌త్యేక ప్రక్రియ ద్వారా ఆహారాలు, పానీయాలలో జోడించబడే సిరప్‌ల వంటి తీపి కారకాలు. పండ్లు, పాలలో సహజంగా లభించే చక్కెరల కంటే ఇది చాలా హానికరమైనదిగా పరిగణించబడుతుంది.

ఎందుకు హానికరం?
WHO నిబంధ‌న‌ల ప్ర‌కారం రెండు సంవత్సరాల వయస్సులోపు పిల్ల‌ల‌కు యాడెడ్ షుగ‌ర్ ఉన్న ఆహార ఉత్ప‌త్తుల‌ను పెట్ట‌కూడ‌దు. దీని వ‌ల్ల బరువు పెరగడం, ఊబకాయం, టైప్ 2 మధుమేహం, గుండె జబ్బులు, జీవితంలో కొన్ని రకాల క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక వ్యాధులను అభివృద్ధి చేసే ప్రమాదాన్ని పెంచుతుంది. అదనంగా, శైశవదశలో అధిక చక్కెర వినియోగం దంత క్షయం, పేలవమైన పోషకాల తీసుకోవడం వల్ల కలిగే ప్రమాదంతో ముడిపడి ఉంది.