తెలుగు మీడియా రంగ ప్రముఖుడు, ఈనాడు పత్రిక, ఈటీవీ, రామోజీ ఫిలిం సిటీల వ్యవస్థాపకులు రామోజీరావు మృతి పట్ల రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) సర్‌కార్యవాహ దత్తాత్రేయ హోసబలె ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. ఆర్ఎస్ఎస్ ‘ఎక్స్’ ఖాతా ద్వారా ఆయన తన సంతాప సందేశాన్ని తెలియజేశారు.
Eenadu and Ramoji Film City founder Shri Ramoji Rao’s demise is a great loss especially for the field of journalism and film. His contribution as a pioneer in adding unique features and practices in his chosen field will be long remembered. We extend our heartfelt condolences to… pic.twitter.com/9GEloD8WM0
— RSS (@RSSorg) June 8, 2024
రామోజీరావు మరణం ప్రత్యేకించి పాత్రికేయ, సినిమా రంగాలకు తీరని లోటు అని ఆర్ఎస్ఎస్ సర్‌కార్యవాహ దత్తాత్రేయ హోసబలె తమ సంతాప సందేశంలో పేర్కొన్నారు. రామోజీరావు తాను ఎంచుకున్న రంగంలో పలు ప్రత్యేక లక్షణాలు, కార్యాచరణశైలిని జోడించిన మార్గదర్శకుడిగా ఆయన తోడ్పాటు చిరకాలం గుర్తుండిపోతుందని హోసబలె అన్నారు. దివంగత రామోజీరావు కుటుంబ సభ్యులు, అసంఖ్యాకులైన అభిమానులకు హృదయపూర్వక సానుభూతిని తెలిపారు. ఆయన ఆత్మకు సద్గతి ప్రసాదించాలని సర్వశక్తిమంతుడిని ప్రార్థిస్తున్నట్లు దత్తాత్రేయ హోసబలె తెలిపారు.
ईनाडु और रामोजी फ़िल्म सिटी के संस्थापक श्री रामोज़ी राव का निधन मुख्यतः पत्रकारिता और सिनेमा के क्षेत्र में एक बड़ी क्षति है। इन क्षेत्रों में अनूठी विशेषताओं और परंपराओं को जोड़ने में उनकी अग्रणी भूमिका और उनके योगदान को लंबे समय तक याद रखा जाएगा। उनके शोक-संतप्त परिवार और… pic.twitter.com/GhbG9pgn95
— RSS (@RSSorg) June 8, 2024