Home News రాబోయే అతిపెద్ద ముప్పు ఇస్లామే… ప్రపంచం మేలుకోవాలి : మోసబ్‌ హసన్‌

రాబోయే అతిపెద్ద ముప్పు ఇస్లామే… ప్రపంచం మేలుకోవాలి : మోసబ్‌ హసన్‌

0
SHARE

ఇస్లాం మతానికి వ్యతిరేకంగా పోరాడకుంటే ప్రపంచం మొత్తం ప్రమాదంలో పడటం గ్యారెంటీ అని ఇస్లామిక్‌ ఉగ్రవాద సంస్థ హమాస్‌ వ్యవస్థాపకుడు యూసుఫ్‌ కుమారుడు మోసబ్‌ హసన్‌ మరోసారి హెచ్చరించాడు. పాలస్తీనాకి ఏక వాక్యంలో నిర్వచనం చెప్పాలంటే… ఇజ్రాయిల్‌ను పూర్తిగా నాశనం చేయడమే దాని కర్తవ్యమని అన్నాడు. మొసాబ్‌ ఓ ఉగ్రవాది. ఈ విషయాన్ని మనం గమనంలోకి తీసుకోవాలి. హమాస్‌ కంటే పాలస్తీనాయే అతిపెద్ద ముప్పు అని తేల్చి చెప్పారు.

ప్రపంచం మొత్తం మేల్కొవాలని, రాబోయే అతిపెద్ద ముప్పు ఇస్లామేనని నొక్కి చెప్పారు. దాంతో గనక ప్రపంచం పోరాడని పక్షంలో ప్రపంచం అస్తిత్వమే ప్రమాదంలో పడిపోయే ప్రమాదం వుందన్నారు. పోరాడటం గనక ఆలస్యమైతే..అందరూ ప్రమాదంలో పడిపోయే ఛాన్స్‌ వుందని హెచ్చరించారు. హమాస్‌ సహ వ్యవస్థాపకుడు షేక్‌ హసన్‌ యూసుఫ్‌ కుమారుడే ఈ మొసాబ్‌. పాలస్తీనా మాజీ ఉగ్రవాది. కానీ 2019 లో ఇజ్రాయిల్‌ వెళ్లి, అక్కడ ఇంటెలిజెన్స్‌ యూనిట్‌ షిన్‌ బెట్‌కి గూఢచారిగా కూడా పనిచేశాడు. ఆ తర్వాత అమెరికా వెళ్లాడు.