Home News కొవిషీల్డ్ పై అపోహలొద్దు.. మరోసారి క్లారిటీ ఇచ్చిన ఆస్ట్రాజెన్‌కా

కొవిషీల్డ్ పై అపోహలొద్దు.. మరోసారి క్లారిటీ ఇచ్చిన ఆస్ట్రాజెన్‌కా

0
SHARE
భారత్ లో కొవిషీల్డ్ టీకాపై అపోహలు వ్యక్తమవుతున్న వేళ.. ఆస్ట్రాజెన్‌కా సంస్థ మరోసారి స్పందించింది. తమ కరోనా వ్యాక్సిన్ కొవిషీల్డ్ పూర్తి సురక్షితమైనదని స్పష్టం చేసింది. తమ టీకా తీసుకున్నవారు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రకటించింది. అంతేకాదు.. ప్రయోగపరీక్షల్లో కొవిషీల్డ్ వ్యాక్సిన్ మెరుగైన ఫలితాన్ని ఇచ్చిందని.. అందుకు సంబంధించిన బలమైన ఆధారాలు తమ వద్ద ఉన్నాయని తెలిపింది.
ఇటీవల బ్రిటన్ కోర్టులో తమ వ్యాక్సిన్‌కు సంబంధించి ఆస్ట్రాజెన్‌కా కంపెనీ కీలక వ్యాఖ్యలు చేసింది. వ్యాక్సిన్ తీసుకున్న తమకు రక్తం గడ్డకట్టడం, ప్లేట్ లెట్లు తగ్గడం వంటి సమస్యలు ఎదుర్కొన్నామంటూ కొందరు బ్రిటీష్ సిటిజన్స్ వేసిన కేసులో.. ఆస్ట్రాజెన్‌కా వాదనలు వినిపించింది. అలాంటి దుష్ప్రభావాలు చాలా అరుదుగా వస్తాయని తెలిపింది. అయితే ఆస్ట్రాజెన్‌కా ప్రకటన.. మనదేశంలో ఆందోళనకు గురిచేసింది. కొవిషీల్డ్ వ్యాక్సిన్ వేసుకున్న చాలామంది.. గతంలో తాము ఎదుర్కొన్న ఇబ్బందలను ఏకరువు పెట్టారు. వ్యాక్సిన్ వల్లే తమవారిని కోల్పోయామంటూ పలువురు వ్యాఖ్యానించారు.
అయితే వ్యాక్సిన్ పై వస్తున్న అపోహలను చెక్ పెట్టేందుకు ఏకంగా ఏయిమ్స్ వైద్యులే ముందుకొచ్చారు. కొవిషీల్డ్ టీకాపై ఆందోళన వద్దని ప్రకటించారు. వ్యాక్సిన్ వేసుకున్న వారిలో దుష్పరిణామాలు చాలా అరుదుగా సంభవిస్తాయని పేర్కొన్నారు. ఒకవేళ ఇబ్బందులు తలెత్తినా.. ఫస్ట్ డోస్ వేసుకున్న 2 నుంచి 3 నెలల్లోపే బయటపడాలని.. ఇంతకాలం వాటి ప్రభావం వ్యాక్సిన్ వేసుకున్నవారిపై ఉండదని స్పష్టం చేశారు.
ఈ క్రమంలో కొవిషీల్డ్ వ్యాక్సిన్ తయారుచేసిన బ్రిటీష్-స్వీడీష్ కంపెనీ అయిన ఆస్ట్రాజెన్‌కా.. భారత్ లో వ్యక్తమైన అపోహలపై స్పందించింది. తమ వ్యాక్సిన్ వల్ల ఎలాంటి ప్రమాదం లేదని.. అందుకు సంబంధించిన విషయమేదీ ఇప్పటివరకు తమ వద్దకు రాలేదని వివరణ ఇచ్చింది. వాస్తవానికి ఆస్ట్రాజెనకా కరోనా వ్యాక్సిన్‌ ఫార్ములాతో.. మన దేశంలోని పుణెకు చెందిన సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా కంపెనీ ఈ టీకాను తయారు చేసింది.